Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సానుభూతి

    మనసు ద్వారా వచ్చిన వ్యాధుల విషయంలో వ్యవహరించటంలో ఎంతో వివేకం అవసరం. రోగంతో బాధపడుతున్న హృదయానికి నిరాశతో నిండిన మనసుకు మృదువైన చికిత్స కావాలి. అనేకసార్లు ఏదో గృహ సమస్య క్యాన్సరులా ఆత్మలోకి తీసకుంటూ పోయి జీవ శక్తిని బలహీన పర్చుతుంది. కొన్నిసార్లు పాపం నిమిత్తం పశ్చాత్తాపం దేహతత్వాన్ని బలహీనపర్చి మానసిక సమతూకాన్ని దెబ్బతీస్తుంది. ఈ తరగతికి చెందిన మానసిక వికలాంగులకు మృదువైన సానుభూతి మేలు చేస్తుంది. వైద్యుడు ముందు వారి విశ్వాసాన్ని పొందాలి. ఆ తరువాత వారిని ఆ మహా వైద్యునికి పరిచయం చెయ్యాలి. నిజమైన ఆ వైద్యునిలో విశ్వాసముంచటానికి వారిని నడిపిస్తే ఆయన తమ విషయాన్ని చేపడతాడని వారు విశ్వసించగలిగితే ఇది వారి మనసుకు ఉపశమనాన్ని శరీరానికి ఆరోగ్యాన్ని తెస్తుంది.MHTel 205.3

    వ్యాధిగ్రస్తులకు నిరాసక్తంగా ఇచ్చే సంపూర్ణమైన చికత్స కన్నా సానుభూతి, నేర్పు ఎక్కువ ప్రయోజకరంగా పరిణమిస్తుంది. ఓ వైద్యుడు ఓ రోగి పడక దగ్గరకు వచ్చి ఆశ్రద్ధగాను ఆందోళన లేకండాను రోగి వంక చూస్తే మాట ద్వారా గాని క్రియ ద్వారా గాని అతడికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదన్న అభిప్రాయాన్నిచ్చి రోగిని తన ఆలోచనల్లో విడిచి పెట్టి వెళ్లిపోతే అతడు ఆరోగికి కీడు చేసినవాడవుతాడు. అతడి ఉదాసీనత వల్ల రోగిలో కలిగిన సందేహాం నిరాశ అతడిచ్చే మందుల మంచి ఫలితాన్న నిరర్ధకం చెయ్యవచ్చు.MHTel 205.4

    బాధ వల్ల దీన స్వభావుడైన మనశక్తి బలహీనపడిన వ్యక్తి సానుభూతి గల మాటలు మద్దతు హమీనిచ్చే మాటల కోసం ఎదరుచూసే వ్యక్తి స్థలంలో వైద్యులు తమను తాము పెట్టుకుంటే వారు అతడి మనోభావాలకు మెరుగుగా అవగాహన చేసుకోగలుగుతారు. వ్యాధిగ్రస్తుల పట్ల క్రీస్తు చూపించిన సానుభూతిని వైద్యుడి జ్ఞానంతో మిళితం చేస్తే కేవలం అతడి సముఖమే ఓ దీవెనగా ఉంటుంది.MHTel 206.1

    ఓ రోగితో వ్యవహరించటంలో నిజాయితీ ఆ రోగిలో నమ్మకం పుట్టించి అతడు కోలుకోవటానికి సహాయపడుతుంది. రోగి బాధపడుతున్న వ్యాధిని గురించి దానికి కారణాలను గురించి రోగికి చెప్పకుండా ఉచంటం విజ్ఞతగా పరిగణించే వైద్యులు కొందరున్నారు. సత్యం చెప్పటం వల్ల రోగికి ఉద్రేకం లేక నిరుత్సాహం కలిగించటానికి భయపడి అనేక మంది వైద్యులు రోగి బాగుపడతాడు అన్న అబద్ద విశ్వాసం అతడిలో సృష్టిస్తారు. తన ప్రమాదాన్ని గూర్చి హెచ్చరించకుండా అతడు సమాధికి వెళ్లటం అనుమతిస్తారు. ఇదంతా అవివేకం.తన ప్రమాదాన్ని గుర్తించి రోగికి పూర్తిగా వివరించటం ఎల్లప్పుడూ క్షేమం ఉత్తమం కాకపోవచ్చు. అది అతడిలో భయాన్ని రేపి స్వస్థతను ఆలస్యం చెయ్యవచ్చు లేక స్వస్థతతను దూరం కూడా చెయ్యచ్చు. ఎవరి వ్యాధులు చాల మట్టుకు ఊహజనిత మైనవో వారికి తమ వ్యాధిని గురించి సత్యమంతా చెప్పకూడదు. వీరిలో అనేకులు సరిగా ఆలోచించలేనివారు. ఆత్మ నిగ్రహాన్ని పాటించటానికి తమను తము తర్బీతు చేసుకున్నవారు కారు. వారి ఊహలు విచిత్రమైనవి వారు తమను గురించి ఇతరులను గురించి ఊహించే అనేక విషయాలు నిజం కాదు. వారికి మాత్రము ఇవి నిజాలు వారిని గురించి శ్రద్ధ తీసుకునేవారు నిత్యం దయను ఆలు పెరగని ఓర్పును నేర్పును ప్రదర్శించాలి ఈ రోగులకు తమను గురించిన సత్యాన్ని చెబితే కొందరికి తీవ్ర అభ్యంతరం, కొందరికి స్పృహ కలుగవచ్చు. క్రీస్తు తనశిష్యులతో అన్నాడు. “నేను నీతో చెప్పవలసిన సంగతులు ఇంకను అనేక సంగతులు కలవు కాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు”. యోహాను 16:12 సత్యమంతా అన్ని సమయాల్లోను చెప్పకపోయినా, మోసగించాల్సిన అసవరంలేదు. అది సమర్ధనీయము కాదు., వైద్యుడుగాని నర్సుగాని సందిగ్ధంగా చెప్పటం గాని అబద్దం చెప్పటం గాని ఎన్నడూ చెయ్యకూడదు. ఇది చేసే వ్యక్తి దేవుడు తనతో సహకరించలేని పరిస్థితిలోకి తనను తాను నెట్టుకుంటున్నాడు. తన రోగుల నమ్మకాన్ని పోగొట్టుకోవటంలో వారి పునరుద్ధరణలో మిక్కిలి ఉపయోగకరమైన మానవ సహాయకులను అతడు పోగొట్టుకుంటున్నాడు.MHTel 206.2

    మనశక్తి విలువను గుర్తించాల్సినంతగా గుర్తించటం జరగటం లేదు. మనశక్తిని చురుకుగా ఉంచి దాన్ని సరియైన దిశలో పోనివ్వండి. అప్పుడది యావచ్చరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతమైన సహకారి అవుతుంది. రోగాన్ని ఎదుర్కొటంలో అది ఓ శక్తి కూడా. సరియైన మార్గంలో దాన్ని ఉపయోగిస్తే ఊహను నియంత్రించి మనసుకు శరీరానికి సంబంధిం చిన వ్యాధులను ప్రతిఘటించటంలలోను జయించటంలోను శక్తిమంత మైన సాధనమౌతుంది. మనశక్తిని ఉపయోగించుకొని జీవితానికి తమను తాము సరియైన సంబంధములో ఉంచుకోవటం ద్వారా రోగులు తమ స్వస్థతకు వైద్యుడి కృషికి సహకరించటంలో ఎంతో చెయ్యవచ్చు. తాము ఇష్టపడినట్లయితే వ్యాధినుండి కోలుకోగలవారు వేలమంది ఉన్నారు వారు వ్యాధిగ్రస్తులై ఉండాలని ప్రభువు కోరటంలేదు. స్వస్థత పొందాలని వారు తీర్మానించుకోవాలి. తరుచు వికలాంగులు వ్యాధులకు లొంగకుండా ఉండటానికి తీర్మానించుకోవటం ద్వారా వ్యాధిని ప్రతిఘటించి పని ఏమి చెయ్యకుండా ఉండే స్తితిలో స్థిరపడతారు. వారు తమ నొప్పులు బాధలను అధిగమించి తమ శక్తికి అనుగుణమైన ఉపయోగకరమైన పనిలో నిమగ్న మవ్వాలి. అలాంటి పని ద్వారా గాని, సూర్యరశ్మి ధారాళ వినియోగం ద్వారా అనేకమంది వికలాంగులు ఆరోగ్యాన్ని శక్తిని తిరిగి సంపాదించవచ్చు.MHTel 207.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents