Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జీవిత సంఘర్షనకు శిక్షణ

    ఆరోగ్యం యాదృచ్చికంగా రాదని మనకు తరచుగా గుర్తు చెయ్యనవసరం లేదు. ఆరోగ్యం నియమ విధేయత ఫలం. క్రీడా సంబంధమైన ఆటలు, బల పరీక్షల్లో పోటీ దారులు దీన్ని గుర్తిస్తున్నారు. ఈ వ్యక్తులు అతిశ్రద్ధగా సిద్ధబాటు నిర్వహిస్తారు. కఠిన శిక్షణకు క్రమశిక్షణకు తమను తాము అప్పగించుకుంటారు. శారీరకమైన ప్రతీ అలవాటును జాగ్రత్తగా క్రమపర్చుకుంటారు ఏ అవయవాన్నయినా లేక ఏ శరీర విధినైనా బలహీనపర్చే లేక కుంటుపర్చే ఆశ్రద్ధ, అమితత్వం లేక నిర్లక్ష్యం అపజం కలిగిస్తుందని వారికి బాగా తెలుసు.MHTel 98.1

    జీవిత సంఘర్షణలో అలాంటి జాగరూకత మరెంత ప్రాముఖ్యం. మనం నిమగ్నమై ఉన్నది. అనుకరణ యుద్ధాల్లో కాదు. మనం ఏ యుద్ధంలో పోరాడుతున్నమో దాని పై నిత్యకాలికమైన ఫలితాలు వేళాడుతున్నాయి. మనం కనిపంచని శత్రువుల్ని కలుసుకోవాలి. మానవుల పై అదుపు కోసం దుష్టదూతలు ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యానికి ఏది హాని కలిగిస్తుందో అది దేహ దారుఢ్యాన్ని దెబ్బ తియ్యటమే గాక మానసిక, నైతిక శక్తుల్ని బలహీనపర్చటానికి దోహదపడుతుంది. అనారోగ్యకరమైన ఏ అలవాటైనా ఒక వ్యక్తిని మంచి చెడుల మధ్య గల బేధాన్ని గుర్తించలేకుండా చేస్తుంది. గనుక అతడు చెడును ప్రతిఘటించడం మరింత కష్టమౌతుంది. అది వైఫల్యం, పరాజయం ప్రమాదాన్ని పెంచుతుంది.MHTel 98.2

    “పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును”. 1 కొరి 9:24 మనం పోరాడుతున్న యుద్ధంలో సరియైన నియమాలకు విధేయులవ్వటం ద్వారా తమను తాము క్రమశిక్షణ చేసుకునే వారందరూ గెలుపు సాధించవచ్చు. జీవిత వివరాల్లోకి వచ్చే సరికి అవి బహు చిన్నవి గనుక ఈ నియమాల ఆచరణ ప్రాముఖ్యం కాదని భావించటం తరుచు జరుగుతుంటుంది. అయితే ప్రమాదంలో ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకుంటే, మనకు సంబంధించనదేదీ చిన్న విషయం కాదు. జీవితంలో జయాన్ని అపజయాన్ని నిర్ధారించే తక్కెటలో ప్రతీ క్రియ దాని బరువును మోపుతుంది. కనుక “బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి”. 24వ వచనం.MHTel 99.1

    మన మొదటి తల్లితండ్రుల విషయంలో అనుచిత ఆహారాశ ఏదెనును పోగొట్టుకోవటానికి హేతువయ్యింది. అన్ని విషయాల్లో మితానుభవానికేమన పునరుద్దరణతో మనుషులు తలంచేదానికన్నా ఎక్కువ సంబంధం ఉంది.,MHTel 99.2

    పూర్వము గ్రీకు క్రీడల్లో పోటీదారులు ఆచరణ చేసిన ఆత్మోపేక్షను ప్రస్తావిస్తూ పౌలంటున్నాడు. “పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయ మగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.MHTel 99.3

    కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను”. 25-27 వచనాలు.MHTel 99.4

    సంస్కరణ ప్రగతి ప్రాథమిక సత్యాన్ని స్పష్టంగా గుర్తించటం పై ఆధారపడి ఉంటుంది. ఓ పక్క సంకుచిత తత్వం, కఠినమైన, ఉత్సాహం ఉద్రేకంలేని సనాతన ధర్మంలో ప్రమాదం పొంచి ఉండగా, మరో పక్క జాగరూకతలేని ఉదార వాదంలో గొప్ప ప్రమాదం ఉంది.MHTel 99.5

    స్థిరమైన సంస్కరణకు పునాది దేవుని ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రానికి విధేయత అవసరాన్ని మనం స్పష్టంగా నిర్మలంగా సమర్పించాలి. దాని నీతి సూత్రాలను ప్రజలముందుంచాలి. దేవుడు ఎంత నిత్యుడో అవి అంత నిత్యమైనవి, మార్పులేనివి.మొదటి మతభ్రష్టత విచారకరమైన ఫలితాల్లో ఒకటి మనుషుడు ఆత్మనిగ్రహం కోల్పోవటం. ఈ శక్తిని తిరిగి సంపాదించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుంది.MHTel 100.1

    శరీరమాధ్యమం ద్వారానే మనసు, ఆత్మ ప్రవర్తన నిర్మాణానికి వృద్ధి చెందుతాయి. కనుక ఆత్మల విరోధి శారీరక శక్తులను బలహీనపర్చి పతనం చెయ్యటానికి తన శోధనలకు పదను పెడతాడు. ఇక్కడ అతడి జయం అర్ధం ఏమిటంటే యావచ్చరీరాన్ని దుర్మార్గతకు అప్పగించటమే. మన భౌతిక స్వభావ ప్రవృత్తి ఉన్నత శక్తి అదుపులో ఉంటే తప్ప గొప్ప కీడును మరణాన్ని కలిగించటం ఖాయం.MHTel 100.2

    శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. మనిషిలోని ఉన్నత శక్తులు పరిపాలన చేయ్యాలి. ఉద్రేకాల్ని చిత్తం అదుపు చెయ్యాలి. అదే సమయంలో చిత్తం దేవుని అదుపులో ఉండాలి. దైవ కృపచే పవిత్రపర్చబడ్డ సుబుద్ది మన జీవితాల్లో రాజ్యాధికారం చలాయించాలి.MHTel 100.3

    దేవుని ధర్మ విధులు మనస్సాక్షి అవగాహనకు తేవాలి. ఆత్మ నిగ్రహా, విధికి పవిత్రత అవసరానికి, భష్టమైన రుచులు, నీచమైన అలవాట్లు నుంచి విడుదల విధికి పురుషులకు స్త్రీలను మేల్కొల్పటం అవసరం. తమ మానసిక, శారీరక శక్తులన్నీ దేవుని వరాలని వాటిని ఆయన సేవ కోసం అత్యుత్తమ స్థితిలో కాపాడటం ప్రాముఖ్యమని వారికి నొక్కి చెప్పాలి.MHTel 100.4

    సూచన రూపంలో సువార్త అయిన పూర్వపు బలి అర్పణ ఆచారంలో దేవుని బలిపీఠం వద్దకు కళంకమున్న అర్పణ తేవటం నిషిద్ధం. క్రీస్తుకు చిహ్నం అయిన బలి పశువు కళంకం లేనిదై ఉండాలి. ఆయన బిడ్డలు ఏవిధంగా ఉండాలో అన్నదానికి... “సజీవ యాగంగా॥ “పరిశుద్ధంగా నిష్కళంకంగా” “దేవునికి అనందాన్నిచ్చేలా” అనటానికి (రోమా 12:1 (ఆర్.వి) ఎఫెసీ 5:27) ఇది ఓ ఉదాహరణ అని దైవ వాక్యం సూచిస్తున్నది.MHTel 100.5

    దేవుని శక్తి లేకుండా వాస్తవమైన సంస్కరణ సాధ్యం కాదు. స్వాభావికమైన నేర్చుకున్న ప్రవృత్తులకు వ్యతిరేకంగా మానవ అడ్డంకులు వడిగా పారే ప్రవాహం ముందు ఇసుక గట్టు వంటివి. మన జీవితాల్లో క్రీస్తు జీవితం ఓ జీవ శక్తిగా మారేవరకు లోపల నుండి బయటనుండి దాడి చేసే శోధనలకు ప్రతిఘటించలేం.MHTel 101.1

    ఆత్మను భ్రష్టం చేసే స్వభావ సిద్ధమైన ప్రవృత్తులపై మానవుడు పరిపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండేందుకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి దైవ ధర్మశాస్త్రానుసారంగా జీవించాడు. దాడి చేసే శరీరాశల పై ఆత్మకు శరీరానికి వైద్యుడైన ఆయన విజయాన్నిస్తాడు. మానవుడు ప్రవర్తన సంపూర్ణతను కలిగి ఉండేందుకు ఆయన ప్రతీ సదుపాయాన్ని ఏర్పాటు చేసాడు.MHTel 101.2

    ఒక వ్యక్తి తనను తాను క్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు మనసు ధర్మశాస్త్ర నియంత్రణకు లోబడుతుంది. అది ప్రతీ బంధీకి విడుదలను ప్రకటించే రాజధర్మశాస్రతం. క్రీస్తుతో ఒకటైనప్పుడు మానవడు స్వతంత్రు డౌతాడు. క్రీస్తు చిత్తానికి లోబడటమంటే సంపూర్ణ మానవుడుగా పునరుద్దరణ పొందటం.MHTel 101.3

    దేవునికి విధేయత అంటే పాప దాస్యం నుంచి స్వేచ్ఛ మానవ ఆవేశం ఉద్వేగం నుంచి విడుదల మానవుడు తన పైతాను విజేత, తన ఇష్టాలు లాలసత్వాల పై విజేత, అధికారులు శక్తుల పై విజేత “ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులపై విజేత “ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాల” పై విజేత కావచ్చు. ఎఫెసీ 6:12MHTel 101.4

    ఇలాంటి ఉపదేశం గృహంలో అవసరమైనంతగా మరెక్కడా అవసరమవ్వదు. దాని ఫలితాల వలన గృహంలో చోటుచేసుకునే మేలు ఇంతా అంతా కాదు. అలవాట్లు ప్రవర్తన పునాదితో తల్లితండ్రులకు సంబంధము ఉంటుంది. తమ శారీరక, నైతిక ఆరోగ్యంతో సంబంధమున్న వాటిగా ధర్మశాస్త్ర సూత్రాల్ని వారికి సమర్పించంతో ఈ సంస్కరణోద్యం ప్రారంభం కావాలి. లోకాన్ని నాశనానికి నడిపిస్తున్న దుష్టత దుర్మార్గతకు అహుతి కాకుండా దేవుని ధర్మశాస్త్రానికే విధేయంగా జీవించటం ద్వారాMHTel 101.5

    మాత్రమే మనల్ని మనం కాపాడుకోగలమని వారికి చూపించండి. తమ విషయంలోనే గాక తమ బిడ్డల విషయంలో కూడా వారు బాధ్యులని తల్లితండ్రులకు స్పష్టం చేయ్యండి. విధేయతలోనైనా లేక అతిక్రమంలోనైనా వారు తమ బిడ్డలకు ఆదర్శలవుతారు. తమ ఆదర్శం, బోధ వల్ల వారి గృహాల భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. తల్లితండ్రులు తమ పిల్లల్ని ఎలా దిద్దితే వారలా ఉంటారు. తల్లితండ్రులు తమ ఆదర్శం ద్వారా బోధల ద్వారా పాపం శక్తిని లేక నీతి శక్తిని శాశ్వతం చేసి వృద్ధిపర్చే తమ కార్యాల ఫలితాలన్ని చూడటానికి సాధ్యపడి వారు చూడగలిగితే, ఓ మార్పు తప్పక చోటుచేసుకుంటుంది. అనేకులు సంప్రదాయం నుండి ఆచారం నుంచి తొలగి దైవ జీవన నియమాల్ని అంగీకరిస్తారు.MHTel 102.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents