Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మితానుభవం, ఆత్మ నిగ్రహం

    తల్లి తన అలవలావట్లను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో లేఖనం మనకు భోదిస్తున్నది. సంసోనుని ఇశ్రాయేలీయుల విమోచకుడుగా లేపాలని దేవుడు ఉద్దేశించినపుడు ‘ యెహోవా దూత” ఆమెను దర్శిచి తన అలవాట్ల విషయంలోను ఆబిడ్డ పెంపకం విషయంలోన ప్రత్యేక ఉ పదేశం ఇచ్చాడు. దూత అన్నాడు. “ఆలకించుము”.. నీవు ద్రాక్షా రసమునే అని మద్యమునే గాని త్రాగకకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము”. న్యాయధిపతులు 13:13,7MHTel 319.1

    అనేకమంది తల్లితండ్రులు జనన పూర్వ ప్రభావల ఫలితాలు ఏమంత ప్రాముఖ్యమైనవిగా భావించరు. అయితే దేవుడు అలా పరిగణించటంలేదు. దేవుడు తన దూతతో పంపిన అతి గంభీరమైన రీతిలో రెండుసార్లు వచ్చిన వర్తమానం అది మనం అది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమని సూచిస్తున్నది.MHTel 319.2

    ఆ హెబ్రీ తల్లితో చెప్పిన మాటల్లో అన్ని యుగాల్లోని తల్లులందరి తోనూ దేవుడు మాట్లాడుతున్నాడు, “నేను ఆస్త్రీతో చెప్పినదందతయు ఆమె చేసుకొనవలెను.” శిశువు సంక్షేమాన్ని తల్లి అలవాట్లు ప్రభావితం చేస్తాయి. ఆమె ఆహార పాన వాంఛలు, భావోద్రేకాలు, నియమం నియంత్రణ కింద ఉండాలి. తనకు బిడ్డ నివ్వటంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే, ఆమె విసర్జించాల్సింది. వ్యతిరేకించాల్సింది కొంతమంది. తన బిడ్డ జననా నికి ముందు ఆమె విచ్చలవిడగా ప్రవర్తిస్తే స్వార్ధంతో, అసహనంతో, కాఠిన్యంతో వ్యవహరిస్తే బిడ్డ తత్వంలో ఆ గుణ లక్షణాలు ప్రతిబింబిస్తాయి. ఈ రకంగా అనేకమంది పిల్లలు దుర్మార్గపు ప్రవృత్తులను జన్మ హక్కుగా పొందుతారు.MHTel 319.3

    కాగా తల్లి సరియైన నియమాల్ని పాటిస్తే మితానుభవాన్ని ఆత్మ త్యాగాన్ని ఆచరిస్తే దయగా, మృదువుగా , స్వార్ధరహితం గా ఉంటే, ఆమె ఈ ప్రశస్తమైన గుణాలతో కూడిన ప్రవర్తననే తన బిడ్డకు అందించవచ్చు. తల్లి మద్యాన్ని ఉపయోగించటాన్ని నిషేధిస్తూ ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వబడింది. తన అనుచి తకొర్కెను తీర్చుకోవటానికి ఆమె తీసుకునే ప్రతి మధ్యపు బొట్టు తన బిడ్డ శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యా నికి హాని కలిగించి తన సృష్టికర్తకు వ్యతిరేకంగా పాపం చెయ్యటమౌతుంది.MHTel 320.1

    తల్లి ప్రతీ కోర్కెను తీర్చాలి అని అనేక మంది సహోదరులు చెబుతుంటారు. ఆమె ఏదైనా తినాలని కోరితే అది ఎంత హానికరమైనదైనా దాన్ని ఆమెకు పెట్టాలి. అంటారు. అది తప్పుడు సలహా. తల్లి శారీరక అవసరాల్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆమె పై రెండు ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆమె కోరికలను దయగా పరిగణించాలి. ఆమె అవసరాల్ని ఉదారంగా సరఫార చెయ్యాలి. అయితే ఇతర సమాయల్లో కన్నా ఈ సమయంలో ఆమె తన ఆహారంలోను ఇతర విషయాల్లోను తన శారీరక శక్తిని మానసిక శక్తిని తగ్గించే ప్రతీ దాన్ని త్యజించాలి, దేవుని ఆజ్ఞప్రకారం ఆత్మ నిగ్రహం పాటించటం ఆమె పవిత్ర బాధ్యత.MHTel 320.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents