Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వస్థత తాలూకు బైబిలు సూత్రాలు

    ఆరోగ్యాన్ని తిరగి సంపాదించుకోగోరేవారికి లేక కాపాడుకోగోరేవారకి లేఖన వాక్కుల్లో ఓ పాఠం ఉంది. మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులైయుండుడి” ఎఫెసీ 5:18 శరీరానికి లేక ఆత్మకు వాస్తవమైన స్వస్థత ఆస్వాభావిక లేక ఆనారోగ్యకర ప్రేరకాలు కలిగించే ఉద్రేకం ద్వారా గాని ముత్త ద్వారా గాని లేక క్షుద్రరుచులు ఆవేశాల తృప్తి ద్వారా గాని రాదు. దేవుడు లేనివారు నిరక్షణ లేనివారు వ్యాధిగ్రస్తుల్లో అనేకులున్నారు. వారు తీరని కోర్కెలతో, అస్తవ్యస్తమైన ఉద్రేకాలతో తమ సొంత అంతర్మాతల ఖండనతో బాధ పడుతున్నారు. జీవితం పై పట్టుకోల్పోవుతున్నారు. వారికి రానున్న నిత్య జీవితాన్ని గూర్చిన నిరీక్షణ లేదు.MHTel 208.1

    రోగులకు సహాయకులైన వారి వీరి వ్యర్ధమైన, ఉత్సాహాన్ని పుట్టించే కోర్కెల తృప్తిని ఆమోదించటం ద్వారా ఈ రోగులకు మేలు చెయ్యటినికి చూస్తారు. తమ జీవితాల్లో వీరికున్న స్వస్థతలు ఇవే. ఇక్కడ తృప్తిని పొందటానికి చూసినంత కాలం ఆకలిగాను దాహంతోను ఉన్న ఆత్మ ఆకలిగాను దాహంగాను ఉంటూనే ఉంటుంది. స్వార్ధ వినోదమనే ఊట నుండి తాగేవారందూ మోసపోతారు. వారు ఉల్లాసాన్ని బలంగా అపార్టుం చేసుకుంటారు. ఆ ఉద్రేవకం చల్లారిన తరువా వారి ఉత్తేజం అంతమొందు తుంది. వారికి నిరాశ నిస్పృహలే మిగులుతాయి.MHTel 208.2

    స్థిరమైన శాంతికి, ఆత్మకు నిజమైన విశ్రాంతికి ఒకే ఒక మూలం ఉంది. “ప్రయాసపడి భారము మోసికనొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును ‘ (మత్తయి 11:28) అన్నప్పుడు క్రీస్తు దీన్ని గూరించే మట్లాడాడు”. “శాంతి మీకును గ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లుగా నేను మీకనుగ్రహించుటలేదు”. యోహాను 14:27 ఈ శాంతి తనను మినహాయించుకొని ఆయన మనకిచ్చేదేదో కాదు. అది క్రీస్తులో ఉన్నది. క్రీస్తును స్వీకరించటం ద్వారా మనం దాన్ని పొందగలం.MHTel 208.3

    క్రీస్తే జీవపు ఊట. అనేకలకు అవసరమైనది ఆయను గూర్చి స్పష్టమైన జ్ఞానం. పరలోక సాధనాలకు శరీరం మొత్తం ఎలా తెరవబడాలో వారిక సహనంతో, దయతో, పట్టుదలతో, బోధించాలి. ఆత్మలోని చీకటి గదులను దేవుని ప్రేమ అనే సూర్యకాంతి వెలిగించినప్పుడు అలసట, అసంతృప్తి అంతమౌతాయి. తృప్తినిచ్చే ఆనందం మనసుకు శక్తిని ఆరోగ్యాన్ని, శరీరాన్ని బలాన్ని ఇస్తుంది,.MHTel 209.1

    మనం బాధతో నిండిన లోకంలో నివసిస్తున్నాం. శ్రమ, కష్టం , దు:ఖం పరలోక గృహానికి మార్గం అంతటిలోను మన కోసం వేచి ఉన్నాయి. కాని నిత్యం కష్టాలకు ఎదరుచూడటం వల్ల జీవిత భారాలను దు:ఖాలను రెండు రెట్లు చేసుకునేవారు. అనేకులున్నారు. వారికి గడ్డుకాలంMHTel 209.2

    “కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నిపములు దేవుని తెలియజేయుడి”, ఫిలిప్పీ 4:6MHTel 209.3

    ఎదురైనప్పుడు లేక ఆశా భంగం కలిగినప్పుడు అంతా పోయిందన్న భావన కలుగుతుంది. తమకు తప్పక లేమి సంభవిస్తుందని వారు తలస్తారు. ఇలా వారు తమ మీదికి దౌర్భాగ్యస్థితిని తెచ్చుకొని తమ చుట్టు నీడలు నింపుకుంటారు. వారికి జీవితం భారమౌతుంది. కాని అది ఎలా కానవసరం లేదు. వారి ఆలోచనా సరళిని మార్చటానిక నిర్ణయాత్మకమైన కృషి అవసరమౌతుంది. కాని మార్పు సాధించవచ్చు. ఈ జీవితానికి అవి నిత్య జీవితానికి వారి ఆనందం సంతోషకరమైన విషయాలపై మనసులను నిలిపి ఉంచటం పై ఆధారపడి ఉంటుంది. వారు తమ ఊహాజనితమైన చీకటి పటంనుండి దృష్టి మరల్చుకుని వాటికి పైగా అదృశ్యమైన తమ మార్గంలో దేవుడు వెదజల్లిన, నిత్యమైన మేలులను వారిని చూడనివ్వండి.MHTel 209.4

    ప్రతీ కష్టానికి దేవుడు సహాయాన్ని ఏర్పాటు చేసాడు. ఇశ్రాయేలీయుల ఆరణ్యంలో మారాలోని చేదునీళ్ళ వద్దకు వచ్చినప్పుడు మోషే దేవునికి మొర పెట్టాడు. ప్రభువు ఏదో క్రొత్త పరిష్కారాన్ని వారికివ్వలేదు. అందుబాటులో ఉన్న దానికి వారి గమనాన్ని తిప్పాడు. నీటిని స్వచ్చంగాను., తియ్యగాను చెయ్యటానికి తాను సృజించిన ఓ పొదలోని కొమ్మను నీటిలో వెయ్యాల్సి ఉంది. ఇది చేసినిప్పుడు ప్రజలు ఆ నీరు తాగి సేదతీరారు. ప్రతీ కష్టంలో మనం ఆయనను ఆశ్రయిస్తే క్రీస్తు మనకు సహాయం చేస్తాడు. ఆయన వాక్యంలో దాఖలై ఉన్న స్వస్థత వాగ్దానాల్ని గ్రహించటానికి మన కళ్లు తెరబడతాయి. దు:ఖానికి విరుగుడు అయిన ప్రతీ దీవెనను ఎలా వినియోగించుకోవాలో పరిశుద్దాత్మ మనకు బోధిస్తాడు. మన పెదాలకు అందించబడే ప్రతీ చేదు పానీయానికి స్వస్థతనిచ్చే కొమ్మను మనం కనుగొంటాం.MHTel 209.5

    కఠిన సమస్యలు తృప్తి లేని ఎదురు చూపు మన హృదయాల్ని సొమ్ముసిల్లచేస్తాయి. మన మోకాళ్ళను వణికిస్తాయి. మన చేతలను వాల్చేస్తాయి. “జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధానపడవలెను. వారు నాతో సమాధానపడవలెను” అంటున్నాడు. ప్రభువు యెషయా 27:5 ఆయన నడుపుదలకు సేవకు తమను తాము సమర్పించుకునేవారు అందుకు అయన ఏర్పాట్లు చెయ్యని ఏ పరిస్థితిలోను ఉంచడబటం ఎన్నడు జరగదు. మన పరిస్థితి ఏదైనా మనం ఆయనకు విధేయులమై ఉంటే మనకు మార్గన్ని చూపించటానికి ఓ మార్గదర్శకడున్నాడు. మన చిక్కు ఏదైనా మనకు జ్ఞాని అయిన ఆలోచన కర్త ఉన్నాడు. మన దు:ఖం మన వియోగం లేక ఏకాకితనం ఏదైనా మనకు సానుభూతి చూపించే మిత్రుడున్నాడు.MHTel 210.1

    ఆజ్ఞానంలో తప్పుటడుగు వేస్తే రక్షకుడు మనల్ని విడనాడడు. మనం ఒంటరివారమని ఎన్నడూ భావించాల్సిన పని లేదు. దేవ దూతలు మన సహాయకారులు. తన పేరిట పంపుతామని క్రీస్తు వాగ్దానం చేసిన ఆదరణ కర్త మనతో ఉంటాడు. దేవుని పట్టణానికి మార్గంలో ఉన్న కష్టాలు ఆయన యందు విశ్వాసముంచినవారు అధిగమించలేనివి కావు. వారు తప్పించుకో లేని ప్రమాదాలు లేవు ఆయన పరిస్కారం ఏరార్పటు చెయ్యని దు:ఖం లేదు, అన్యాయం లేదు. మానవ బలహీనత లేదు.MHTel 210.2

    ఎవరూ తమ నిరాశలో తమ నిస్పృహలో కుమిలిపోవనవసరం లేదు. “ఇది నీ రక్షణ లేని పరిస్థితి. నిన్ను విమోచించటం అసాధ్యం ” అంటూ ఆ సాతాను మీకు సలహా ఇవ్వబోవచ్చు. కానీ క్రీస్తులో మీకు నరిక్షణ ఉంది. మన స్వసక్తితో జయించాల్సిందిగా దేవుడు మనల్ని కోరటంలేదు. తనకు దగ్గరగా తన పక్కకు రమ్మని మనల్ని కోరుతున్నాడు. శరీరాత్మలను కృంగదీసే ఏ కష్టాల కింద మనం పని చేస్తున్నా, మనకు స్వేచ్చ కలిగించటానికి ఆయన వేచి ఉన్నాడు.MHTel 210.3

    మానవత్వాన్ని స్వీకరించిన ఆయన మానవుల బాధల్లో వారికి ఎలాసానుభూతి చూపించాలో ఎరుగును. క్రీస్తు ప్రతీ ఆత్మను ఆ ఆత్మ ప్రత్యేక అవసరాలు కష్టాలు ఎరగటం మాత్రమే కాక ఆత్మను కలవపర్చే పరిస్థితులన్నింటిని ఎరుగును. బాధపడే ప్రతీ బిడ్డకు ఆయన కరుణ కనికరం గల తన హస్తం చాపి ఉంచాడు. ఎక్కువ బాధపడుతున్న వారికి ఆయన ఎక్కువ సానుభూతి చూపిస్తాడు. మన బలహీనతలయందు ఆయన మనతో సహానుభవం లేనివాడు కాడు. మన ఆందోళనలను కష్టాలను తన పాదాలవద్ద విడిచి పెట్టాల్సిందిగా మనల్ని కోరుతున్నాడు.MHTel 211.1

    మనవంక మనం చూసుకొని మన ఉద్రేకాలను అధ్యయనం చెయ్యటం వివేకం కాదు. ఇది మనం చేస్తే విశ్వాసాన్ని బలహీనపర్చి ధైర్యాన్ని నాశనం చేసే శ్రమలు శోధనల్ని శత్రువు కలుగజేస్తాడు. మన ఉద్రేకాల్ని లోతుగా అధ్యయనం చెయ్యటం. మన మనోభావాలకు తావివ్వటం సందేహాన్ని ఆహ్వానించి ఆందోళనలో చిక్కుకోటమౌతుంద. మనం మన వంక కాకుండా క్రీస్తు వంక చూడాలి..MHTel 211.2

    “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనియ్యుడి. అందుచేతనే మీరొక్క శారీరకముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞలైయుండుడి... క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి... మరియు మాట చేతగాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైయయేసుద్వారా... చేయుడి.” కొలొస్స 3:15-17MHTel 211.3

    శోధనలు దాడి చేసినప్పుడు, చింత, ఆందోళన, చీకటి మీ ఆత్మను ఆవరించినట్లున్నప్పుడు మీరు చివరగా వెలుగు చూసిన స్థలం వంక చూడండి. క్రీస్తు ప్రేమలోను ఆయన ఆలన పాలన లోను విశ్రమించండి. హృదయంలో ఆధిపత్యం కోసం పాపం పోరు సల్పేటప్పుడు అపరాధం ఆత్మను భాదించి మనస్సాక్షిని బరువెక్కించినప్పుడు అవిశ్వాసం మనసుకు మసకబార్చినప్పుడు, పాపాన్ని అణిచివెయ్యటానిక చీకటిని బహిస్కరించ టానికి క్రీస్తు కృప చాలునని జ్ఞాపకముంచుకోండి. రక్షకునితో సహవాసంలోకి ప్రవేశించి మనం శాంతి గల ప్రాంగణంలోకి అడుగు పెడతాం.MHTel 211.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents