Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ముందుగా విశ్రాంతి

    కొందరు అతిగా పనిచెయ్యటం వల్ల అస్వస్తులవుతారు. విశ్రాంతి, ఆందోళన, చింతలు లేకపోవటం, మితాహారం వీరి ఆరోగ్య పునరుద్ధరణకు అత్యవసరం. ఒకే చోట కూర్చుని, అవిశ్రాంతంగా పనిచెయ్యటం వల్ల మానసికంగా అలసి ధైర్యం కోల్పోయిన వారికి తాము సామన్యంగా నసించగల, చింతలు, ఆందోళనలు లేని, ప్రకృతి సంబంధిత విషయాలతో సంబంధం కలిగే, పల్లె ప్రాంతానికి సందర్శనార్ధం వెళ్ళటం ఎంతో మేలు చేస్తుంది. పొలాల్లో, చెట్ల తోపుల్లో తిరగటం, పువ్వులు కోసుకోవటం, పిట్టల గానాలు వినటం, వారు కోలుకోవటానికి ఏ ఇతర సాధనం కన్నా ఎక్కువ మేలు చేస్తుంది.MHTel 197.3

    ఆరోగ్యంలోను వ్యాధిలోను స్వచ్చమైన నీరు దేవుడిచ్చిన వరాల్లో అతి శ్రేష్టమైనది. దాని సరియైన వినియోగం ఆరోగ్యాన్ని వృద్ధిపర్చుతుంది. మనుషులు జంతవుల దాహాన్ని తీర్చటానికి దేవుడు అనుగ్రహించిన పానీయం అది ధారాళంగా తాగితే శరీర వ్యవస్థ అవసరాలను సరఫరా చేసి వ్యా ధిని నిరోధించానికి అది ప్రకృతికి తోడ్పడుతుంది. నీటి వెలపలి వినియోగం రక్త ప్రసరణకు క్రమబద్ధం చేయ్యటంలో అతి సులభమైన తృప్తికరమైన మార్గల్లో ఒకటి. చన్నీటి లేక చల్లని నీళ్ళ స్నానం అద్భుతమైన టానిక్కు, వేడి నీటి స్నానం చర్మరంధ్రాలను తెరిపిస్తుంది. తద్వారా మలినాలను తొలగిస్తుంది. వేడి గోరువెచ్చని నీటి స్నానాలు రెండూ నరాలను శాంతపర్చి రక్త ప్రసరణను సమానం చేస్తుంది.MHTel 198.1

    కాని నీటి సరియైన వినియోగం వలన కలిగే ఉపకారాలను అనేకులు అనుభవించి తెలుసుకోలేదు. వారికి అదంటే భయం. నీటి చికిత్సలను అభినంధించాల్సినంతగా ప్రజలు అభినందించటంలేదు. వాటిని నిపుణతతో నిర్వహించటానికి అనేకులుచెయ్యటానికి ఇష్పపడని పని అవసరం. ఈ అంశము పై జ్ఞానం నిరాసక్తి కారణంగా ఎవరు తమను తాము క్షమించుకోకూడదు. బాధ ఉపశమనానికి వ్యాధి నిరోధానికి నీటికి అనేక మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. సామన్య గృహ చికిత్సల్లో దాని వినియోగాన్ని అందరు తెలుసుకోవాలి. ఆరోగ్యంలోను వ్యాధిలోను తమ కటుబాలను ఎలా శ్రద్ధగా చూసుకోవాలో తల్లులు ముఖ్యంగా తెలుసు కోవాలి.,MHTel 198.2

    క్రియ శరీర చట్టం. శరీరంలోని ప్రతీ అవయవానికి దాని నియమిత మైన పని ఉన్నది. ఆ పనిని అది నిర్విర్తించటంపై అభివృద్ధి శక్తి ఆధారపడి ఉంటాయి. అవయవాలన్నిటి సాధారణ చర్య వలన బలము శక్తి జనిస్తుంది. వ్యా ధి సహజ ప్రవృత్తి క్షీణత, మరణం దిశగా వెళ్ళటం. ఒక చేతికి కొన్ని వారాల పాటు కట్లు కట్టి ఉంచి ఆ తరువాత కట్టులు విప్పండి. అదే కాలంలో మీరు పరిమితంగా ఉపయోగించిన తక్కిన చేతి కంటే అది బలహీనంగా ఉన్నట్లు గుర్తిస్తారు. నిష్క్రియ కండర వ్యవస్థ అంతటి మీద అలాంటి ప్రభావానే చూపిస్తుంది.MHTel 198.3

    వ్యాదికి సోమరితనం బలమైన కారణం, వ్యాయామం రక్తానికి చురుకుతనం పుట్టించి ప్రసరణ సమానం చేస్తుంది. కాని సోమరిగా ఉన్నప్పుడు రక్తం స్వేచ్చగా ప్రసరించదు. జీవితానికి ఆరోగ్యానికి ఎంతో అవసరమైన మార్పులు అందులో జరగాలి, కాని జరగవు. చర్మం కూడా సోమరిదవుతుంది. రక్త ప్రసరణ క్రియాత్మకంగాను చర్మం ఆరోగ్యవంతమైన పరిస్థితులోను ఊపిరితిత్తులు స్వచ్చమైన తాజా అయిన గాలితో సమృద్ధిగా సరఫరా అయిన స్తితిలోను ఉంటే విసర్జించబడాల్సిన రీతిగా విసర్జించబడే మలినాలు విసర్జించబడవు. దేహ వ్యవస్థకు ఈ స్థితి ఏర్పడితే అది విసర్జకావయవాల పై రెండు రెట్లు భారాన్ని మోపుతుంది. పర్యవసానంగా వ్యాధి సంభవిస్తుంది.MHTel 199.1

    రోగగ్రస్తులను నిష్క్రియలో ప్రోత్సహించకూడదు. ఏ దిశలోనైనా అధిక శ్రమకలిగినప్పుడు కొంత కాలం పూర్తి విశ్రాంతి కొన్నిసార్లు తీవ్ర వ్యాదిని నివారించవచ్చు, కాని తరుచు దుర్బలులుగా ధృవీకరించబడ్డావారి విషయంలో పనిని పూర్తిగా ఆపుచెయ్యాల్సిన అవసరముండదు.MHTel 199.2

    మానసికమైన శ్రమ వల్ల రోగగ్రస్తులైన వారు అలసట కలిగించే ఆలోచనలనుండి విశ్రాంతి తీసుకోవాలి. కాని తమమానసిక శక్తుల్ని అస్సలు ఉపయోగించటం ప్రమాదకరమని తలంచటానికి వారిని నడిపించకూడదు. తమ పరిస్థితి ఉన్నదానికన్నా తీవ్రమైనదిని భావించటం అనేకులు చేస్తుంటారు. ఈ మానసిక పరిస్థితి ఆరోగ్యాన్ని కోలుకోవటానికి అనకూలమైనది కాదు. దాన్ని ప్రోత్సహించకూడదు. సువార్త పరిచారకులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు వగైరా మాససిక పనివారు తరుచు తీవ్ర మానసిక శ్రమవల్ల అస్వస్థతతకు గురి అవుతారు. అది శారీరక వ్యాయామం వల్ల తొలగిపోదు. వీరికి మరింత పనిగల జీవితం. నిష్కర్షమైన మితానుభవ అలవాట్లు వాటితో పాటు సరియైన వ్యాయామం శారీరక మానసిక ఆరోగ్యాన్ని శక్తిని సహాన శక్తిని ఇస్తుంది.MHTel 199.3

    తమ శారీరక శక్తుల పై అధిక భారం పెడుతున్నవారిని మానిసిక శ్రమను పూర్తిగా విడిచి పెట్టాల్సిందిగా ప్రోత్సహించకూడదు. కాని శ్రమ మరింత ప్రయోజనకారి కావటానికి క్రమబద్ధంగా హితంగా ఉండాలి. ఆరుబయట వ్యాయమం ఉత్తమం. బలహీనపడ్డ అవయవాల్ని ఉపయో గించటం ద్వారా బలపర్చేదై ఉండేలా దాన్ని రూపొందించుకోవాలి. అందులో మనసు పెట్టాలి. చేతులతో చేసే పని విధిగా చెయ్యాల్సిన పనిగా దిగజారకూడదు.MHTel 200.1

    ఎక్కువ కదలిక లేని అంగవికలులు తమ సమయాన్ని గడపటానికి ఆసక్తి చూపటానికి ఏదీ లేనప్పుడు వారి తలంపులు తమ మీదే కేంద్రీకృతమవు తాయి. వారు రోగగ్రస్తంగా చిటచిటలాడుతూ ఉంటారు. తమ చెడ్డ మనో భావల గురించి తలంచి కడకు తాము వాస్తవంగా ఉన్న దానికంటే ఎక్కువ ఊహించుకుని ఏమి చెయ్యటానికి తాము సమర్ధులం కామని భావిస్తారు.MHTel 200.2

    ఈ సందర్బాలన్నిటిలో సురక్షిత శరీరవ్యాయామం విలువైన పరిహారాత్మక సాధనమౌతుంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సాధనకు అది తప్పనిసరి అవుతుంది. చిత్తం చేతుల పనితో కలసి వెళ్తుంది. ఈ రోగగ్రస్తులకు అవసరమయ్యిందేమిటంటే వారి చిత్రాన్ని మేలుకొల్పటం. మనశక్తి నిద్రాణమై ఉన్నప్పుడు ఊహ అస్వాభావికమౌతుంది. అప్పుడు వ్యాధిని ప్రతిఘటించటం అసాధ్యమౌతుంది.MHTel 200.3

    అనేకమంది వికలాంగులకు నిష్క్రియ గొప్ప శాపంగా పరిణ మిస్తుంది. మనసుకు గాని శరీరానికి గాని ఎక్కువ శ్రమ కలిగించని ప్రయోజకనకరమైన పనిలో తేలికపాటి ఉపాధి ఈ రెండిండి పైనా నిష్ప్రభావం చూపుతుంది. అది కండరాలకు బలాన్నిచ్చి, రక్తప్రసరణను మెరుగుపర్చి పని ఒత్తిడి గల ఈ ప్రపంచంలో తాను పూర్తిగా ఉపయోగం లేనివాణ్ణి కానన్న తృప్తి వికాలంగుడికి ఇస్తుంది మొదట్లో అతడు బహుతక్కువ పనే చెయ్యవచ్చు. కాని తన శక్తి పెరుగుతున్నట్లు తాను సాధిస్తున్న పని దాని ప్రకారం పెంచవచ్చునని అతడు త్వరలో గ్రహిస్తాడు.MHTel 200.4

    వ్యాయామం జీర్ణావయవాలకు ఆరోగ్య వాతావరణాన్నివ్వటం ద్వారా ఆజీర్తి రోగికి సహాయం చేస్తుంది. భోజనం చేసిన వెంటనే తీవ్రమైన అధ్యయనంలో గాని కఠినమైన వ్యాయమంలో గాని పాల్గొనటం జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. MHTel 201.1

    కాని భోజనం తరువాత కొద్దిసేపు తల నిటారుగా పెట్టి, భుజాలు వెనక్కు విరిచి నడవటం చాలా మేలుచేస్తుంది. శరీర వ్యాయామం గురించి చెప్పింది రాసింది ఎంత ఉన్నా దాన్ని అశ్రద్ధ చేసేవారు చాలామంది ఉన్నారు. శారీరక వ్యవస్థలో అటంకం ఏర్పడటం వల్ల కొందరు స్థూలకాయులవుతారు. ఇతరులు అధిక ఆహారాన్ని పరిష్కరించటంలో జీవ శక్తులు అలసినందు వల్ల సన్నగాను బలహీనంగాను తయారవుతారు. రక్తంలోని మలినాల్ని శుద్ధి చేసే పనిలో కాలేయం పై అధిక భారం పడుతుంది. ఫలితంగా వ్యాధి కలుగుతుంది.MHTel 201.2

    నీడపట్టున ఉండే అలవాట్లు గలవారు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఎండకాలం, చలికాలం ప్రతీ రోజు ఆరుబయట వ్యాయామం చెయ్యాలి. సైకిలు తొక్కటం లేక మోటారు బళ్ళు తోలటం కన్నా నడవటం మెరుగు ఎందుకంటే అది ఎక్కువ కండరాలకు వ్యాయామం ఇస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యవంతమైన పనిలో నిమగ్నమౌతాయి. ఎందుకంటే వాటిని గాలితో నింపకుండా చురుకుగా నడవటం ఆసాధ్యం.MHTel 201.3

    అటువంటి వ్యాయామం అనేక సందర్భాల్లో ముందుకన్నా మంచిది. అనేకుల సందర్భంలో మితంగా తిని, ఆనందదాయకం ఆరోగ్యవంతం అయిన వ్యాయామం తీసుకుంటే సమయాన్ని ద్రవ్యాన్ని పోగొట్టుకోవలసిన అవసరం లేకుండా తమ ఆరోగ్యాన్ని తిరిగి పొందే అవకాశం ఉన్నప్పుడు సముద్ర ప్రయాణం చెయ్యమని ఖనిజపు చెలమలకు వెళ్ళమని లేక వాతావరణ మార్పుకి ఆయా స్థలాలు సందర్శించమని తమ రోగులకు వైద్యులు తరుచు సలహా ఇస్తుంటారు.MHTel 201.4

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents