Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    29—గృహనిర్మాణకులు

    అవ్వను ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇచ్చిన ప్రభువు ఓ పెళ్ళి విందులో తన మొదటి అద్భుతాన్ని చేసాడు. మిత్రులు బంధువులు కలసి సంతోషిస్తున్న విందు హాలులో క్రీస్తు తన బహిరంగపరిచర్యను ప్రారంభించాడు. ఈ విధముగా ఆయన వివాహాన్ని అనుమతించి తానే స్థాపించిన వ్యవస్థగా గుర్తించాడు. పురుషులు స్త్రీలు పరిశుద్ద వివాహం ద్వారా ఏకమవ్వాలని పరలోక కుటుంబములో సభ్యులుగా గుర్తించబడే గౌరవం పొందే సభ్యులతో కుటుంబాలను నిర్మించుకోవాలని దేవుడు నియమించాడు.MHTel 305.1

    తనకూ తాను విమోచించిన ప్రజలకూ మధ్య ఉన్న ఏకత్వానికి వివాహ బాంధవ్యాన్ని ఓ చిహ్నంగా క్రీస్తు గౌరవించడాడు. ఆయనే పెండ్లి కుమారుడు. ఎవరి గురించి క్రీస్తు “నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమియు లేదు”(ప.గీ.4:7) అని క్రీస్తు ఎవరి గురించో అంటున్నాడో ఆ సంఘం పెండ్లికుమార్తె “క్రీస్తు కూడ సంఘమను ప్రేమించి అది కళంకమైనను మడతయైనను ... లేక.... తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను” అటువలెనే పురుషులు కూడ తమ... భార్యలను ప్రేమింపబద్దులై యున్నారు”. ఎఫెసీ 5:25-28.MHTel 305.2

    కుటుంబ బంధం మిక్కిలి సన్నిహితమైనది. లోకంలో ఉన్న సంబంధాలన్నిటిలోను అది అతి మృదువైనది పవిత్రమైనది. మానవాళికి దీవెనగా ఉండటానికి దాన్ని దేవుడు రూపొందించాడు. వివాహ బాంధవ్యంలోకి ఎక్కడ దైవభీతితో దాని బాధ్యతల పరమైన పరిగణనతో విజ్ఞతతో ప్రవేశించటం జరుగుతుందో అక్కడ అది దీవెనగా ఉంటుంది.MHTel 305.3

    పెళ్ళి చేసుకోవాలని ఆలోచిస్తే వారు తాము స్థాపించనున్న గృహ స్వభావ ప్రభావాలు ఎలాంటివో పరిగణించాలి. వారు తల్లితండ్రులైనప్పుడు వారికి పవిత్రమైన విధి అప్పగించబడుతుంది. ఈ లోకంలో తమ పిల్లల సంక్షేమం, రానున్న లోకంలో వారి సంతోషం చాలా మేరకు వారి మీదే ఆధారపడి ఉంటుంది. తమ చిన్నారులు పొందే శారీరకమైన నైతికమైన ముద్రను చాలా మట్టుకు వారే నిర్ణయిస్తారు. సమాజ పరిస్థితి కుటుంబ స్వభావం పై ఆధారపడి ఉంటుంది. ప్రతీ కుటుంబ ప్రభావం బరువు త్రాసులో పైకి వెళ్లటం ద్వారానో కిందికి వెళ్ళటం ద్వారానో వ్యక్తమౌతుంది.MHTel 305.4

    జీవిత భాగస్వామి ఎంపిక తల్లితండ్రులకు వారి పిల్లలకు శారీరక మానిసిక ఆధ్యాత్మిక సంక్షేమాన్నిచ్చేదిగా, తమ తోటి మనుషులకు మేలు చేసేవారిగా తమ సృష్టికర్తను ఘనపర్చే వారిగా తల్లితండ్రుల్ని పిల్లల్ని నడిపంచేదిగా ఉండాలి.MHTel 306.1

    వివాహం తెచ్చె బాధ్యతల్ని చేపట్టేముందు యువకులు, యువతులు ఆచరణాత్మక జీవితంలో జీవిత విధులు భారాలకు తమను సిద్ధం చేసే అనుభవం కలిగి ఉండాలి. చిన్న వయసులో వివాహన్ని ప్రోత్సహించ కూడదు వివాహమంత ప్రాముఖ్యమైన దీర్ఘకాలిక పలితాలు గల బాంధవ్యంలోకి తొందరపాటుతో గాని చాలినంత సిద్ధబాటు లేకుండా గాని మానసిక, శారీరక శక్తులు బాగా వృద్ధి చెందకుండగాని ప్రవేశించి కూడదు.MHTel 306.2

    భాగస్వాములకు భాగ్యం లేకపోవచ్చు. కాని వారికి అంతకన్నా గొప్ప దీవెన ఆరోగ్యం కావాలి. వారి వయసులో ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదు. ఈ నిబంధన ఆలక్ష్యం తక్కువ వయస్సు గల వ్యక్తికి ఆరోగ్యపరంగా తీవ్ర హాని కలుగవచ్చు. తరుచు వారి పిల్లకు మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుంది. చిన్న వయస్కులైనవారి జీవితాలకు కావాల్సిన శ్రద్ధ స్నేహ భావం పెద్ద వయస్సు గల తండ్రి లేక తల్లి నుండి పిల్లలు పొందలేరు. ప్రేమ, నడుపుదల ఎక్కువ అవసరమైనప్పుడు తండ్రి లేక తల్లి మరణం వల్ల అవి లభించకపోవచ్చు.MHTel 306.3

    క్రీస్తులో మాత్రమే వివాహ బాంధవ్యం సురక్షితంగా ఏర్పడగలదు. మానవ ప్రేమ దేవుని ప్రేమనుంచి సన్నిహిత బాంధాన్ని ఏర్పర్చుకోవలి. క్రీస్తు పరిపాలించే చోటే గాఢమైన, యదార్ధమైన స్వార్ధరహితమైన ప్రేమ ఉంటుంది.MHTel 306.4

    ప్రేమ యేసు వద్ద నుండి మనం పొందే వరం. పవిత్రమైన పరిశు ద్దమైన ప్రేమ ఓ మనోభావం కాదు. అది ఓ నియమం యదార్ధ ప్రేమ వలన క్రియాశీలతయే వారు అనుచితంగా గాని గుడ్డిగా గాని వ్యవహరిం చరు. వారు పరిశుద్దాత్మ నడుపుదల కింద వ్యవహరిస్తారు. దేవున్ని సమున్నతంగా తమ పొరుగువారిని తమ వలె ప్రేమిస్తారు.MHTel 307.1

    “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలె క్రీస్తు కూడ సంఘమను ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించు కొనెను”. ఎఫెసీ 5:25MHTel 307.2

    వివాహం చేసుకోవాలని తలుస్తున్నారు., తమ జీవితాల్ని ఎవరితో ముడి వేసుకోవాలనుకుంటున్నారో అతడు లేక ఆమె ప్రవర్తనలో ప్రతీ భావోద్వేగాన్ని ప్రతీ పరిణామాన్ని పరిశీలించాలి. వివాహ బాంధవ్యం దిశగా వేసే ప్రతీ అడుగు నమ్రతతో, నిరాడంబరతతో, చిత్తశుద్ధితో, దేవున్ని అనందింపజెయ్యటానికి ఘనపర్చటానికి ఉద్దేశించి వెయ్యాలి. ఈ లోకంలోను రామన్న లోకంలోను వివాహం అనంతరము జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చిత్తశుద్ధి గల క్రైస్తవుడు దేవుడు ఆమోదించలేని ప్రణాళికల్ని తయారు చేసుకోడు.MHTel 307.3

    మీకు దైవ భీతి గల తల్లితండ్రులుంటే వారి సలహాలు కోరండి మీ ఆశాభావాలు ప్రణాళికలు వారితో పంచుకోండి, వారికి తమ జీవితా నుభవాలు నేర్పిన పాఠాల్ని వారి నుండి నేర్చుకోండి. అప్పుడు మీకు ఎంతో తలనొప్పి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా క్రీస్తును మీ ఆలోచన కర్తగా చేసుకోండి. ప్రార్ధన పూర్వకంగా ఆయన వాక్యం చదవండి.MHTel 307.4

    అలాంటి మార్గదర్శకత్వ ంలో ఓ యువతి పవిత్రమైన, పురుష లక్షణాలు గల యువకుణ్ణి, పట్టుదల, వృద్ధి పొందాలన్న కోరిక, నిజాయితీ గల యువకుణ్ణి దేవుని ప్రేమించి ఆయనకు భయపడే యువకుణ్ణి మాత్రమే తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలి. ఓ యువకుడు ఎవరు తన పక్కన నిలిచి జీవిత సమస్యల్లో తన వంతు భారాన్ని మోయటానికి సమర్దురాలో, ఎవరుతన ప్రభావంతో తనను సౌమత్య, సంస్కారం గల వ్యక్తిని చేస్తుందో ఎవరు తన ప్రేమలో తనను ఆనందింపజేస్తుందో ఆ యువతినే తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలి.MHTel 307.5

    “సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. “ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యంచును. ఆమె తాను బ్రతుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ” జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృప గల ఉపదేశము ఆమె బోధించును.ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కని పెట్టును. పని చేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమనుసరించియునారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.” అటువంటి “భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు”. సామెతలు 19:14:31:11, 12, 26-29, 18+22MHTel 308.1

    వివాహ బాంధవ్యంలోకి ఎంత జాగ్రత్తగా వివేకంగా ప్రవేశించిన, పెండ్లి ప్రమాణాలు పెండ్లి కార్యం ముగిసినప్పుడు పూర్తిగా ఏకమైన దంపతులు బహు కొద్దిమందే సతీపతులు వివాహం ద్వారా ఏకమవ్వటం అనంతరం సంవత్సరాల్లో జరిగే పని.MHTel 308.2

    నూతనంగా జతపడ్డ భార్యభర్తల జంటను ఆందోళన చింతతో కూడిన జీవితం కలిసినప్పుడు పెండ్లిని గురించి ఊహ చిత్రించుకున్న ప్రణయం మాయమౌతుంది. భర్త భార్య తన మునుపటి సహావాసంలో తెలుసుకోవటం సాధ్యపడని రీతిగా ఒకరొకరి ప్రవర్తనను తెలుసుకుటారు. వారి అనుభవంలో ఇది మిక్కిలి క్లిష్ట సమయం. వారి భవిష్యత్తు జీవితమంతా సంతోషం ప్రయోజకత్వం ఇప్పుడు వారు అవలంభించే సరియైన మార్గం మీద ఆధారపడి ఉంటాయి. తరుచు వారి ఒకరొకరిలో తాము ఊహించని బలహీనతలు లోపాలు ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే ప్రేమ ఏకంచేసిని ఆ హృదయాలు ఇంతకు ముందు తమకు కనిపించని లోపాలకన్నా గొప్ప గుణాల్ని కూడా కనుగొంటాయి. తరుచు మన వైఖరి మన చుట్టు ఉన్న వాతావరణం, మనం ఇతరుల్లో ఏమి కనుగుంటామో దాన్ని నిర్ణయిస్తాయి. చాలమంది ప్రేమ వ్యక్తీకరణను ఓ బలహీనతగా పరిగణించి, ఇతరులను తరిమివేసే గోప్యతను ప్రదర్శిస్తారు. ఈ స్వభావం సానుభూతి ప్రవాహానికి అడ్డు కట్టవేస్తుంది. సాంఘిక, ఉదార ప్రవృత్తులు అణిచివేతకు గురి అవ్వటంతో అవి అణగారిపోతాయి, హృదయం జీవం లేనిదై చల్లబడుతుంది. ఈ పొరపాటును మనం మనసులో ఉంచుకోవాలి. వెలిబుచ్చకుండా ఉంచిన ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. మీతో జతపడ్డ వ్యక్తి హృదయానికి దయ సానుభూతి పంచకుండా ఎండిపోనివ్వకండి.MHTel 308.3

    శ్రమలు, ఆందోళనలు, ఆశాభంగాలు ఎదురైనా భర్త గాని భార్య గాని తమ వివాహం ఓ పొరపాటునో ఓ ఆశాభంగమనో కలిగే తలంపుల్ని మనసులో ఉంచుకోకూడదు. ఒకరితో ఒకరు తాము ఎంత అన్యోన్యంగా ఉండటం సాధ్యమో అంత అన్యోన్యంగా ఉంచటానికి నిశ్చయించుకోండి. ముదటి శ్రద్ధాసక్తుల్ని కొనసాగించండి. జీవిత పోరాటాన్ని పోరాడటంలో అన్ని విధాల ఒకర్నొకరు ప్రోత్సహించుకోండి ఒకరి సంతోషం కోసం ఒకరు కృషి చెయ్యండి. పరస్పర ప్రేమ పరస్పర సహనం చూపించుకోండి. అప్పుడు వివాహం ప్రేమకు అంతం బదులు ప్రారంభమౌతుంది. నిజమైన స్నేహపు వెచ్చదనం, మనసును మనసుతో ముడివేసే ప్రేమ పరాలోకానందనాన్ని కొంచెం రుచి చూపించటంలా ఉంటాయి.MHTel 309.1

    ప్రతీ కుటుంబం చుట్టు పగలగొట్టరాని ఓ పవిత్ర వలయం ఉంది. ఈ వలయంలోకి రావటానిక ఇతరులెవ్వరికి హక్కులేదు. తమకు మాత్రమే చెందిన రహస్యాల్ని భర్త గాని భార్య గాని ఇతరులతో పంచుకోకూడదు.MHTel 309.2

    ఇద్దరూ ప్రేమను పరస్పరం ఇచ్చుకోవాలి గాని బలవంతముగా తీసుకోకూడదు. మీలో ఉన్న ఉత్తమ గుణాన్ని వృద్ధి పర్చుకోండి. ఒకరొకరిలోని మంచి గుణాల్ని గుర్తించటానికి ముందుండండి. అభినందించబడుతున్న స్పృహ అద్భుతమైన ప్రేరకం, తృప్తి సానుభూతి గౌరవం ఉత్కృష్టతకు కృషిని ప్రోత్సహిస్తుంది. సమున్నత ధ్యేయాలను ప్రేరేపిస్తుండగా ప్రేమ వృద్ధి చెందుతుంది.MHTel 309.3

    భార్య భర్తల్లో ఏ ఒక్కరూ తన వ్యక్తిత్వాన్ని తక్కిన వ్యక్తి వ్యక్తిత్వంతో మమేకం చెయ్యకూడదు.వారిలో ఒక్కొక్కరికి దేవునితో వ్యక్తిగత సంమందఉ న్నది.ఆయన్ని గురించి ఒక్కొక్కరూ ఏదిన్యాయం’? ఏదితప్పు”? జీవిత ఉ దేశాన్ని నేను ఉత్తమ విధంగా నెరవేర్చగలన”? అని ప్రశ్నించుకోవాలి. మీ కోసం ప్రాణాన్నర్పించిన ఆయన పట్ల మీ ఉత్కృష్ట ప్రేమను ప్రవ హించ నివ్వండి. ప్రతీ విషయంలోను క్రీస్తును మొదటివానిగా చివరివానిగా ఉ త్తముడిగా చెయ్యండి. ఆయన పట్ల మీ ప్రేమలోతుగాను బలంగాను అయినప్పుడు మీ ఇరువులు ప్రేమ పవిత్రం బందం అవుతుంది..,MHTel 310.1

    క్రీస్తు మనపట్ల కనపర్చే వాత్సల్యాన్ని భర్త భార్య ఒకరిపట్ల ఒకరు కనపర్చాలి. “క్రీస్తు మిమ్మును ప్రేమిచ్చిన ప్రకారం “మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి” “సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలె క్రీస్తు కూడా సంఘమను ప్రేమించి. . దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను” ఎఫెసీ 5:2, 24,25MHTel 310.2

    భర్త గాని భార్య గాని ఒకరిపై ఒకరు నిరంకుశ అధికారం చలాయించటానికి ప్రయత్నించకూడదు. మీ కోరికలను లొంగదీయటానికి ఒకరినొకరు బలవంత పెట్టవద్దు. ఇలా చేసి పరస్పర ప్రేమను నిలుపుకోలేరు. దయ, ఓర్పు, సహనం, పరిగణన, మర్యాద కలిగిఉండండి. మీ పెండ్లి ప్రమాణాల్లో మీరు వాగ్దానం చేసినట్లు దేవుని కృప వల్ల మీరు ఒకరినొకరు సంతోషపర్చటంలో విజయం సాధిస్తారు.MHTel 310.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents