Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంచలనాత్మక సాహిత్యం

    నేడు పేరుగాంచిన ప్రచురణలు సంచలనాత్మక కథలతో నిండి యువతకు దుర్మార్గతలో శిక్షణిచ్చి వారిని నాశన మార్గంలో నడిపిస్తున్నాయి. వయస్సులో చిన్న పిల్లలు నేర జ్ఞానంలో పెద్దవారు. తాము చదువుతున్న కథలు వారిని దుర్మార్గతకు పురికొల్పుతున్నాయి. ఆ కథల్లో చిత్రించబడ్డ పనుల్ని తాము ఊహల్లో చేస్తున్నట్లు భావిస్తారు. వారిలో కోరిక మేల్కొంటుంది. నేరం చేసి శిక్ష తప్పించుకోవటానికి ఏమి చెయ్యాలో ఆలోచిస్తారు. పిల్లలు యువత చురుకైన మనసులకు భవిష్యత్తును గూర్చిన ఊహ చిత్రాల్లోని దృశ్యాలు వాస్తవాలుగా ఉంటాయి. విప్లవాలు ప్రవచించ బడ్డప్పుడు చట్టం, కట్టడ ఆటంకాలను బద్దలు చేస్తాయంటూ వర్ణించిన కార్యాలన్నీ చోటుచేసుకున్నప్పుడు, అనేకులు ఈ కార్యాల స్పూర్తిని వంటపట్టించుకుంటారు.ఈ సంచలనాత్మక కార్యాల స్పూర్తిని వంటపట్టించు కుంటారు. ఈ సంచలనాత్మక రచయితలు చిత్రించిన వాటికన్నా ఘోరమైన నేరాలను చెయ్యటానికి వారు మందుకి వెళ్తారు. ఇటువంటి ప్రభావల ద్వారా సమాజం నైతికంగా పతనమౌతుంది. చట్టరాహిత్యత విత్తనాలు వెదజల్లబడతాయి. ఫలితంగా పండిన నేరం పంట ఎవరికి విస్మయం కలిగించనవసరంలేదు.MHTel 387.2

    ప్రేమ కథలు, చౌకబారు, ఉద్రేకభరిత ఘాధలు, పాఠకుడికి శాపంగా మారుతున్నాయి. రచయిత నీతిని బోధిస్తున్నట్లు చెప్పవచ్చు. పుస్తకమంతటా కొన్ని మత సంబందమైన అభిప్రాయాల్ని అల్లవచ్చు. కాని తరుచు ఇవి వాటికింద ఉన్న బుద్దిహీనతను వ్యర్ధ విషయాల్ని కప్పిపుచ్చటానికి మాత్రమే పనికి వస్తాయి.MHTel 388.1

    ఆకట్టుకునే తప్పిదంతో నిండిన పుస్తకాలు లోకాన్ని వరదలలో ముంచుతున్నాయి. ఆసత్యంగా బైబిలు ఖండించే దాన్ని యువత సత్యంగా అంగకీరిస్తున్నారు. ఆత్మకు నాశనం కలిగించే మోసాన్ని ప్రేమించి విడిచి పెట్టకుండా పట్టుకుంటున్నారు.MHTel 388.2

    సత్యాన్ని బోధించటానికి లేక ఓ గొప్ప కీడును వెల్లడి చెయ్యటానికి రాసిన కొన్ని కాల్పనిక గ్రంథాలున్నియి. వీటిలో కొన్ని పుస్తకాలు మంచి చేసాయి. అయినా అవి చాలా కీడు కూడా చేసాయి. వాటిలో ఊహను విపరీతంగా రెచ్చగొట్టి ముఖ్యంగా యువతకు ప్రమాదకరమైన భావ పరపంఠను రేపే చిత్రీకరణలు వాక్యాలు ఉన్నాయి. వర్ణింపబడ్డ దృశ్యాలను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వాటిని ఆలోచనల్లో అనుభవించటం జరుగుతుంది. అటువంటి పఠనం మనసును ఆధ్యాత్మిక కార్యకలపాలకు అసమర్ధం అయోగ్యం చేస్తుంది. అది బైబిలులో ఆసక్తిని నాశనం చేస్తుంది. పరలోక విషయాలను గురించిన ఆలోచన లేకుండా చేస్తుంది. వర్ణించబడ్డ అపవిత్ర దృశ్యల పై మనసు నిలవటంతో ఉద్రేకం మేల్కొంటుంది. పర్యవసనం పాపం.MHTel 388.3

    అపవిత్ర సూచనలేని ఉన్నత నియమాల బోధనకు ఉద్దేశించిన కల్పిత కథ కూడా ప్రమాదకరం. అది కథకోసం అది కథకోసం తొందరగా పై పైని చదవటం ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా బలమైన సంబంధిత ఆలోచనా శక్తి కొనసాగింపునున నాశనం చెయ్యటానికి తోడ్పడుతుంది. విధి నిర్వహణ, భవిష్యత్తు వంటి గొప్ప సమస్యల గురించి ఆలోచించాటానికి అది ఆత్మను అసమర్ధం చేస్తుంది.MHTel 388.4

    వినోదం కోసం చదవటానికి అభిలాషను పెంచటం ద్వారా కల్పిత కథా పఠనం జీవిత ప్రయోగాత్మక సమస్యల పట్ల నిరాసక్తతను సృష్టిస్తుంది. దానిని ఉద్రేకపరిచే మత్తు కలిగిచే శక్తి వల్ల అది మానసిక శారీరక వ్యాధులు రెండింటికి తరుచు కారణమౌతుంది. నిర్లక్ష్యానికి గురి అయిన అనేక గృహాలు, వ్యాధిగ్రస్తులై జీవితమంతా కదలలేని స్తితిలో ఉండే అనేకులు పిచ్చి ఆసుపత్రలు పాలైన అనేకమంది అలా తయారవవ్వటానికి వారి నవలా పఠనం అలవాటు కారణం.MHTel 389.1

    యువతను సంచలనాత్మక లేక చౌకబారు సాహిత్య పఠనం నుంచి కాపాడటానికి వారికి మెరుగైన కల్పిత సాహిత్యాన్ని అందించాలని ప్రతిపాదించటం తరుచు జరుగుతుంటుంది. ఇది త్రాగుబోతు తాగుడు మాన్పటానికి విస్కీ బ్రాంధీ బదులు ద్రాక్ష రసం, బీరు, యాపిల్ రసం వంటి తక్కువ మత్తు పానీయాల్విటం ఉంటుంది. వీటి వాడకం ఇంకా బలమైన ప్రేరకాలకు వాంఛను పుట్టిస్తుంది. తాగుబోతుకి మితానుభవం అనుసరించే వాడికి మద్యం పూర్తి విసర్జనే రక్షణ. కాల్పనిక సాహిత్య ప్రేమికుడికి ఇదే నిబంధన వర్తిస్తుంది. పూర్తి విసర్జన ఒక్కటే క్షేమం.MHTel 389.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents