Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వ్యాధి నివారణ

    మత సంబంధమైన ఆరాధనల్లోనే గాక వారి దిన దిన జీవిత కార్యాలన్నిటిలోను పవిత్రత అపవిత్రతల మధ్య బేధాన్ని గుర్తించటం జరిగింది. అంటువ్యాధులు గలవారిని గాని అపవిత్రత గలవారిని గాని ముట్టుకున్నవారిని శిబిరం నుండి వేరు చేసేవారు. వారు తమను తమ వస్త్రాలను శుభ్రం చేసుకోకుండా శిబిరంలోకి తిరిగి రావటానికి అనుమతి పొందేవారు కాదు. అపవిత్రతమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి విషయంలో ఈ ఆదేశం ఆచరణీయం.MHTel 235.2

    “వాడు పండుకొను ప్రతీ పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వారి పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రు డైయుండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండు వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రడైయుండును. వాని క్రింది నుండిన యే వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రడైయుండును.. వాడు నీళ్ళతో చేతులు కడుగుకొనకయే ఎవని మట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును. వాడు ముట్టుకొనిన మట్టి పాత్రను పగలగొట్టవలెను. ప్రతీ చెక్క పాత్రను నీళ్ళతో కడుగవలెను”. లేవీయకాండము 15:4-12.MHTel 235.3

    ఈ నిబంధనలను ఎంత పరిపూర్ణంగా అమలుపర్చాల్సిం ఉందో కుష్టు వ్యాధిని గూర్చిన చట్టం ఉదహరిస్తున్నది.MHTel 235.4

    “ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యండును. వాడు పవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివిసంవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను., మరియు కుష్ఠు పొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొట్టె వెండ్రుకల బట్టయందేమి నార బట్టయందేమి నారతో గాని వెండ్రుకలతోనే గాని వేసిన పడుగునందేమి పేకయందేమి తోలు యందేమి తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువు నందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడని వస్తువునందేమి పచ్చదాళుగానే గాని యెట్లదాళు గానే గాని కనబడిన యెడల అది కుష్టు పొడ, యాజకునికి దాని కనుపర్చవలెను”. లేవికాండము 13:46-52MHTel 236.1

    అలాగే, ఒక ఇల్లు నివాసయోగ్యం గాని పరిస్థితులున్నట్లు నిదర్శనం కనపర్చినట్లయితే దాన్ని ధ్వంసం చెయ్యటం జరిగేది. యాజకుడు “అయింటిని దాని రాళ్ళను కట్టలను సున్నమంతటిని పడొట్టించి ఊరి వెలుపల ఉన్న అపవిత్రత స్థలమునుకు వాటిని మోయించి పారబోయిం చవలెను. మరియు ఆ ఇల్లు పొడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు పవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవెలను.” లేవీకాండము 14:45-47MHTel 236.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents