Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దేవుని వాగ్దానాలు

    తన రోగులను దైవ వాక్యానికి నడిపించటానికి వైద్యుడికి మంచి అవకాశాలుంటాయి. ఆశించిన మాటలను అక్కడక్కడ మాట్లాడుతూ వాక్య ధనాగారం నుంచి కొత్త విషయాలు పాత విషయాలు వైద్యుడు వారి ముందుకి తీసుకురావాలి. వైద్యుడు తన మనసును తాజా ఆలోచనలతో నింపుకోవాలి. వాక్యంలోని వాగ్దానాలతో మంచి పరిచయం కలిగి ఉండే ౦దుకు అతడు దైవ వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. లోకంలో తన పరిచర్యలో తన పాఠాలు బోధించేటప్పుడు రోగులను స్వస్థపర్చేటప్పుడు క్రీస్తు పలికిన ఆదరణకరమైన మాటల్ని పలకటానికి అతడు అభ్యాసం చెయ్యాలి. క్రీస్తు నిర్వహించిన స్వస్థత కార్యాల గురించి, ప్రేమ గురించి అతడు మాట్లాడాలి. వైద్యుడు తన రోగుల మనసుల్ని పరమ వైద్యుడు యేసు పై నిలపటాన్ని ఎన్నడూ ఆలక్ష్యం చెయ్యకూడదు.MHTel 91.2

    మనుషుల నడుమ నడిచినప్పుడు క్రీస్తు ప్రదర్శించిన అదే శక్తి అయన వాక్యంలో ఉంది. తన మాట ద్వారానే క్రీస్తు స్వస్థతపర్చాడు. దయ్యాల్ని వెళ్లగొట్టాడు. తన మాటతోనే గాలివాన వలన అల్లకల్లోలమైన సముద్రాన్ని సద్దణచాడు. మరణించిన వారిని లేపాడు. ఆయన మాటకు శక్తి ఉన్నదని ప్రజలు సాక్ష్యమిచ్చారు. ఆయన పాత నిబంధన ప్రవక్తలు బోధకులతో పలికిన రీతిగానే ఆయన దైవ వాక్యాల్ని పలికాడు. బైబిలు సొంతం క్రీస్తు ప్రత్యక్షత.MHTel 91.3

    లేఖనాల్ని మనకు దేవుడిచ్చిన వాక్యంగా తీసుకోవాలి. కేవలం రాసినట్లే కాకుండా మాట్లాడినట్లు ఓ వ్యాధిగ్రస్తుడు. క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు సహాయం కోరి వచ్చిన వారినే కాదు. యుగాలన్నింటిలోను అలాంటి అవసరంతో, అలాంటి విశ్వాసంతో తన వద్దకు రావలసిన వారందరిని ఆయన చూసాడు. “కుమారుడా, ధైర్యముగా ఉండుము. నీ పాపములు క్షమింపబడియున్నవి” అని పక్షవాయువు బాధితుడితో అన్నప్పుడు “కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపర్చెను, సమాధానము గలదానివై పొమ్ము” అని కప్నెహూము స్త్రీతో చెప్పినప్పుడు తన సహాయాన్ని కోరవలసి ఉన్న ఇతర వ్యాధిగ్రస్తులు, పాప భారాలు మోస్తున్న వారితోను చెప్పాడు. మత్తయి 9:2, లూకా 8:48MHTel 92.1

    దేవుని వాగ్దానాలన్నింటి విషయంలోనూ ఇదే వాస్తవం. వ్యక్తిగతంగా ఆయన స్వరాన్ని మనం వినగలిగినంత ప్రత్యక్షంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాల్లోనే తన కృపను శక్తిని క్రీస్తు మనకు వెల్లడిచేస్తున్నాడు. అవి “జనములను స్వస్థపర్చుటకై వినియోగించు” ఆకులు. ప్రకటన 22:2 వాటిని స్వీకరించి జీర్ణించుకుంటే అవి ప్రవర్తనకు శక్తిగాను, ఈ జీవితానికి స్పూర్తిగాను, ఆధారంగాను ఉంటాయి. వాటికున్న స్వస్ధత శక్తి మరి దేనికి లేదు. యావశ్చరీరానికి జీవవక్తినిచ్చే ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వగలిగేది వీటి తరువాత ఇంకేది లేదు.MHTel 92.2

    భయంతో వణుకుతూ సమాధి అంచున నిలబడిన ఒకరికి పాపం, బాధ భారంతో ఆయాస పడుతున్న ఓ ఆత్మకు రక్షకుని ఈ మాటల్ని.... పరిశుద్ధ గ్రంథంలోని తన మాటలన్ని ఆయనివే.... వైద్యుడు తనకు అవకాశం ఉన్నప్పుడు వల్లించాలి.MHTel 92.3

    “నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడిదాటు నప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్య నడచునప్పుడు కాలిపోవు జ్వాలాలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశు ద్దదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను... నీవు నా దృష్టికి ప్రియుడనైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను.” నేను నేనే నా చిత్తానుసారంగా నీ యతిక్రములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను”. భయపడకుము నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమునకు తెప్పించెదను. పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను”. యెషయా 43:1-4 25,5.MHTel 92.4

    “తండ్రి తన కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవాతన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” కీర్తనలు 103:13,14MHTel 93.1

    “నీ దేవుడైన యెహోవా నా మీద తిరుగుబాటు చేయుచు పోయిన నీ దోషము ఒప్పుకొనుము”. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును”. యిర్మీయా 3:13:1 యోహాను 1:9MHTel 93.2

    “మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములన మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచి వేసియున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము.” యెహవా 44:22MHTel 93.3

    “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.... రండి మన వివాదమును తీర్చుకొందుము మీ పాపములు రక్తము వలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొట్టెబొచ్చువలెన తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్దములను అనుభవింతురు.” యెషయా 1:18,19MHTel 93.4

    “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను.” “నిమిషమాత్రము నీకు విముఖునైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును”. యిర్మీయా 31:3 యెషయా 54:8MHTel 93.5

    “మీ హృదయములను కలవరపడనియ్యకుడి”. “శాంతి మీకను గ్రహించి వెళ్ళుచున్నాను.నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి”. యెహాను 14:1,27MHTel 94.1

    “మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్ళ కాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును”. యెషయా 32:2MHTel 94.2

    “దీనదరిద్రులు నీళ్ళు వెదకుచున్నారు. నీళ్ళు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను”. యెషయా 41:17.MHTel 94.3

    “నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి(న)... యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. “నేను దప్పిగలవానిమీద నీళ్ళును ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించెదును. నీకు పుట్టినవారిని నేనాశీర్వదిం చెదను”. యెషయా 44:2,3MHTel 94.4

    “భూదిగంతముల నివసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి”. యెషయా 45:22.MHTel 94.5

    “ఆయనే మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెను”. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపర్చబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.” మత్తయి 8:17 యెషయా 53:5,MHTel 94.6

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents