Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పిల్లల శిక్షణలో తల్లితండ్రుల ప్రత్యేక తరుణం

    అవి బిడ్డలో కృతజ్ఞత దైవ భీతి మేలుకొల్పేందుకు ఎవరి జీవితాలు దైవికి జీవితాన్ని ప్రతిబింబిస్తాయో ఆ తల్లితండ్రులు ధన్యులు. బిడ్డలకు ఎవరి కనికరం, న్యాయశీలత, దీర్ఘశాంతం దేవుని ప్రేమ. న్యాయశీలత, దీర్ఘశాంతాల్ని విశదీకరిస్తాయో ఆ తల్లితండ్రులు ఎవరు బిడ్డకు తమను ప్రేమించి విశ్వసించి తమకు విధేయులై ఉండాలని బోధించటం ద్వారా పరలోకమందున్న తండ్రిని ప్రేమించి విశ్వసించి ఆయనకు విధేయులై ఉండటం నేర్పిస్తారో ఆ తల్లితండ్రులు ధన్యులు. ఓ బిడ్డకు అటువంటి వరం ఇచ్చే తల్లితండ్రులు తమ బిడ్డకు అన్ని యుగాల్లోని ప్రశస్తమైన భాగ్యమంతటికన్నా విలువైన ఐశ్వర్యాన్ని ఇచ్చిన వారవతారు. అది నిత్య కాలమంత శాశ్వతమైన ఐశ్వర్యం.MHTel 322.3

    “తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదే” యె హెజ్యేలు 16:44MHTel 322.4

    తన శ్రద్ధాసక్తులకు అప్పగించబడ్డ బిడ్డల్లో ప్రతి తల్లికీ దేవుని వద్ద నుండి ఓ పవిత్ర బాధ్యత వసు “ఈ కుమారుణ్ణి ఈ కుమార్తెను తీసుకొని అతణ్ణి లేక ఆమెను నా కోసం తర్బీతు చెయ్యి. ప్రభువు రాజ్యంలో నిత్యం ప్రకాశించేటట్లు ఓ రాజ భవానాన్ని పోలిన ప్రవర్తనను అతడికి లేక ఆమెకు దిద్దు ” అంటున్నాడు ఆయన.MHTel 322.5

    తరుచు తల్లి పని ప్రాముఖ్యం లేని సేవగా తల్లికి కనిపించవచ్చు. అది తరుచుగా అభినందన పొందే సేవ. ఆమె అనేకమైన చింతలు భారాలు ఇతరులు ఎరుగరు, ఓర్పు కలిగి పని చెయ్యటం, ఆత్మ నిగ్రహం, నేర్పు, వివేకం, ఆత్మ త్యాగపూరిత ప్రేమ అవసరమైన చిన్న చిన్న విధులతో ఆమె దినాలు గడుస్తాయి. అయినా తాను చేస్తున్నది గొప్ప సాధనగా చెప్పుకుని అతిశయించలేదు. తాను చేస్తున్నది ఇంటి విషయాలు సరిగా జరిగేటట్లు చెయ్యటం మాత్రమే. పిల్లల్ని సంతోషంగా ఏదో పనిలో ఉంచటానికి, వారి చిన్నారి పాదాలు సరియైన మార్గంలో నడిపించటానికి తరుచు అలసి తికమక పడ్డా ఆమె పిల్లలతో దయగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. తాను సాధించింది ఏమి లేదని ఆమె భావిస్తుంది. అది నిజం కాదు. చింతలతో చిక్కిన తల్లి దినదినం మోస్తున్న భారాల్ని పరలోక దూతలు చూస్తున్నారు. లోకంలో ఎక్కడా ఆమె పేరు వినిపించకపోవచ్చు కాని అది గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉంది.MHTel 323.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents