Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వాయు ప్రసరణ, సూర్యరశ్మి

    ప్రజా ప్రజయోజనాలకు గాని నివాసానికి గాని భవన నిర్మాణంలో సమృద్ధమైన వాయు ప్రసరణ, సూర్యరశ్మి లభ్యమయ్యేటట్లు ఏర్పాటు చెయ్యటానికి శ్రద్ధ వహించాలి. ఈ విషయంలో క్రైస్తవ దేవాలయాలు, పాఠశాల గదుల్ని తప్పు పట్టాల్సి ఉంది. సరిమైన వాయు ప్రసరణ విషయంలో ఆలక్ష్యం అనేక ప్రసంగాల ప్రభావాన్ని ఉపాధ్యాయుల శ్రమను నిరార్థకం చెయ్యటానకి చాలా మట్టుకు కారణమౌతుంది.MHTel 231.1

    సాధ్యమైనంత మేరకు మానవ నివాసానికి ఉద్దేశించిన నిర్మాణాలు ఎత్తయిన, నీళ్ళు దిగువకు పోయే స్థలంలో నిర్మితమవ్వాలి. స్థలం పొడిగా ఉండేటట్లు చేసి తేమవల్ల దుర్వాసన వల్ల ఏర్పడే ప్రమాదాలను ఇది నివారిస్తుంది. ఈ విషయాన్ని తరుచు తేలికగా తీసుకోవటం జరగుతుంది. పల్లంగా ఉండి నీరు కిందికి జారిపోయే వాటం లేని స్థలాల్లోని తేమ వల్ల మలేరియా వల్ల ఎడతెగని అనారోగ్యం , త్వీమైన వ్యాధులు అనేక మరణాలు సంభవిస్తున్నాయిMHTel 231.2

    నివాస గృహాలు నిర్మించుకునేటప్పుడు మంచి వాయు ప్రసరణ, విస్తారమైన సూర్యరశ్మి: ఉండేటట్లు చూసుకోవటం ముఖ్యం. ఇంటి ప్రతీ గదిలో వాయు ప్రసరణ విస్తారమైన సూర్యరశ్మి ఉండనివ్వండి పడక గదుల్లో రాత్రంబగళ్ళు ధారాళమైన వాయు ప్రసరణ ఉండేలా గృహ నిర్మాణం జరగాలి. ప్రతీరోజు గాలికి సూర్యరశ్మికి తెరవటానికి వీలు లేని ఏ గదీని పడక గదిగా ఏర్పాటు చేసుకోకూడదు,. అనేక దేశాల్లో చలికాలంలోను వర్షాకాలంలోను పడక గదులు వెచ్చగా పొడిగా ఉండ టానికి వసతులు కల్పించాలి.MHTel 231.3

    అతిథి వసతికి నిత్యం ఉపయక్తమయ్యే గృహ గదులు విషయంలోను అదే శ్రద్ధ పాటించాలి. ఇతర పడక గదుల మాదిరిగానే వాటికి మంచి వాయు ప్రసరణ సూర్యరశ్మి ఉండాలి. నిత్యం వినియోగంలో లేని గదుల్లో పేరుకునే తేమను తీసివెయ్యటానికి గదుల్ని వేడిచేసే ఏదో పద్దతిని ఏర్పాటు చెయ్యాలి. వెలుతురులేని గదిలో లేక తేమగా లేకుండా బాగా ఎండబెట్టని పడక పై ఎవరు పడుకుంటారో వారు తమ ఆరోగ్యాన్ని తరుచు తమ ప్రాణానికి కలిగే హానిని గుర్తెరిగి పండుకోవాలి.MHTel 232.1

    నిర్మాణాలు చేపట్టేటప్పుడు అనేకులు మొక్కలు పుష్పాలకు జాగ్రత్తగా ప్రణాళికలు తయారు చేసుకుంటారు గ్రీన్ హౌసును ( శీతల దేశాల్లో కూరగాయలు పండించటానికి నిర్మించే గాజు గృహం) వెచ్చగాను సూర్యరశ్మి ఉండేటట్లుగాను నిర్మిస్తారు. వేడి, గాలి సూర్యరశ్ని లేకుండా మొక్కలు బతకవు. వృద్ధి చెందవు. ఈ పరిసిత్తులు మొక్కలు బతకటాకిని అవసరమైతే, మన సొంత ఆరోగ్యానికి మనకుటుంబాలు అతిథుల ఆరోగ్యానికి అవి మరెంత ముఖ్యం !MHTel 232.2

    మన గృహాలను ఆరోగ్యకరమైన, ఆనందాదాయకమైన గృహాలుగా చేసుకోవాలని కోరుకుంటే, వాటిని లోతట్టు భూముల నుండి వచ్చే విష పదార్థాలకు,పొగమంచుకు పైగాను ఆకాశవిశాలం నుండి వచ్చే జీవ ధాయక సాధనాలకు ప్రవేశాన్నిచ్చే వాటిగా ఉంచుకోవాలి. బరువైన కర్టెన్లు వాడకండి. కిటికీలు, బ్లయిండ్సు తెరవండి. కిటికీలను కప్పుతూ సూర్యరశ్మిని అడ్డగించే తీగల్ని అవి ఎంత అందంగా ఉన్నా పెంచకండి సూర్యరశ్మిని అడ్డగించే చెట్లను ఇటికి అతి దగ్గరగా ఉంచకండి. సూర్యరశ్మి కర్టెన్లు కార్పెట్ల రంగును వెలిసిపోజెయ్యవచ్చు. పటాల ఫ్రేములపై మరకలు చెయ్యవచ్చు. కాని అది చిన్న పిల్లల బుగ్గలకు ఆరోగ్యవంతమైన మెరుపు తెస్తుంది.MHTel 232.3

    సంరక్షించాల్సిన వృద్ధులున్నవారు వారికి వెచ్చని సౌకర్యవంతమైన గదులు అవసరమని గుర్తుంచుకోవాలి. వయసు పైబడే కొద్ది బలం తగ్గుతుంది. అనారోగ్యకరమైన ప్రభావాల్ని ప్రతిఘటించే శక్తి తగ్గుతుంది. అందుచేత వృద్ధులకు సమృద్ధమైన సూర్యరశ్మి తాజా అయిన స్వచ్చమైన గాలి అవసరం మరింత ఎక్కువ.MHTel 233.1

    శారీరకారోగ్యానికి మానసికార్యోగానికి నియమబద్ధమైన పారిశుధ్యం ప్రధానం. చర్మం ద్వారా శరీరం నుండి నిత్యం మలినాలు విసర్జిత మౌతుంటాయి. తరుచు స్నానం చెయ్యటం ద్వారా శుభ్రంగా ఉంచితే తప్ప మిలియన్ల కొద్ది ఉన్న చర్మం రంధ్రాలు త్వరగా పూడుకుపోతాయి. చర్మం ద్వారా విసర్జితం కావలసిన మలినాలు తక్కిన విసర్జకావయవాలకు అదనపు భారమౌతాయి. MHTel 233.2

    చన్నిటీతో లేక గోరు వెచ్చని నీటితో త్వరిత స్నానం ఎక్కువ మందికి ఉపకారం చెయ్యవచ్చు. పడిసెం పట్టే అవకాశాన్ని అధికం చేసే బదులు, సరిగా చేసే స్నానం పడి సేన్ని ప్రతిఘటించటనికి బలాన్ని చేకూర్చుతుంది,. కారణం; అది రక్త ప్రసరణను మెరుగుపర్చుతుంది. రక్తాన్ని ఉపరితలానికి తీసుకువస్తుంది. అప్పుడు మరింత సులువైన క్రమబద్ధమైన ప్రసరణ జరుగుతుంది. మనసు శరీరం రెండూ బలో పేతమౌతాయి. కండరాలు మరింత మెత్తదనం కలిగి ఉంటాయి. మేధ చురుకౌతుంది. స్నానం నరాలను శాంతపర్చుతుంది. మలవిసర్జనకు అన్న కోశానికి, కాలేయానికి ఆరోగ్యాన్ని శక్తి నిస్తుంది. జీర్ణ క్రియకు తోడ్పడుతుంది,MHTel 233.3

    దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకోవటం కూడా ప్రాముఖ్యం. ధరించిన దుస్తులు చర్మరంద్రాల ద్వారా బహిర్గతమయ్యే వ్యర్ధాల్ని పీల్చుకుంటాయి. వాటిని తరుచుగా మార్చుకుని ఉతుక్కోకుంటే వ్యర్ధాలు తిరిగి చర్మంలోకి ప్రవేశిస్తాయి.MHTel 233.4

    ప్రతీ రూపంలోని మురికి వ్యాధి కారకం. మరణానికి దారితీసే సూక్ష్మజీవులు చీకటిగా,ఆశ్రద్ధకు గురి అయి ఉన్న మూలాల్నోలు కుళ్ళు తున్న వ్యర్థాల్లోను తేమగా ఉన్న బూజుప్టిన పదార్థాల్లోను విస్తారంగా ఉంటాయి. చెడిపోయిన కూరగాయలు, రాలిన ఆకుల కుప్పలు ఇంటికి దగ్గరగా ఉండి కుళ్ళి గాలిని విషంతో నింపనివ్వకూడదు. ఆరోగ్యదాయ కంగా ఉంటాయని భావించబడే పట్టణాలు నగారల్లో జ్వరం వంటి అంటువ్యాధులు అజారూకులైన ఓ కుటుంబ ఇంటి పక్క కుళ్ళిన పదార్థాలు ఉండటం వల్ల సంభవిస్తున్నట్లు తేలింది.MHTel 233.5

    సంపూర్ణ పరిశుభ్రత, సమృద్ధమైన సూర్యరశ్మి గృహ జీవితంలోని ప్రతీ చిన్న విషయంలోను పారిశుద్యం వ్యాధిని దూరంగా ఉంచటానికి ఇంటిల్లిపాది సంతోషంగాను శక్తితోను జీవించటానికి అత్యవసర విషయాలు.MHTel 234.1

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents