Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    14—ధనికులకు పరిచర్య

    రోమా శతాధిపతి కొర్నేలీ భాగ్యవంతుడు, ఉన్నత వంశంలో జన్మించినవాడు. అతడికున్న సదా విశ్వాస పాత్రమైనది. గౌరవప్రదమైనది. పుట్టుక, శిక్షణ, విద్య యూదులతో తన సంబంధాన్ని బట్టి అతడు నిజమైన దేవున్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తూ బీదల పట్ల దయ ద్వారా తన విశ్వాస యధార్ధతను చూపించాడు. అతడు “ధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునిని ప్రార్ధన చేయువాడు”. అ.కా 10:2MHTel 174.1

    కొర్నేలీకి క్రీస్తు జీవిత మరణాల ద్వారా సువార్తను గూర్చిన జ్ఞానం లేదు. కనుక దేవుడు అతడికి ప్రత్యక్షంగా పరలోకం నుంచే వర్తమానం పంపాడు. ఇంకో వర్తమానం పంపి అతణ్ణి సందర్శించమంటూ అపోస్త లుడు పేతురుని ఆదేశించాడు. కొర్నేలి యూదు సంఘములో చేరినవాడు కాడు. రబ్బీలు అతణ్ణి అన్యుడు అపవిత్రుడుగా పరిగణించివుండవచ్చు. కాని అతడి చిత్తశుద్ధిని దేవుడు చదివి ఈరోమా అధికారికి సువార్తను బోధించటానికి లోకంలో తన సేవకునితో కలపి పనిచేసేందుకు తన సింహాసనుం నుంచి దూతలను పంపించాడు.MHTel 174.2

    అలాగే దేవుడు నేడు ఆత్మల కోసం గొప్పవారి మధ్య పేదవారి మధ్య వెదకుతున్నాడు. తన సంఘంతో జతపడాలని దేవుడు వాంఛిస్తున్న కొర్నేలీ వంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వారి సానుభూతి దేవుని ప్రజల పక్షంగా ఉంది. కాని తమను లోకానికి బంధిస్తున్న బంధాలు వారిని గట్టిగా పట్టుకుంటున్నాయి. దేవుని దీన ప్రజల మధ్య తమ స్థానాన్ని అక్రమించటానికి ఈ వ్యక్తులకు నైతిక ధైర్యం అవసరం. తమ బాధ్యతలు సహవాసాలను బట్టి గొప్ప ప్రమాదంలో ఉన్న ఈ ప్రజల కోసం ప్రత్యేక కృషి జరగాలి.MHTel 174.3

    ఆలక్ష్యం చెయ్యబడ్డ పేదల పట్ల మన విధిని గూర్చి చాలా చెప్పటం జరిగింది. ఆలక్ష్యం చెయ్యబడ్డ ధనికులపై కొంత శ్రద్ధ చూపనవసరం లేదా! అనేకులు ఈ తరగతి ప్రజల్ని నిరీక్షణ లేనివారిగా జమకడతారు. ఈ లోక ప్రాభవం తళుకు బెళుకుల వల్ల అంధులై నిత్యత్వాన్ని పరిగణించకుండ జీవించేవారి కళ్ళు తెరవటానికి వారు ఏమి చెయ్యరు. వేలమంది భాగ్యవంతులు ఈ హెచ్చరిక లేకుండా మరణించారు. కాని నిరాసక్తంగా ఉన్నట్లు కనిపించినా ధనికుల్లో అనేకమంది ఆత్మ విషయమైన భారం ఉన్నవారు. “ద్రవ్యమున పేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తినొందడు; ధనసమృద్దిన పేక్షించువాడు దాని చేత తృప్తనొందడు”. నా ఆశ్రయము నీవే నని” మేలిమి బంగారముతో చెప్పేవాడు. “పరమున నున్న దేవునిని” ఎరుగనివాడు. “ఎవడును ఏవిధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు.. వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేగయలవాడు ఎవడును లేడు; (వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే) ప్రసంగి 5:10 యోబు 31:24,28; కీర్తనలు 49:7,8.MHTel 174.4

    సిరులు, లేక ప్రతిష్ట ఆత్మను తృప్తిపర్చలేవు. భాగ్యవంతుల్లో అనేకులు దైవికమైన ఏదో నమ్మకం కోసం ఏదో ఆధ్యాత్మిక నిరీక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. గురిలేని తమ జీవితాలలోని విసుగును అంతం చేసే దాని కోసం అనేకులు ఎదురు చూస్తున్నారు. అనేకులు తమ అధికారిక జీవితంలో తమకు లేని ఏదో దాని కోసం తమ అవసరాన్ని గుర్తిస్తున్నారు. వారిలో బహు కొద్ది మందే గుడికి వెళ్తారు. ఎందుకంటే గుడికి వెళ్లటం వల్ల తమకు చేకూరే లబ్ది శూన్యమని వారి భావన. తాము వినే బోధ వారి హృదయాల్ని కదలించదు. వారికి వ్యక్తిగత విజ్ఞప్తి చెయ్యకుండా ఉందామా?MHTel 175.1

    లేమి పాపం బాధితుల మధ్య భాగ్యవంతులైన వారు ఉంటారు. జీవితంలోని వివిధ వృత్తులు వివిధ స్థానాల్లోని వారు లోక మాలిన్యం వల్ల మధ్య పానం వల్ల శరీర క్రియల వల్ల శోధనకులోనై పతనమయ్యారు. పతనమైన వీరికి కనికరం సహాయం అవసరమై ఉండగా, ఈ లోతులకు ఇంకా దిగజారని కాని అదే మార్గంలో అడుగులు వేస్తున్న వారి పై కొంత శ్రద్ధ పెట్టవద్దా ?MHTel 175.2

    బాధ్యతాయుత హోదాల్లో ఉన్నవారు గౌరవనీయులు అయిన వేలమంది ఆత్మకు శరీరానికి నాశనాన్ని తెచ్చే అలవాట్లుకు బానిసలై ఉన్నారు సువార్త పరిచారకులు, రాజనీతిజ్ఞలు, గ్రంధకర్తలు భాగ్యం ప్రతిభ కలవారు. గొప్ప వ్యాపార సామర్ధ్యం, ప్రయోజనాలు చేకూర్చటానికి గొప్ప శక్తి ఉన్నవారు అన్ని విషయాల్లోను ఆత్మ నిగ్రహానికి అవసరాన్ని చూడరు. గనుక ప్రాణాంతకమైన ప్రమాదంలో ఉన్నారు. మితానుభవ నియామలను వీరి దృష్టిని ఆకర్షించాలి. సంకుచితమైన నిరంకుశమైన మార్గంలో కాక మానవాళి నిమిత్తం దేవుని ఉద్దేశం వెలుగలో ఆ పని చెయ్యాలి. వాస్తవమైన మితానుభవ నియామాల్ని ఇలా వారి దృష్టికి తేవటం జరిగితే వాటి విలువను గుర్తించి హృదయపూర్వకంగా వాటిని స్వీకరించేవారు ఉన్నత తరగతుల ప్రజల్లో చాలామంది ఉన్నారు.MHTel 175.3

    శారీరక, మానసిక నైతిక శక్తుల్ని దెబ్బతీసే తినటం తాగటం వంటి అలవాట్లు హానికర ఫలితాలను వారికి మనం చూపించాలి. దేవుని వరాలకు ఆయన గృహనిర్వాహకులుగా తమ బాధ్యతను నిర్వర్తించేందుకు వారికి సహయం చెయ్యండి. తమకు హాని మాత్రమే చేస్తున్న దానికి తాము ఇప్పుడు వ్యయం చేస్తున్న ద్రవ్యంతో ఎంతో మేలు చెయ్యగలరని వారికి చూపించండి.MHTel 176.1

    సారా, పొగాకు ఇంకా అటువంటి వ్యసనాలకు వ్యయం చేసే ద్రవ్యాన్ని జబ్బుగా ఉన్నవారికి పేదలకు సహాయం చెయ్యటానికి, పిల్లల్ని యువతను లోకంలో ప్రయోజనకరమైనవారిగా తర్బీతు చెయ్యటానికి ఉపయోగించాల్సిందిగా కోరుతూ సంపూర్ణ నిషేధ ప్రమాణ కార్డు పై సంతంక చేయటానికి వాటిని వారికి సమర్పించండి. అటువంటి విజ్ఞప్తిని తిరస్కరించే వారు ఎక్కువ మంది ఉండరు.MHTel 176.2

    ప్రధానంగా భాగ్యవంతులు గురి అయ్యే ప్రమాదం ఇంకొకటి ఉంది. అది కూడా వైద్య మిషనెరీ సేవారంగమే. లోకంలో వర్దిలుతున్న సామాన్య రకాల దుర్మార్గతకు దిగజారన వేలాదా మంది ధనాశ వల్ల నాశనమౌతున్నారు. మొయ్యటం ఎంతో కష్టమైన పాత్ర కాళీగా ఉంచ కూడదు, అంచుల వరకు నిండి ఉన్న పాత్ర దీన్ని మిక్కిలి జాగ్రత్తగా సమానీకరించాల్సి ఉంటుంది. శ్రమ, దుర్దశ, నిరాశను దు:ఖాన్ని తెస్తాయి. కాని ఆధ్యాత్మిక జీవితానికి మిక్కిలి ప్రమాదకరమైనది సంపద.MHTel 176.3

    “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది” రోమా 1:16.MHTel 177.1

    తలకిందుల పరిస్థితుల్లో బాధపడుతున్నవానిరి ఆరణ్యంలో మోషే చూసిన, మండుతున్నా కాలిపోని, పొద సూచిస్తున్నడు. ఆ పొద మధ్యలో దేవుని దూత ఉన్నాడు. అలాగే లేమిలో, బాధలో ఆధృశ్యంగా ఉన్న ప్రభువు సముఖం మనల్ని ఓదార్చటానికి, సంరక్షించటానికి మనతో ఉంటుంది. వ్యాధి వల్ల దుస్తితి వల్ల బాధపడుతున్నవారి కోసం ప్రార్ధన చేయ్యవలసిన దిగా ప్రార్ధనను కోరటం జరగుతుంది. అయితే మన ప్రార్ధనలు సంపద ఉన్న వారి కోసం పలుకుబడి ప్రభావున్నవారి కోసం ఎక్కువ అవసర మౌతాయి.MHTel 177.2

    పరాభవం సిగ్గు లోయల్లో ఉన్న మనుషులు తమ అవసరాన్ని గుర్తించి, తప పాదాల్ని నడిపించటానికి దేవుని మీద ఎక్కడ ఆధారపడతారో అందులో తులనాత్మకంగా క్షేమముంది. కాని ఉన్నత శిఖరం పై నిలబడి ఉన్న మనుషులు, తమ ఉన్నత స్థానం వల్ల గొప్ప జ్ఞానం ఉన్నట్లు భావించే మనుషులు. వీరు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. అలాంటి వారు దేవుని పై ఆధారపడకపోతే పడిపోవటం ఖాయం.MHTel 177.3

    వ్యక్తి తన భ్యాగ్యాన్ని నిజాయితీగా సంపాదించి ఉంటే బైబిలు ఏ వ్యక్తినీ ధనవంతుడైనందుకు తప్పు పట్టదు. డబ్బు కాదు గాని డబ్బు మీద ఉన్న మమకారం అన్నీ కీడుకలూ మూలం. ధనం సంపాదించటానికి మనుషులకు శక్తినిచ్చేవాడు దేవుడే. దేవుని గృహ నిర్వాహకుడుగా ఉండి తన ద్రవ్యాన్ని స్వార్ధరహితంగా ఉపయోగించే వ్యక్తి చేతుల్లో భాగ్యం ఓ దీవెన.. దాన్ని కలిగి ఉన్నవానికి లోకానికి కూడా. అయితే లోక సబబంధమైన సిరుల పట్ల ఆసక్తిలో తలమునకలైన వారు దేవుని హక్కులను సాటి మనుషుల అవసరాల్ని గుర్తించరు. తమను తాము ఘనపర్చుకునేందుకు తమ భాగ్యాన్ని ఓ సాధనంగా పరిగణిస్తారు. వారు గృహాల మీద గృహాలు స్థలాలు మీద స్థలాలు సంపాదిస్తా. తమ చుట్టు దు:ఖం నేరం వ్యాధి మరణంతో మనుషులు మగ్గుతుండగా వారు తమ గృహాలను విలాస వస్తువులతో నింపుకుంటూ ఉంటారు. ఇలా తమ జీవతాల్ని స్వార్ధ ప్రయోజనాలకు అంకితం చేసుకునేవారు దేవుని గుణలక్షణాల్ని గాక దుష్టుడైన సాతాను లక్షణాల్ని వృద్ధిపర్చుకుంటారు.MHTel 177.4

    ఈ మనుషులకు సువార్త అవసరం. వారి దృష్టి వ్యర్ధమైన లౌకిక విషయాల నుండి మరలి నిత్యమైన ప్రశస్త ఐశ్వర్యాన్ని వీక్షించాలి. ఇవ్వటంలో ఆనందాన్ని గూర్చి దేవుని తోటి పనివారయ్యే ధన్యతను గూర్చి వారు నేర్చుకోవాలి.MHTel 178.1

    ప్రభువంటున్నాడు. “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మికయుంచక, సుఖముగా అనుభ వించుటకు మనకు ధారాళముగా దయచేయు దేవునియందు నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించు కొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు, మేలు చేయువారును, సత్ క్రియలు అనుభవము కలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము”. 1 తిమోతి 6:17-19.MHTel 178.2

    లోకాన్ని ప్రేమించే, లోకాన్ని ఆరాధించే భాగ్యవంతులు క్రీస్తుకి ఆకర్షితులవ్వటం యధాలాప, ఆకస్మిక స్పర్శ ద్వారా కాదు. ఈ వ్యక్తుల్ని చేరటం తరుచు ఎంతో కష్టం. మిషనెరీ స్పూర్తి కలిగి, ఓడిపోని, లేక నిరుత్సాహపడని పురుషులు స్త్రీలు వారి కోసం వ్యక్తిగత కృషి చెయ్యాలి.MHTel 178.3

    ఉన్నత తరగతుల ప్రజల కోసం పని చెయ్యటానికి ప్రత్యేక సమర్ధత గలవారు కొందరున్నారు. ఈ వ్యక్తుల్ని ఎలా చేరాలో తెలుసుకోవటానికి వారితో యధాలాప పరిచయంతో కాక వ్యక్తిగత కృషి సజీవ విశ్వాసం వలన వారిని తమ ఆత్మ అవసరాలకు మేల్కొల్పి, యేసులో ఉన్నట్లు సత్య జ్ఞానానికి నడిపిచటానికి వీరు దేవుని నుంచి వివేకాన్ని కోరాలి.MHTel 178.4

    హెచ్చు తరగతి ప్రజల్ని కలిసేందుకు ఓ పట్టాన నచ్చని వారి అభిరుచు లకు అనుగుణమైన జీవిత విధానాన్ని పని తీరును అవలంభించాలని అనేకులు భావిస్తారు. భాగ్యవంతులుగా కనిపించటం విలువైన భవనాలు, ఖరీదైన దస్తులు, వాహనం, పరిసరాలు, లోకాచారల అనుసరణ, షోకైన సామాజిక కృత్రిమ నాగరికత, సాంప్రదాయిక సంస్కృతి, సొంపైన వాగ్దాటి... ఇవి అవసరమని అనేకులు భావిస్తారు ఇది తప్పు. హెచ్చు తరగతి జలను చేరటంలో లౌకిక విధానం దేవుని మార్గం కాదు. వారిని ఫలప్రదంగా చేరేది క్రీస్తు సువార్తను నిలకడగా, నిస్వార్ధంగా సమర్పించే మార్గమే.MHTel 178.5

    ఏథెన్సు తత్వవ్రేలను కలవటంలో అపొస్తులుడు పౌలు అనుభవంలో మనకో పాఠం ఉంది. ఆరేయొపగు సభ ముందు సువార్తను సమర్పిస్తున్నా ప్పుడు పౌలు తర్కాన్ని తర్కంతో, శాస్త్రాన్ని, శాస్త్రత్రంతో, విజ్ఞానాన్ని, విజ్ఞానంత, తత్వాన్ని తత్వంతో ఎదుర్కున్నాడు. అతడి శ్రోతల్లో మిక్కిలి ప్రతిభావంతులు విస్మయం చెంది నిరుత్తరులయ్యారు. అతడి మాటలను ఖండించలేక పోయారు కాని ఈ ప్రయం్నత వల్ల ఫలం దక్కలేదు. సువార్తను స్వీకరించిన వారు ఎక్కువ మంది లేరు. అప్పటి నుండి పౌలు వేరే కృషి విధానాన్ని అనుసరించాడు. దీర్ఘ తర్కాన్ని సిద్ధాంత చర్చను విడిచి పెట్టి క్రీస్తును పాపుల రక్షకునిగా ప్రజలకు సమర్పించాడు. కొరింథీయుల మధ్య తన పనిని గూర్చి రాస్తూ పౌలన్నాడు.MHTel 179.1

    “సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినపుడు వాక్చాతుర్యముతో గాని, జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మములను మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను యేసు క్రీస్తును అనగా సిలవు వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేవుని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించు కొంటిని... మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసికొనవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించును, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశు ద్దాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని”. 1 కొరి 2:1-5. మళ్ళీ రోమియులకు తాను రాసిన ఉత్తరంలో అంటున్నాడు. “సువర్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసుదేశస్తునికి కూడ రక్షణ కలుగ జేయుటకు అది దేవుని శక్తియైయున్నది”. రోమా 1:16.MHTel 179.2

    తమ సహచరులు దేవ దూతలని గుర్తుంచుకుని పై తరగతుల వారి కోసం పనిచేసేవారు హుందాగా వ్యవహరించాలి. ధనాగారం అయిన తమ మనసును ‘అని వ్రాయబడి ఉన్నది” అన్న సత్య నిధులతో నింపు కోవాలి. క్రీస్తు పలికిన ప్రశస్త వాక్కుల్ని మీ స్మృతి మందిరంలో వేలాడన్విండి. వెండి బంగారాలకన్నా ఎక్కువ విలువ గలవిగా వాటిని ఎంచుకోండి.MHTel 180.1

    ఓ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం కన్నా ఓ ఒంటి సూది బెజ్జంలో ప్రవేశించటం సులభం అన్నాడు. క్రీస్తు ఈ తరగతి ప్రజలకు చేసే పనిలో అనేక ఆశాభంగాలు ఎదురవుతాయి. విసుగు పుట్టించే అనేక విషయాలు వెలుగు చూస్తాయి. కాని దేవునికి అంతా సాధ్యమే. ధన సంపాదనకు అంకితమైన హృదయాలపై పనిచెయ్యటానికి ఆయన మానవ సాధనలకు ఉపయోగించగలడు. ఉపయోగిస్తారు.MHTel 180.2

    “తనకు మొఱ్ఱ పెట్టువారి కందరికి తనకు నిజముగా యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొట్ట అలకించి వారిని రక్షించును((. కీర్తనలు 145:18, 19.MHTel 180.3

    మారు మనసుస్స చోటు చేసుకునే సందర్భముగా ఆద్భుత కార్యాలు. ఇప్పుడు అవగాహన కాని ద్భుత కార్యాలు జరగాల్సి ఉన్నాయి. లోకంలోని అత్యధికులు అద్భుతాలు చేసే దేవుని శక్తికి మించిన వారు కారు. దేవుని తోటి పనివారు తమ విధిని ధైర్యంగా, నమ్మకంగా నిర్వర్తించటానికి సమ్మతంగా ఉంటే, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న, మేధా ప్రభాలు గల మనుషుల మనసుల్ని దేవుడు మార్చుతాడు. పరిశుద్దాత్మ శక్తి ద్వారా అనేకమంది దేవుని నియామాలను అంగీకరించటానికి నడిపించబడతారు.MHTel 180.4

    మానవుల బాధను నివారించటానికి తన ప్రతినిధులుగా దేవుడు తమను కోరుతున్నాడని తమకు విశదం చేసిననప్పుడు అనేకులు సప్రందించి బీదల సహాయార్ధం తమ ద్రవ్యాన్నిస్తారు సానుభూతి చూపు తారు. తమ స్వార్ధ ఆసక్తులనుంచి వారి మనసు ఆకర్షితమౌతుండగా అనేకమంది తమను తాము క్రీస్తుకు సమర్పించుకుంటారు. తమ పలుకు బడి, ద్రవ్యం తలాంతులతో వారు తమ మార్పుకు దేవుని ప్రతినిధి అయిన మిషనెరీతో చెయ్య కలిపి సంతోసంగా పరోపకార సేవలో పాలు పంచుకుంటారు.MHTel 180.5

    లోకంలో తమ ఐశ్వర్యాన్ని సరిగా వినియోగించటం ద్వారా తమ కోసం “పరలోకమందు ధనమును సంపాదించు” కుంటారు. “అక్కడికి దొంగలు రారు, చిమ్మెట కొట్టదు”.MHTel 181.1

    క్రీస్తును రక్షకుడుగా స్వీకరించిచనప్పుడు అనేకులు తమ తరగతి ప్రజల కోసం పని చెయ్యటానికి దేవుని చేతిలో సాధనాలవుతారు. ఈ లోకమే తమ సమస్తం అని భావించేవారి నిమిత్తం ఓ సువార్త సేవా సమయం తమకు దేవుడు అప్పగించాడని వారు పరిగణిస్తారు. సమయం ద్రవ్యం దేవునికి అంకితం చేయబడతాయి. క్రీస్తుకు ఆత్మలను సంపాదించటానికి ప్రతిభ, ప్రభావం వినియోగించబడతాయి.MHTel 181.2

    ఈ రకమైన పరిచర్య ద్వారా ఏమి సాధించబడుతుందో... సందేహం, లౌకికత, ఆశాంతితో వ్యాధిగ్రస్తమైన ఎన్ని ఆత్మలు, తన వద్దకు వచ్చే వారిని రక్షించటానికి ఎదరు చూస్తున్న రక్షకుని వద్దకు తేబడ్డాయో నిత్యత్వం మాత్రమే వెల్లడి చేస్తుంది.MHTel 181.3

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents