Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రాచీన కావ్యాలు

    కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో వేల విద్యార్థులు తమ జీవితాల్లో చాలా సంవత్సరాలు, ఉత్తమ సంవత్సరాలు గ్రీకు లేటిన్ అధ్యయానికి వెచ్చిస్తుంటారు. వారు ఈ అధ్యయనాల్లో నిమగ్నమై ఉండగా ఈ భాషల అధ్యయాననికి ప్రధానంగా విధిగా చదవాల్సిన అన్యమత సాహిత్యం లోని దుష్ట బావాల కింద వారి మనసులు ప్రవర్తనలు రూపుదిద్దుకుంటాయి.MHTel 386.1

    ప్రాచీన సాహితీ గ్రంథాలతో పరచయమున్నవారు గ్రీకు విషాదాంత రచనలు “స్వరక్త సంబంధులతో సంపర్కం, హత్య, కామం ప్రతీకారేచ్చగల దేవతలకు నరబలి. వీటితో నిండి ఉంటాయి. అని చెబుతారు. అలాంటి మూల నుంచి పొందిన విద్య కాన్న అసలు విద్య లేకపోవటమే లోకానికి ఎంత మేలు. “ఒకడు నిప్పుల మీద నిలిచిన యెడల వాని పాదములు కమలకుండునా”? సామెతలు 6:28 “పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ? అలాగున ఎవడును పుట్టనేరడు”.యోబు 14:4 అలాగైనప్పుడు, దైవ ధర్మశాస్త్ర నియామాల్ని అతిక్రమించే శిక్షకుల బోధన వల్ల ప్రవర్తన రూపు దిద్దుకుంటుండగా యువత క్రైస్తవ ప్రవర్తనలు నిర్మించుకోవటం జరిగే పనేనా?MHTel 386.2

    కట్టడను పక్కన పెట్టి వినోదాలు, విధ్వంసం దుర్మార్గతలోకి విద్యార్థులు దూసుకుపోతుంటే ఈ అధ్యయనం వల్ల తమ మనసుల ముందుంచబడ్డ దాన్నే వారు అనుకరిస్తున్నారు. గ్రీకు లేటిన్ భాషలు అవసరమయ్యే వృత్తులున్నాయి. కొందరు ఈ భాషల్ని అధ్యయనం చెయ్యటం అవసరమే కాని ఆనీతిని పెంచే సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యకుండానే ఆచరణీయ ఉపయోగాలకు వాటి జ్ఞానాన్ని సంపాదించవచ్చు.MHTel 386.3

    గ్రీకు లేటిన్ భాషల జ్ఞానం అవసరం అందరికి ఉండదు. శరీరం మనసు తాలూకు శక్తులనన్నిటిని సరిగా ఉపయోగించటం నేర్పే అంశాలను అధ్యయనం చెయ్యటానికి గానను మాతృ భాషల అధ్యయ నానికి రెండోస్థానం ఇవ్వాలి. జీవిత ప్రయోగాత్మక విధులకు శిక్షణను నిర్లక్ష్యం చేసి మృత భాషాజ్ఞానాన్ని సంపాదించటానికి లేక ఏ శాఖలోనైనా పుస్తక జ్ఞానాన్ని సంపాదించటానికి విద్యార్థులు తమ సమయాన్ని వెచ్చించటం బుద్దిహీనం.MHTel 386.4

    పాఠశాలను విడిచి పెట్టేటప్పుడు విద్యార్థులు తమతో ఏమి తీసుకువెళ్తారు? వారు ఎక్కడకు వెళ్తారు? ఏమి చెయ్యాలి ? ఇతరులకు నేర్పించటానికి కావలసిన జ్ఞానం వారికున్నదా? వాస్తవంగా తండ్రులు తల్లులు కావటానికి వారికి శిక్షణ ఉన్నదా? వివేకవంతులైన ఉపదేశకులుగా వారు కుటుంబ నాయకుడు నాయకురాలుగా నిలపగలరా? యువకులను యువతను క్రీస్తు వద్దకు నడిపే విద్య మాత్రమే యోగ్యమైన విద్య. అది వారిని జీవిత బాధ్యతలు వహించటానికి తమ కుటుంబాలకు నాయకుడు, నాయకురాలుగా నిలవటానిక సమర్ధుల్ని చేస్తుంది. అలాంటి విద్యను అన్యమత సాహిత్యాన్ని అధ్యయనం చేయ్యటం ద్వారా సంపాదించలేం.MHTel 387.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents