Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తల్లి తరుణం

    పైన దేవుడున్నాడు. ఆయన సింహసనం నుంచి వెలుగు మహిమ దుష్టతను ప్రతిఘటించటానికి తన బిడ్డలకు శిక్షణిచ్చే తల్లి పై ఉంటాయి. ఆమె పని అంత ప్రాముఖ్యమైనది ఇంకొకటి లేదు. చిత్రకారుడిలా ఆమె పటము మీద ఓ అందమైన రూపాన్ని చింత్రించదు. లేక ఓ శిల్పిలా రాతిని చెక్కదు. ఓ రచయితలా శక్తిమంతమైన మాటల్లో ఓ ఉదాత్త భావం వ్యక్తం చెయ్యదు. లేక ఓ సంగీత కారుడిలా ఓ మధుర భావాన్ని ఆలపించదు. దేవుని సహయంతో దేవుని స్వరూపాన్ని మానవుడిలో వృద్ధిపర్చటం ఇక్కడ జరుగుతుంది.MHTel 323.2

    ఏ తల్లీ దీన్ని అభినందిస్తుందో ఆమె తన తరుణాలు ఎంతో విలువైనవని పరిగణిస్తుంది. ఆమె తన సొంత ప్రవర్తనలోను తన శిక్షణ పద్ధతుల్లోను తన బిడ్డలముందు అత్యున్నత లక్ష్యాన్ని ప్రదర్శించటానికి పట్టుదలతో ప్రయత్నిస్తుంది. తన బిడ్డల శిక్షణలో మానసిక అత్యున్నత శక్తులను సరిగా ఉపయోగించేందుకు గాను తన సొంత సామార్యాల్ని వృద్దపర్చుకోవటానికి పట్టుదలతో ఓర్పుతో ధైర్యంతో కృషి చేస్తుంది. “దేవుడు ఏమి చెప్పాడు”? అని అతురతగా అడుగుతుంది. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా పఠిస్తుంది. తన అనుదిన సామాన్య ఇచంతలు విధులలో తన సొంత అనుభవి యధార్ధమైన ఆ ఏకైక ప్రభువు జీవితానికి ప్రతిబింబమై ఉండేటట్లు తన తదృష్టిని క్రీస్తు పై నిలుపుతుంది.MHTel 323.3

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents