Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రీస్తు బోధ

    అలాగే సత్యం నియామల్ని క్రీస్తు సువార్తలో సమర్పించాడు. ఆయన బోధలో దేవుని సింహాసనం నుంచి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన జలాలను మనం తాగవచ్చు. తనకు ముందు జరిగిన ప్రసంగాలన్నిటి ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఇచ్చి ప్రతీ ఆవిష్కరణల చుట్టు నిలపగలిగేవాడు. కాని ఆయన భోధిస్తున్న రక్షణ విజ్ఞానశాస్త్రం నుంచి ఒక్క క్షణం కూడా గడపటానికి ఆయనకు తీరిక లేకపోయింది. ఆయన సమాయాన్ని ఆయన మానసిక శక్తులను, ఆయన జీవితాన్ని అధికం చేసుకొని మానవ ఆత్మల రక్షణ కోసం మాత్రమే. వాటిని వినియోగించాడు.MHTel 391.1

    ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించటానికి వచ్చాడు. ఆ కార్యం నుంచి ఆయన తన ధ్యానాన్ని ఎటూ మర్చలేదు. తనను మరల్చటానికి ఆయన దేనికీ తావివవ్వలేదు.MHTel 391.2

    ఉపయోగించగలిగిన జ్ఞానాన్ని మాత్రమే క్రీస్తు అందించాడు. ఆయన ప్రజలకు ఇచ్చినది వ్యావహారిక జీవితంలో వారి సొంత పరిస్థితులకు పరిమితమైన ఉపదేశం. కూపీతీసే ప్రశ్నలతో ఆయన వద్దకు తమను నడిపిన కుతుహలాన్ని ఆయన తృప్తిపర్చలేదు. గంభీర మనఃపూర్వక విజ్ఞప్తులకు తరుణాలుగా అలాంటి ప్రశ్నల్ని ఆత్రుతగా ఉన్నవారికి ఆయన జీవవృక్ష ఫలాన్ని ఇవ్వనెంచాడు. దేవుని వద్దకు నడిపించే మార్గం తప్ప తమకు అన్ని మార్గాలు మూయబడడ్డట్లు వారు కనుగొన్నారు. నిత్య జీవపు ఊటతప్ప ఇతరత్రా ప్రతీ ఊటా మూయబడింది.MHTel 391.3

    తన దినాల్లోని రబ్బీల పాఠశాలలకు వెళ్ళటానికి మన రక్షకుడు ఎవ ర్నీ ప్రోత్సహించలేదు.ఎందుకంటే వారు సత్యం”అంటారు”లేకచెప్పబ డింది. అన్న మాటలు పలకటం వల్ల విద్యార్థుల మనసుల్ని కలుషితం చేస్తున్నారు. గొప్పదైన, స్థిరమైన, వివేకం మన అందుబాటులో ఉండగా మనం ఎందుకు మనుషుల నిలకడలేని మాటల్ని గొప్ప వివేకంగా అంగీకరించాలి ?MHTel 392.1

    నేను ఏ నిత్యమైన విషయాల్ని చూశానో, మానవ బలహీనత గురించి నేను ఏవి చూశానో అవి నా మనసును నా జీవిత కర్తవ్యాన్ని ప్రభావితం చేసాయి. మానవుణ్ణి స్తుతించటానికి మహిమపర్చటానికి హేతువేమి నాకు కనిపించుటలేదు. లోక సంబంధమైన జ్ఞానులుగా గొప్పవారిగా కీర్తింపబడే వారి అభిప్రాయాలను విశ్వసించటానికి ఘనపర్చటానికి నాకు ఏకారణం కనిపించటం లేదు. దైవ జ్ఞానం లేని వారికి దేవుని ప్రణాళికను గురించి ఆయన మార్గాలుగురించి సరియైన అభిప్రాయాలు ఉండటం ఎలా సాధ్యం?వారు ఆయన్ని ఎరగకుండా అజ్ఞానంతో ఆయన లేడంటారు లేదా ఆయన శక్తిని మత అభిప్రాయాల చట్రంలో బంధించి పరిమితం చేస్తారు.MHTel 392.2

    భూమిని ఆకాశాన్ని సృజించి అంతరిక్షంలో నక్షత్రాలకు తమ క్రమాన్ని సూర్యచంద్రలకు తమ తమ పనులను నియమించిన ఆయననుంచి నేర్చుకోవటానికి ఎంపిక చేసుకుందాం.తాము తమ మానసిక శక్తుల అత్యుత్తమ అభివృద్ధిని చేరుకోవాలని యువత భావించటం న్యాయమే. దేవుడు పరిమితులు విధించని విద్యను మనం నిర్బందించకూడదు. కాగా మన లక్ష్యసాధనలు దేవుని ఘనతకు మానవాళి శ్రేయానికి ఉపయోగించక పోతే అవి వ్యర్ధం. తీవ్రమైన అన్వయింపు కోరే, కాని ప్రయోగత్మక జీవితంలో ఉప యోగించిన అధ్యయనాలతో మనసును నింపటం మంచిది కాదు. అటువంటి విద్యార్ధికి నష్టం. ఎందుకంటే ఈ అధ్యయనాలు తనను ప్రయోజ కత్వానికి సమర్ధుణ్ణి చేసి తన బాధ్యతల్ని నెరేర్చటానికి శక్తినిచ్చే అధ్యయనాల పట్ల అతడి కోరికను అభిరుచిన తగ్గిస్తుంది. ఉపయోగ్యమైన శిక్షణ కేవలం సిద్ధాంతీకరణకన్నా ఎంతో విలువగలది. జ్ఞానం కలిగి ఉండుటమే చాలదు. జ్ఞానాన్ని సరిగా ఉయోగించే సామర్ధ్యం ఉండాలి.MHTel 392.3

    తులనాత్మకంగా నిరుపయోగమైన విద్య కోసం అనేకులు వ్యయం చేసే సమయం ద్రవ్యం అధ్యయనం తమను ఆచరణాత్మక పురుషులు స్త్రీలుగాను జీవిత బాధ్యతలను వహించటానికి సమర్ధులుగాను తీర్చిదిద్దే విద్యను సంపాదించటానికి వ్యయం చెయ్యాలి.MHTel 393.1

    మనకు కావలసినది మనసును ఆత్మను బలో పేతం చేసే జ్ఞానం, మనల్ని మంచి పురుషులుగా స్త్రీలుగా దిద్దే విద్య. కేవలం పుస్తక జ్ఞానం కన్న హృదయ శిక్షణ ఎంతో ప్రాముఖ్యం. మనం నివసించే లోకాన్ని గూర్చిన జ్ఞానం కలిగి ఉండటం మంచిదే. అది అవసరం కూడా. కాని మన లెక్కల్లోనుంచి నిత్యత్వాన్ని విడిచి పెడితే మనం ఎన్నడు సరిచూసుకోలేని తప్పిదాన్ని చేస్తాం.MHTel 393.2

    ఓ విద్యార్ధి జ్ఞానం సంపాదించటానికి తన శక్తులన్నటిని ఉ యోగించవచ్చు. కాని అతడికి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే, తనను పాలించే చట్టాలకు విధేయుడు కాకుంటే అతడు తననుతాను నాశనం చేసుకుంటాడు. దురబ్యాసాల వల్ల ఆత్మాభిమాన శక్తిని కోల్పోతాడు. ఆత్మ నిగ్రహాన్ని కోల్పోతాడు. తనకు ప్రధానంగా సంబంధించిన విషయాల్ని గురించి హేతుబద్ధంగా ఆలోచించలేడు. మనసుఏ శరీరాల పట్ల వ్యవహరించే విషయంలో అతడు తొందరపాటుగా నిర్ణేతుకంగా ఉంటాడు. సరియైన నియమాలు వృద్ధిపర్చుకోవటం నిర్లక్ష్యం చెయ్యటం ద్వారా ఈ లోకం విషయంలోనే గాక రానున్న లోకం విషయంలోను అతడు నాశనమౌతాడు.MHTel 393.3

    యువత తమ బలహీనతను గ్రహిస్తే వారు దేవునిలో తమ శక్తిని కనుగొంటారు. ఆయన వల్ల ఉపదేశం పొందటానికి వారు ప్రయత్నిస్తే ఆయన వివేకంలో వారు వివేకవంతులవుతారు. వారి జీవితాలు ఫలభిరతమై లోకానికి దీవెనగా ఉంటాయి. కాని వారు తమ మనసుల్ని కేవలం ఐహికమైన ఊహాజనిత అధ్యయనానికి సమర్పించుకొని ఆ విధంగా దేవునికి దూరమైతే జీవితాన్ని పరిపుష్టం చేసే సమస్తాన్నీ వారు పొగొట్టుకుంటారు,MHTel 393.4

    *****