Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    3—ప్రకృతితోను దేవునితోను

    భువిలో రక్షకుని జీవితం ప్రకృతితోను సహవాసంలో గడిపిన జీవితం, ఈ సహవావసంలో శక్తిమంతమైన జీవిత రహస్యాన్ని ఆయన మనకు వెల్లడి చేసాడు.MHTel 31.1

    యేసు పట్టుదల స్థిరత గల పనివాడు. ఈయనలా బరువైన బాధ్యతలు మోసిన మానవుడు ఇంకొకడు లేడు. లోక పాపం, దు:ఖం భారాన్ని మోసిన వ్యక్తి మరొకడు లేడు. మనుషుల మేలు కోసం అంత ఉ ద్రేకంతో శ్రమపడ్డ వ్యక్తి ఇంకెవరూ లేరు. అయినా ఆయనది ఆరోగ్యవంతమైన జీవితం. శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆయనను “నిర్దోషమును నిష్కళంకమునగు” అయిన బలిగొర్రె పిల్లను సూచించింది. 1 పేతు 1:19తన ధర్మ విధులకు విదేయులై జీవించడం ద్వారా మానవులు ఏవిధముగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడో దానికి శరీరం విషయంలోను ఆత్మ విషయంలోను ఆయన ఓ ఆదర్శం.MHTel 31.2

    ప్రజలు యేసును చూసినప్పుడు దైవికమైన కారుణ్యంతో శక్తితో మిళితమైన ఓ ముఖాన్ని చూసారు. ఆయనను ఆధ్యాత్మిక జీవిత వాతావరణం ఆవరించి ఉన్నట్లు కనిపించింది. ఆయన వినయ విధేయతలు మాన మర్యాదలు సున్నితమైనవి, నిరాండంబరమైనవి.తనలో దాగి ఉన్న అయినా పూర్తిగా మరుగుకాని, శక్తితో ఆయన మనుషులకు ఆకర్షితు డయ్యాడు.MHTel 31.3

    తన పరిచర్య కాలంలో తనను అంతమొదించటానికి జిత్తులమారులు వేషధారులు అయిన దుష్టులు ఆయనను వెంటాడారు. ఆయనలో ఏదో తప్పు పట్టడటానికి ఆయన మాటల్ని పరిశీలిస్తూ గూఢాచారులు ఆయన మార్గంలో పొంచి ఉన్నారు. దేశంలో ప్రతిభాశాలురు ఉన్న సంస్కారం గల ఘనులు సంవాదంలో ఆయనను ఓడించటానికి కృషి చేసారు. కాని కృతకృత్యులు కాలేకపోయారు. గలతీయుడైన ఈ దీన బోధకుని చేతుల్లో వారు తికమకపడి, సిగ్గుపాలై రణరంగం నుండి నిష్క్రమించారు. మనుషులు మున్నెన్నడూ ఎరుగనితాజాతనం,శక్తి క్రీస్తుబోదనలో ఉన్నా యి. “ఆ మనుష్యుడు మాటలాడినప్పుడు ఎవడును ఎన్నడును మాటలా డలేదు” అని తన విరోధులు సయితం ఒప్పుకున్నారు. యెహాను 7:46MHTel 31.4

    పేదరికంలో గడిచిన యేసు బాల్యం ఆ దుర్మార్గపు యుగం కృత్రిమ అలవాట్లు అభ్యాసాల వల్ల ప్రభావితం కాకుండా పవిత్రంగా సాగింది., వడ్రంగిగా పనిచేస్తూ, గృహ జీవిత భారాలు మోస్తూ విధేయత పరిశ్రమ పాఠాలు నేర్చుకుంటూ ఆయన ప్రకృతి దృశ్యాల నడుమ విశ్రాంతి తీసుకున్నాడు. ప్రకృతిలోని మర్మాల్ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తూ జ్ఞానాన్ని ఆర్జించాడు. ఆయన దైవ వాక్యాన్ని అధ్యయనం చేశాడు. ధ్యానించటానికి దేవునితో మాట్లాడటానికి పొలాల్లోకి నిశ్శబ్దంగా ఉన్న లోయల్లోకి కొండల పక్కకు లేక అడవిలో చెట్ల మధ్యకు వెళ్ళటానికి తన పనిని విడిచి పెట్టి వెళ్ళగలిగి నప్పుడు, ఆయనకు అమితానందం కలిగేది. తరచు ఉదయం పెందలాడే లేచి ఏదో ఏకాంత స్థలానికి వెళ్ళి ధ్యానించడం లేఖనాల్ని పరిశోధించడం లేక ప్రార్ధించడం చేసేవాడూ . ఉదయకాంతిని గానంతో ఆహ్వానించేవాడు. కృతజ్ఞతా గీతాలతో తన పనిని సంతోషంగా నిర్వహిస్తూ పని చేసి అలసి నిరుత్సాహం చెందిన వారికి పరలోకానందాన్ని తెచ్చేవాడు.MHTel 32.1

    తన సువార్త పరిచర్య కాలంలో యేసు ఎక్కువగా బహిరంగ జీవితం జీవించాడు. ఒక చోట నుండి ఇంకో చోటకు కాలి నడకన వెళ్లేవాడు. ఆయన బోధ ఎక్కువ భాగం ఆరుబయట జరిగేది. గలిబిలితో నిండిన పట్టాణాల్ని విడిచి పెట్టి తాను నేర్పదలచిన సామాన్యత, విశ్వాసం ఆత్మ త్యాగ పాఠాలకు అనువైన, ప్రశాంతమైన పొలాలకు తన శిష్యులకు తరచుగా శిక్షకు తీసుకువెళ్ళేవాడు. గలిలయ సముద్రానికి కొంత దూరంలో కొండ పక్క చెట్ల నీడలో ఆయన ఆ పన్నెండు మందిని అపొస్తలుగా పిలిశాడు. కొండమీద ప్రసంగం ఇచ్చాడు. MHTel 32.2

    నీలి ఆకాశం క్రింద కొండ పక్క ఏదో పచ్చి బయలులో లేక సరస్సు పక్క తీరంపైన తన చుట్టు ప్రజల్ని సమావేశ పర్చటానికి యేసు ఇష్టపడేవాడు. ఇక్క డ తాను సృజించిన ప్రకృతి నడుమ వారి తలంపులను కృత్రిమం నుంచి స్వాభావికానికి మరల్చగలిగేవాడు. ప్రకృతి ఎదుగుదల వృద్ధిలో ఆయన రాజ్య సూత్రాలు వెల్లడయ్యయి మనుషులు దేవుని కొండల తట్టు కన్నులెత్తి ఆశ్చర్యకరమైన ఆయాన హస్త కళలైన కృత్యాలు చూసినప్పుడు వారు ప్రశస్తమైన దైవ సత్యాన్ని గూర్చిన పాఠాలు నేర్చుకోగలుగేవారు. ముందు దినాల్లో ఆ దివ్య బోధకుని పాఠాలు ప్రకృతి కార్యాల ద్వారా ఈ విధముగా పునరావృతమౌతాయి.మనస్సు ఉదా త్మమౌతుంది. హృదయానికి విశ్రాంతి లభిస్తుంది.MHTel 32.3

    తన సేవలో తన సహచర శిష్యులు తమ గృహాలు దర్శించేదుకు విశ్రమించేదకు వారిని యేసు తరుచు కొద్ది సమయం విడిచి పెట్టేవాడు. కాని ఆయన్ని తన పరిచర్య నుండి మళ్ళించటానికి వారి ప్రయత్నాలు వ్యర్ధమయ్యేవి. తన వద్దకు వచ్చే జనసమూహాలకు దినమంతా పరిచర్య చేసి సాయంత్రం లేదా ఉదయం పెందలాడే తన తండ్రితో సమావేశానికి కొండల ఆలయానికి వెళ్ళేవాడు.MHTel 33.1

    విరామం లేని శారీరక శ్రమ రబ్బీలతోను వారి తప్పుడు బోధలతోను సంఘర్షన కలిగించిన శ్రమ ఆయాసం ఎంత తీవ్రమైనదంటే అది ఆయన ప్రాణాలకే ముప్పు కలిగిస్తుందని తల్లి సహోదరులు భయపడ్డారు. పని దినానికి సమాప్తం పలికి ప్రార్ధన గడియల ఆనంతరం ఆయన ఇంటికి వచ్చినప్పుడు తన యావచ్చరీరాన్ని ఆలముకున్న సమాధానం తాజాతనం ఆయన ముఖం పై చూసారు. దేవునితో గంటలకొద్ది గడిపిన సమయం నుండి బయటికి వచ్చి ప్రతీ ఉదయం పరలోక కాంతిని మనుషులకు ఆందించాడు.MHTel 33.2

    తన మొదటి మిషనెరీ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన వెంటనే మీరు ఏకాంతంగా వచ్చి కొంత సేపు ఆలసట తీర్చుకోండి అని యేసు తన శిష్యుల్ని ఆదేశించాడు దూతలుగా వెళ్లి శిష్యులు విజయోత్సా హనందాలతో తిరిగి వచ్చారు. అప్పుడు హేరోదు చేతుల్లో స్నానికుడైన యెహాను మరణాన్ని గూర్చిన వార్త వారికి వచ్చింది. అది ఎంతో దు:ఖాన్ని వేదనను నిరాశను నింపింది. స్నానికుడు యెహానును చెరసాలో మరణించటానికి విడిచి పెట్టడంలో శిష్యుల విశ్వాసాన్ని తీవ్రంగా పరీక్షిస్తున్నానని ఆయనకు తెలుసు. కన్నీటి ధారలతో వెలవెల బోయిన వారి ముఖాలు చూసి యేసు జాలిపడ్డాడు. ఈ కన్నీళ్ళు కార్చుతూ బొంగురుబోయిన స్వరంతో అన్నాడు. “మీరేకాంత ముగా ఆరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి”. మార్కు 6:31MHTel 33.3

    బేత్సయిదాకు సమీపంలో గలిలయ సముద్రం ఉత్తరకొనలో వసంత కాలంలోని పచ్చదనంతో మనోహరమైన ఓ ఏకాంత ప్రదేశం యేసు ఆయన శిష్యులు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన స్థలం. ఈ స్థలం చేరటానికి వారు పడవలో సరస్సు దాటి వెళ్ళాల్సి ఉన్నారు. ఇక్కడ వారు జనసమూహాల కోలాహలం గలిబిలికి దూరంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ పరిసయ్యుల ప్రతివాదాలు నిందల వల్ల అంతరాయం లేకుండా శిష్యులు క్రీస్తు మాటలు వినవచ్చు. శిష్యులు ఇక్కడ తమ ప్రభువు సహవాసంలో కొంత సమయం గడుపుతూ ఆనందించటానికి ఎదరు చూసారు.MHTel 34.1

    తన ప్రియ శిస్యులతో ఏకాంతంతగా ఉండటానికి క్రీస్తుకి కొంచెం సమయం మాత్రమే దొరికింది. అయితే ఈ కొద్ది క్షణాలు వారికి ఎంత ప్రశస్తమైనవి! సువార్త సేవ గురించి దాన్ని ప్రజలకు అందించటంలో తమ పరిచర్యను మరింత ఫల భరితం చెయ్యటం గురించి కలిసి మాట్లాడు కన్నారు. యేసు సత్య సిరులను వారికి తెరిచనప్పుడు దైవ శక్తితో వారు పునర్జీవం పొందారు., నిరీక్షణ ధైర్యం వారిని నింపాయి.MHTel 34.2

    అయితే కొంత సేపటిలోనే ప్రజలు మళ్ళీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. సామాన్యంగా తాను విశ్రాంతి తీసుకునే స్థలానికి వెళ్లి ఉంటాడని భావించి ప్రజలు అక్కడకు ఆయన్ని వెంబడించారు. ఒక్క గంట విశ్రాంతి అయినా పొందాలన్న ఆయన ఆశ ఆడియాశ అయ్యింది. కాని ఆ మంచి గొర్రెల కాపరి మనసులో విశ్రాంతి లేని దాహార్తి గల ఆ ఆత్మల పట్ల ప్రేమ కనికరం మాత్రమే ఉన్నాయి. ప్రొద్దస్తమానం వారి మధ్య రోగాల్ని నయం చేసి సాయంత్రం విశ్రాంతి తీసుకోవాటానికి వారిని ఇళ్ళకు పంపించాడు.MHTel 34.3

    ఇతరులు మేలు కోసం పూర్తిగా అంకితమైన జీవితంలో ఆవిశ్రాంత కార్యాచణ నుంచి మానవావసరాలతో పరిచయం నుంచి పక్కకు తప్పుకొని విశ్రాంతిని దేవునితో అవిచ్చన్న సహవాసాన్ని కలిగి ఉండటం అవసరమని రక్షకుడు గుర్తించాడు. తనను వెంబడించిన జనసమూహం వెళ్ళిపోయి నప్పుడు ఆయన కొండల్లోకి వెళ్ళి అక్కడ ఏకాంతంలో బాధలు శ్రమలు అనుభవిస్తున్న లేమిలో కొట్టుమిట్టాడుతున్న ఈ పాప జనుల కోసం తన ఆత్మను ప్రార్ధనలో దేవుని ముందు కుమ్మరించాడు.MHTel 34.4

    కోత విస్తారంగా ఉన్నది కోసేవారు తక్కువ మంది అని యేసు శిష్యులతో అన్నపుడు, వారు నిర్విరామంగా పనిచెయ్యాల్సిన అవసరాన్ని ఆయన సూచించలేదు. కాని “తన కోతకు పనివారిని పంపుమని కోత యాజమానుని వేడుకొనుడి” అని వారిని ఆదేశించాడు. మత్తయి 9:38 తన తొలి శిష్యులతో చెప్పినట్లు పనిలో అలసిన నేటి పనివారితో కూడా ఆయన ఇలా చెబుతున్నాడు. మీరేకాంతముగా... వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి”.MHTel 35.1

    దేవునిశిక్షణ కింద ఉన్నవారందరికి తమ సొంత హృదయాల తోను, ప్రకృతితోను, దేవునితోను సహవాసానికి నిశ్శబ్ద సమయం అవసరం. లోకంతోను దాని ఆచారాలు అలవాట్లు తోను సంబంధము లేని జీవితం వారిలో వెల్లడి కావాలి.దేవుని చిత్తాన్ని గురించి జ్ఞానాన్ని సంపాదించుటలో వారికి వ్యక్తిగతానుభవం అవసరం. హృదయంతో ఆయన మాట్లాడటం మనం వ్యక్తిగతంగా వినాలి. తక్కిన స్వరాలు నిశ్శబ్దమైసనప్పుడు నిశ్శబ్దంలో మనం దేవుని ముందు వేచి ఉండగా, ఆత్మలోని నిశ్శబ్దం దేవుని స్వరాన్ని మరింత స్పష్టం చేస్తుంది. “ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి” అంటున్నాడు ప్రభువు. కీర్తనలు 46:10 దేవుని సమస్త సేవకు ఫలప్రదమైన సిద్ధబాటు ఇదే. పరుగులు తీస్తున్న జనాల నడుమ, జీవిత తీవ్ర కార్య కలాపలాల ఒత్తిడి కింద ఇలా సేదతీరిన వ్యక్తి చుట్టు వెలుగు శాంతి సమాధానాల వాతావరణం అలుముకొని ఉంటంది అతడికి శారీక శక్తి మానసిక శక్తి రెండు లభిస్తాయి. అతడి జీవితం సువాసలు వెదజల్లుతూ మనుషుల హృదయాలను చేరి ప్రభావితం చేసే దైవశక్తిని ప్రదర్శిస్తుంది.MHTel 35.2

    *****