Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    6. గృహం

    28—గృహం

    గృహం పరిచర్యి

    మానవాళి పురధురణ ఉన్నతి గృహంలో ప్రారంభమౌతుంది. తల్లిదండ్రుల పని అన్నిటికి పునాది సమాజం కుటుంబాల సమూహారం. అది కుటుంబాల నాయకులు ఎలా తయారు చేస్తే అలా ఉంటుంది. హృయదంలో నుంచి “జీవాధారములు” (సామెతలు 4:23) బయలు దేరతాయి. సమాజానికి, సంఘానికి, జాతికి కుటుంబం గుండె వంటిది. సమాజ సంమం, సంఘ విజయం జాతి ప్రగతి కుటుంబ ప్రభావాలపై ఆధారపడి ఉంటాయి.MHTel 299.1

    గృహజీవిత ప్రాముఖ్యం. అవకాశాలు క్రీస్తు జీవితంలో ఉదహ రించ బడ్డాయి. మనకు మాదిరిగాను బోధకుడగాను ఉండటానికి వచ్చిన ఆయన ముప్పయి సంవత్సరాలు నజరేతులో కుటుంబ సభ్యుడుగా జీవించాడు. ఈ సంవత్సరాల గురించి బైబిలు దాఖలా చాలా తక్కువ. గొప్ప ఆద్భుత కార్యాలేవి జనసమూహాల దృష్టిని ఆకర్షించలేదు. ఆయన మాటలు వినటానికి జనులు గుంపులు గుంపులు ఆయన వెంబడి వెళ్ళలేదు. అయినా ఈ సంవత్సరాలన్నిటిలోను ఆయన తన దినకర్తవ్యాన్ని నెరవేర్చుతునూ ఉన్నాడు. ఆయన మనలో ఒకడిగా కుటుబం జీవతంలో పాలు పంచుకుంటూ కుటుంబ భారాల్ని పంచకుంటూ నివసించాడు. ఓ దీన గృహం తోడు నీడలో, మన సామాన్య అనుభవాల్లో పాలు పంచు కుంటూ ఆయన “జ్ఞానమునందును,వయస్సునందును,దేవుని దయ యందును, మనుష్యుల దయయందును వర్దిలుచుండెను”.లూకా 2:52MHTel 299.2

    ఈ ఏకాంత సంవత్సరాల్లో ఆయన జీవితం సానుభూతిని సహాయాన్ని ఇతరులకు అందిస్తూ పరవళ్ళు తొక్కుకుంటూ నదిలా ప్రవహించింది. ఆయన నిస్వార్ధమైన ఓర్పుతో కూడిన సహానం ఆయన ధైర్యం, విశ్వసనీయత, శోధన ప్రతిఘటన, ఆయన అపార శాంతి, ప్రశాంతమైన సంతోషం నిత్యం స్పూర్తిదాయకం,. కుటుంబములోకి ఆయన పవిత్రమైన ఆనందమయమైన వాతావరణాన్ని తెచ్చాడు. ఆయన జీవితం సమాజ భాగాల్ని పిండి ముద్దలోని పులిపిండిలా ప్రభావితం చేసింది. ఆయన అద్భుతం చేసాడని ఎవరూ చెప్పలేదు. అయినా ప్రభావం స్వస్థతనిచ్చే జీవమిచ్చే ప్రేమా శక్తి శోధింపబడేవారికి వ్యాధిగ్రస్తులకు నిరుత్సాహపడ్డవారికి ఆయన నుంచి వెళ్ళింది. తన చిన్ననాటి నుండి ఆయన ఇతరులకు నిరాడంబరంగా సహాయక సేవలు చేసాడు. దీన్ని బట్టి ఆయన తనబహింరగ సేవ చెయ్యటం మొదలు పెట్టినప్పుడు అనేకులు ఆయన మాటలు సంతోషంగా విన్నారు.MHTel 299.3

    రక్షకుని బాల్య సంవత్సరాలు యువతకు ఎంతో ఆరద్శనీయాలు. అవి ఓ విలువైన పాఠం. పతీ తల్లికి తండ్రికి అని ప్రత్సోహాన్నిందించాలి. సాటి మానవుల ఉద్ధరణ కోసం పని చెయ్యాలని ఆశించేవారి మొదటి సేవా రంగం కుటుంబ విధులు తాము నివసిస్తున్న సమాజ విధుల నిర్వహణ. కుటుంబ స్థాపకులకు పోషకలకు అప్పగించబడిన పని కంటే ప్రాముఖ్యమైన పని ఇంకొకటి లేదు. మానవులకు అప్పగించబడ్డ ఏ పనిలోనూ తండ్రులకు తల్లులకు అప్పగించబడ్డ పనిలో ఉన్నంత దీర్ఘకాలిక ఫలితాలు లేవు.MHTel 300.1

    నేటి యువత, చిన్న పిల్లలే సమాజం భవిష్యత్తును నిర్ణయించాల్సి ఉన్నారు. ఈ యువత, పిల్లలు ఏమి కావలసి ఉన్నారో అది కుటుంబముపై ఆధారపడి ఉంటుంది. మావాళికి శాపంగా మారిని వ్యాధి దు:ఖం నేరాలకు హేతువు చాలా మేరకు సరియైన కుటుంబ శిక్షణ లోపమే అనాలి. గృహ జీవితం పవిత్రంగా, వాస్తవికంగా ఉంటే, దాని సంరక్షణ నుండి బయటకి వెళ్ళిన పిల్లల జీవిత బాధ్యతలకు ప్రమాదాలకు సిద్ధం చెయ్యబడి ఉంటే లోకంలో ఎంత గొప్ప మార్పు కనిపిస్తుంది!MHTel 300.2

    దురభ్యాసాల బాధితులను సంస్కరించటానికి కార్యక్రమాల్లోను సంస్థల్లోను గొప్ప కృషి, సమయంల ద్రవ్యం, శ్రమ పెట్టటం జరుగుతున్నది. ఆ గొప్ప అవసరాన్ని తీర్చటానికి ఈ ప్రయత్నాలు కూడా చాలటంలేదు. అయినా ఫలితం ఎంత స్వల్పం! సంస్కరించబడి శాశ్వతంగా పునరుద్ధరించ బడ్డవారు ఎంత తక్కువమంది!MHTel 300.3

    మెరుగైన జీవితం కోరుకునేవారు వేలమంది కాని అలవాటు పట్టునుంచి విడిపించుకోవటానికి వారిలో ధైర్యం ధృడసంకల్పం లోపిస్తున్నాయి. అసవరమైన కృషికి పోరాటానికి త్యాగానికి వారు వెనకడుగు వేస్తారు. కనుక వారి జీవితాలు ముక్కచెక్కలై నాశనమౌతున్నాయి. గొప్ప ప్రతిభగల వ్యక్తులు, ఆశలు ఆశయాలు సమర్ధతలు గల మనుషులు బరువైన బాధ్యతలు గల హోదాలకు సమర్థులైన మనుషులు ఇలా దిగజారి ఈ లోకానికి, రానున్న లోకానికి పనికి రాకుండా నశించిపోయారు.MHTel 301.1

    దిద్దుబాటు జరిగినివారు తమ పురుషత్వాన్ని తిరిగి పొందటానికి ఎంత తీవ్ర పోరాటం సాగించాలి! తమ జీవితమంతా, శిధిలమైన శరీరతత్వం, చంచలమైన మనసు, దెబ్బతిన్న మేథ, బలహీనమై ఆత్మ శక్తితో అనేకులు తాము విత్తిన దుర్వర్తన పంటను కోస్తారు. ఆ దుష్ట ప్రవర్తను అదిలోనే అంతం చేసి ఉంటే మరెంత మేలు జరిగి ఉండేది!MHTel 301.2

    ఈ పని చాలావరకు తల్లితండ్రులపై ఆధారపడి ఉంటుంది. సాంఘిక శరీరాన్ని క్యాన్సరు వలే నాశనం చేస్తున్న అమితానుభవం ఇతర కీడులను నిలువరించటానికి జరిగే కృషిలో పిల్లల్లో అలవాట్లు ప్రవర్తనను ఎలా దిద్దాలో తల్లితండ్రులకు బోధించటం పై ఎక్కువ శ్రద్ధ పెడితే వందరెట్లు ఎక్కువ మేలు జరగుతుంది. అలవాటుకు భయంకరమైన కీడు చేసే శక్తి ఉంది. దాన్ని మేలు చెయ్యటానికి ఓ శక్తిగా మల్చుకోవటానికి వారికి శక్తి ఉంది వారు తమ పనిని ప్రవాహం అరంభముతో మల్చుకోవటానికి వారికి శక్తి ఉన్నది. వారు తమ పనిని ప్రవాహాం ఆరంభంతో మొదలు పెట్టాలి. దాన్ని సరిగా నిర్వహించటం వారి పైనే ఆధారపడి ఉంటుంది.MHTel 301.3

    తల్లితండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితానికి పునాది వెయ్యవచ్చు. శోధనను ప్రతిఘటించాటానికి నైతిక శక్తితోను,జీవిత సమస్యలతో విజయవంతంగా పోరాడటానికి ధైర్యం సమర్ధత లతోను తమ గృహాల నుంచి వారిని బయటకి పంపవచ్చు. తమ జీవితాల్ని దేవునికి మహిమకరంగాను లోకానికి ఆశీర్వదంగాను జీవించటానికి వారిలో ఓ సంకల్పాన్ని శక్తిని నింపవచ్చు. మహిమకరమైన ఎత్తులు ఎక్కటానికి వెలుగులోను చీకటిలోను వారి పాదాలకు తిన్నని దారులు చెయ్యవచ్చు.MHTel 301.4

    గృహం తాలూకు మిషన్ దాని సభ్యులను దాటిపోయే విస్తృతి గలది. క్రైస్తవగృహం ఓ సాదృశ్య పాఠంగా ఉండాలి. అది జీవిత యదార్ధ నియమాల ఉత్కృష్టతకు ఉదాహరణగా నిలవాలి. అలాంటి ఉదాహరణ లోకంలో మంచిని పెంచే మహత్తర శక్తిగా పరిణమిస్తుంది. మావన హృదయాలు జీవితాలపై యదార్ధమైన గృహ ప్రభావం ఏ ప్రసంగంకన్నా ఎంతో శక్తిమంత మైనది. యువత అటువంటి గృహం నుంచి బయటికి వెళ్ళినప్పుడు వారు నేర్చుకున్న పాఠాల్ని ఇతరులకు నేర్పిస్తారు. ఇతరుల గృహాల్లోకి ఉదాత్తమైన నియమాలు ప్రవేశిస్తాయి. సమాజంలో ఓ సమున్నత ప్రభావం పని చేస్తుంది.MHTel 302.1

    మన గృహాల్ని మనం ఇతరులకు ఓ దీవెనగా చెయ్యాలి. అలాంటి ఇతరులు చాలమంది ఉన్నారు. మన సాంఘిక వినోదాలు లోకాచారాల ప్రకారంగా గాక క్రీస్తు స్పూర్తికి అనుగుణంగాను ఆయన వాక్యానుసారం గాను ఉండాలి. ఇశ్రాయేలీయులు తమ వినోదాలన్నిటిలో బీదవారిని పరదేశులను, గుడార సేవలో యాజకుడికి సహాయకుడు, మతనాయకుడు, మిషనెరీ అయిన లేవీయుణ్ని చేర్చారు. వీరిని సాంఘికమైన, మత సంబంధమైన ఉత్సాహ సమయాలన్నిటిలో తమ అతిధ్యాన్ని పంచుకోటానికి ,వ్యాధిలోను లేమిలోను దయగా చూసుకోటానికి, తమ అతిధులుగా పరిగణించారు. ఇలాంటివారిని మనం మన గృహాలకు స్వాగతించాలి. మిషనెరీ నర్సును లేక అధ్యాపకుణ్ణి, చింతతో నలిగిన, కష్టించి పనిచేసే తల్లిని లేక తరచు నీడలేకుండా, పేదరికంతో అనేక ఆశాభంగాలతో సతమతమౌతున్న, శక్తిహీన వృద్ధుణ్ణి అటువంటి స్వాగతం ఎంత ఉత్సాహ పర్చుతుంది. ఎంత ధైర్యపర్చుతుంది.MHTel 302.2

    క్రీస్తన్నాడు, “నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ బంధువులనైనను పిలువ వద్దు: వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీవు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలకు అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పురుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు.” లూకా 14:12-14.MHTel 302.3

    మీకు ఎక్కువ భారం కలిగించని అతిదులు వీరు. వారికి పెద్ద విందు లేక ఖరీదైన భోజనం ఇవ్వనవసరంలేదు. ఆడంబరానికి ఎలాంటి ప్రయత్నమూ చేయ్యనక్కరలేదు. హృదయ పూర్వక స్వాగతపు వెచ్చదనం, మీ చలిమంట ప్రక్కన చోటు, మీ ఇంట్లోని బల్ల వద్ద ఓ స్థానం, ప్రార్ధన సమయంలో మీతో దీవన పంచుకునే తరుణం అనేకులకు పరలోకాన్ని చూసినట్లుంటుంది.MHTel 303.1

    మన సానుభూతి మన స్వప్రయోజనాల్ని దాటి ఇతరులకు ప్రవహిం చాలి. మన ప్రయత్నాలు మన ఇంటి గోడల్ని దాటి పోవాలి.ఎవరు తమ గృహాల్ని ఇతరులకు ఓ దీవెన చెయ్యటానికి ఆకాక్షిస్తారో వారికి అందుకు ప్రశస్తమైన తరుణాలు లభిస్తాయి. సాంఘిక ప్రభావం ఓ అద్భుత శక్తి మనం కోరుకుంటే మన పరిసరాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యటానికి దాన్ని మనం ఉపయోగించవచ్చు.MHTel 303.2

    శోధింపబడుతున్న యువతకు మన గృహాలు శరణాలయాలు కావాలి. అనేకమంది దారులు విడిపపోయే కూడలి వద్ద నిలిచి ఉన్నాడు. ప్రతీ ప్రభావం, ప్రతీ అభిప్రాయం ఈ లోకంలోను రానున్న లోకంలోను వారి భవష్యత్తును రూపుదిద్దే ఎంపికను నిర్ణయిస్తుంది. చెడు వారిని ఆహ్వానిస్తుంది. దాని ఉనికి పట్టులు కాంతివంతమైన వెలుగులో ఆకర్షణీయంగా ఉంటాయి. వచ్చే ప్రతీవారికి అది స్వాగతం పలుకుతుంది. కుటుంబాలు లేని సహాయం చేసే ఉద్దరించే శక్తి లేని కుటుంబాలు గల యువత మన చుట్టు ఉన్నారు. వారు దుష్టతకు ఆకర్షితులౌతారు. మన సొంత ఇంటి నీడలోనే వారు చెడిపోయి నాశనమౌతున్నారు.MHTel 303.3

    ఆ యువతకు సానుభూతి హస్తం చాపటం అవసరం. దయగల మాటలు పలకటం చిన్న శ్రద్ధ చూపటం ఆత్మను ఆలముకున్న శోధన మబ్బులను విడగొడుతుంది. సానుభూతి దైవికమైనది. దాని వాస్తవిక వ్యక్తీకరణకు క్రీస్తు మాటల వంటి మాటల పరిమళం. క్రీస్తు ప్రేమ స్పూర్తి సున్నితమైన స్పర్శ. అవసరమైన వారికి తులుపు తెరిచే శక్తి ఉంది. యువతలో మనం ఆసక్తి ప్రదర్శిస్తే వారికి తలుపు తెరిచే శక్తి ఉంది. యువతలో మనం ఆసక్తి ప్రదర్శిస్తే వారిని మన గృహాలకు ఆహ్వానిస్తే వారి చుట్టు సంతోషకరమైన సహాయకరమైన ప్రభావాల్ని నింపితే దైవిక మార్గములో అడుగులు వేసేవారు. చాలామంది ఉంటారు.MHTel 303.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents