Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జన సమూహానికి భోజనమైన ఐదు చిన్న రొట్టె ముక్కలు

    క్రీస్తు సముద్రం పక్క బోధిస్తుండగా జన సమూహాలు అయిన శిష్యులు చుట్టు మూగారు. దయగల ఆయన మాటలు విన్నారు. సామాన్యమైన, స్పష్టమైన ఆ మాటలు వారి ఆత్మలకు గిలాదులోని గుగ్గిలంలా ఉన్నాయి. స్వస్థత కూర్చే ఆయన హస్తం రోగులకు ఆరోగ్యాన్ని మరణిస్తున్నవారికి జీవాన్ని ఇచ్చింది. వారికి ఆ దినం భూమి పై వెలసిన స్వర్గంలా ఉంది. తాము భోజనం తిని ఎంత సేపయ్యిందో కూడా ఎరుగకకుండా ఉన్నారు.MHTel 26.1

    సూర్యుడు అస్తమిస్తున్నాడు. అయినా ప్రజలింకా అక్కడే ఉన్నారు. కడకు శిష్యులు క్రీస్తు వద్దకు వచ్చి జనుల్ని పంపివేయటం మంచిదని సూచించారు. అనేక మంది ఎంతో దూరం నుండి వచ్చారు. ఉదయం నుండి వారు ఏమి తినలేదు, చుట్టూ ఉన్న పట్టణాలు గ్రామాల్లో వారికి ఆహారం దొరకొచ్చు అని సూచించారు. కాగా యేసన్నాడు. “మీరే వారికి భోజనము పెట్టుడి” మత్తయి 14:16 అప్పుడు ఫిలిప్పు వైపు తిరిగి, “వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము?”అని అడిగాడు. యోహాను 6:5MHTel 26.2

    ఫిలిప్పు ఆ జన సముద్రాన్ని పారజూసి అంత పెద్ద జన సమూహానికి ఆహారం పెట్టటం సాధ్యం కాని పని అని తలంచాడు. వారిలో అందరికి కొంచెం కొంచెం ఇవ్వటానికి కూడా రెండు వందల దేనారాల రొట్టెలు చాలవు అన్నాడు.MHTel 26.3

    జనుల వద్ద ఎంత ఆహారం ఉన్నదని యేసు ప్రశ్నించగా, “ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యువల రొట్టెలు రెండు చిన్న చేపలున్నవి గాని ఇంత మందికి ఇవి ఏ మాత్రము? అని ఆంద్రియ అన్నాడు. 9వ వచనం. వాటిని తన వద్దకు తెమ్మని యేసు ఆదేశించాడు. అంతట జనాల్ని పచ్చిక బయలులో కూర్చోబెట్టాల్సిందిగా శిష్యుల్ని ఆదేశించాడు. ప్రజల్ని కూర్చోబెట్టటం అయిన తరువాత ఆయన ఆ ఆహారాన్ని తీసుకొని “ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి”. మత్తయి 14:19,20MHTel 26.4

    దైవశక్తి చేసిన అద్భుతం వల్లనే క్రీస్తు జనసమూహానికి ఆహారం పెట్టాడు. అయినా ఆ ఆహారం ఎంత సామాన్యంగా ఉంది! గలిలయలోని జాలరుల దిన దిన భోజనం చేపలు యువల రొట్టె.MHTel 27.1

    ప్రజలకు క్రీస్తు గొప్ప విందు భోజనం ఏర్పాటు చేసేవాడే. కాని రుచిని తృప్తిపర్చేందుకు తయారు చేసిన ఆహారం వారికి మేలు చేసే పాఠాలు నేర్పించి ఉండేది కాదు. ఈ సూచక క్రియ ద్వారా క్రీస్తు సామన్యత పై వారికి పాఠం నేర్పించాలని ఉద్దేశించాడు. ప్రజలు ఈనాడు తమ అలవాట్లలో సామాన్యతను పాటిస్తే ఆదాము అవ్వల్లా ప్రకృతి చట్టాలకు అనుగుణంగా నివసిస్తే, మానవ కుటుంబ అవసరాలకు సరఫరాలు సమృద్ధిగా సమ కూడేవి. కాని స్వార్ధం రుచిని తృప్తి పర్చటానికి పాకులాట, పాపాన్ని దు:ఖాన్ని తెచ్చి పెట్టాయి. ఓపక్క అమితం మరో పక్క లేమి వల్ల.MHTel 27.2

    సుఖ భోగాల్ని తృప్తిపర్చటం ద్వారా ప్రజల్ని ఆకట్టుకోవటానికి యేసు ప్రయత్నించలేదు. సుదీరర్ఘమైన ఉత్సాహభరితమైన ఆరోజున అలసి పోయిన ఆకలిగా ఉన్న ఆ జనసమూహానికి ఆసామాన్యాహారం తన శక్తి విషయంలో తమ జీవిత సామాన్య అవసరాల సరఫరాను గురించిన తన శ్రద్ద విషయంలో ఆయనకు హామీని ఇచ్చింది. రక్షకుడు తన అనుచరులకు లోక భోగాల్ని వాగ్దానం చెయ్యటంలేదు. పేదరికంలో మిగిలి ఉండటం వారి పరిస్థితి కావచ్చు. కాని ఆయన వాగ్దానం ఏమిటంటే వారి అవసరాల్ని తీరుస్తున్నది. లోక సంబంధమైన మేలు కన్నా తన సొంత సముఖం వలన అదరణను ఆయన వాగ్దానం చేస్తున్నాడు.MHTel 27.3

    “కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చితింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపుతండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్య మును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును”. మత్తయి 6:31-33MHTel 27.4

    జనసమూహానికి బోజనం పెట్టిన తరువాత చాలా ఆహారం మిగిలి పోయింది. యేసు తన శిష్యుల్ని ఇలా ఆదేశించాడు. “ఏమియు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడి. యెహాను 6:12 ఈ మాటల అర్ధం ఆహారాన్ని గంపల్లోకి ఎత్తటమే కాదు. అంతకన్నా ఎక్కువే. ఇందులోని పాఠం రెండు రకాలు, ఏది వ్యర్ధం చెయ్యకూడదు. ఏ ఐహిక ఉపకారాన్ని మనం విడిచి పెట్టకూఐడదు. ఒక మనిషికి ఉపకరించేదాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు. లోకంలో ఆకలిగా ఉన్న వారి అవసరాల్ని తీర్చగల ప్రతీదానిని మనం పోగుచెయ్యాలి. అదే శ్రద్ధతో మనం ఆత్మ అవసరాల్ని తీర్చటానికి పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని భద్రపర్చు కోవాలి. దేవుని ప్రతీ మాట వలన మనం బతకాల్సి ఉన్నాం. దేవుడు పలికిన ఏమాటనూ మనం పోగొట్టుకో కూడదు. మన నిత్య రక్షణకు సంబంధించిన ఒక్క మాటను కూడా మనం ఆశ్రద్ధ చెయ్యకూడదు. ఒక్క మాట కూడా నిరర్థకంగా భూమి మీద పడకూడదు. రొట్టెముక్కల సూచన క్రియ మనం దేవుని మీద ఆధారపడాలని నేర్పిస్తుంది. క్రీస్తు అయిదు వేలమందికి ఆహారం పెట్టినప్పుడు ఆహారం దగ్గరలో లేదు. ఏదీ మార్గం లేనట్లు కనిపించింది. ఆరణ్యంలో భోజనం పెట్టటానికి స్త్రీలు పిల్లలు గాక ఐదు వేలమంది ఉన్నారు. అక్కడికి రావలసినదిగా ఆ జనసమూహాన్ని ఆయన ఆహ్వానించలేదు. ఆయన సముఖంలో ఉండాలన్న కోరికతో ఆహ్వానంగాని ఆదేశం గాని లేకుండా వారు వచ్చారు. అయితే దినంమంతా తాను చెప్పిన మాటలు విన్న తరువాత వారు ఆకలిగాను బలహీనంగాను ఉన్నారని ఆయనకు తెలుసు. వారిలో అనేకులకు ఆహారం కొనుక్కునేందుకు డబ్బుల్లేవు. ఎవరి నిమిత్తం ఆరణ్యంలో తాను ఉపవాసం ఉన్నాడో ఆప్రజలు ఆకలిగా తమ ఇళ్ళకు వెళ్ళడానికి సహించలేకపోయాడు.MHTel 28.1

    దేవుని కృపే యేసు అక్కడ ఉండటానికి ఏర్పాటు చేసింది. ప్రజల అవసరాన్ని తీర్చే సాధనానికి ఆయన తన పరలోకపు తండ్రి మీద ఆధారపడ్డాడు. మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. అపారమైన వనరులు గల ఆయన సహాయాన్ని ప్రతీ అత్యవసర పరిస్థితిలో మనం కోరాలి.MHTel 28.2

    ఈ సూచన క్రియలో తండ్రి వద్ద నుండి క్రీస్తు పొందాడు. ఆయన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకిచ్చారు. ప్రజలు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. అలాగే క్రీస్తులో ఏకమైనవారందరూ ఆయన వద్ద నుండి జీవాహారాన్ని పొంది దాని ఇతరులకు అందిస్తారు. ఆయన శిష్యులు క్రీస్తుకీ ప్రజలకు మధ్య ఏర్పాటైన ప్రసార సాధనాలు.MHTel 29.1

    “మీరే వారికి భోజనము పెట్టుడి” అన్న రక్షకుని సూచనను శిష్యులు విన్నప్పుడు వారి మనసుల్లో సమస్యలన్ని లేచాయి. “ఆహారం కొనటానికి గ్రామల్లోకి వెళ్లమా? అని వారు ప్రశ్నించారు. కాని యేసు ఏమి చెప్పాడు? మీరే వారికి భోజనము పెట్టుడి.MHTel 29.2

    శిష్యులు తమకున్నదంతా యేసు వద్దకు తెచ్చారు. అయితే తినటానికి వారిని ఆయన ఆహ్వానించలేదు. ప్రజలకు వడ్డించాల్సిందిగా వారిని ఆదేశించాడు., ఆయన చేతుల్లో ఆహారం ఇంతలంతలయ్యింది. యేసు వద్దకు చాపిన శిష్యుల చేతులు నింపబడకుండా ఎన్నడూ లేవు. MHTel 29.3

    ఆ చిన్న మొత్తం అందరికి సరిపోయింది. జనసమూహం తృప్తిగా తిన్నాక శిష్యులు క్రీస్తుతో కలసి పరలోకం నుండి సరఫారా అయిన ఆహారాన్ని తిన్నారు.MHTel 29.4

    బీదలు, ఆజ్ఞానులు బాధితుల అవసరాల్ని చూసినప్పుడు ఎంత తరుచుగా మన హృదయాలు వేదన చెందుతాయి. ఈ గొప్ప అవసరాన్ని తీర్చటానికి మనకున్న అంతంత మాత్రపు శక్తి. అరకొర వనరులు ఏపాటివి? అని ప్రశ్నించుకుంటాం. ఈ కార్యనిర్వహణను చేపట్టటానికి మరెక్కువ సామార్ద్యం గల వ్యక్తికోసం లేక సంస్థ కోసం ఎదురు చూద్దామా? “మీరే వారికి భోజనము పెట్టుడి” అంటున్నాడు క్రీస్తు. మీకున్న ద్రవ్యం సమయం, సామార్థ్యాన్ని వినియోగిచండి. మీ యవల రొట్టెల్ని యేసు వద్దకు తీసుకురండి.MHTel 29.5

    వేలమందికి ఆహారం పెట్టడానికి మీ నిధులు చాలకపోయినా, ఒక వ్యక్తికి ఆహారం పెట్టటానికి అవి సరిపోవచ్చు. యేసు చేతిలో అవి అనేక మందికి ఆహారం పెట్టవచ్చు. శిష్యుల వలె మీకున్నది ఇవ్వండి దాన్ని క్రీస్తు ఇంతలంతలు చేస్తాడు. ఆయన పై సామాన్యంగా యదార్ధంగా ఆనుకున్న వారికి ఆయన ప్రతిఫలమిస్తాడు. స్వల్పంగా ఆరకొరగా ఉ న్నట్లు కనిపించింది గొప్ప విందును సమకూర్చుతుంది.MHTel 30.1

    “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును... అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధిగల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.MHTel 30.2

    “విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణేదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొంది ౦చును. ఇట్టి ఔదర్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబడును” 2 కొరి 9:6-11MHTel 30.3

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents