Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మాంసాహారాన్ని విడిచి పెట్టటానికి కారణాలు

    మంసాహారులు ఒకసారి వాడిన గింజల్ని కూరగాయల్ని మాత్రమే తింటున్నారు. ఎందుకంటే పెరుగుదలనిచ్చే పోషకాల్ని జంతవులు వీటి నుండి పొందుతాయి. గింజల్లోను కూరగాయల్లోను ఉన్న జీవం వాటిని తినే జీవుల్లోకి వెళ్తుంది. మనం దాన్ని జంతువుల మాంసం తినటం ద్వారా పొందుతాం. దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆహారాన్ని నేరుగా తినటం ద్వారా వాటిని పొందటం ఎంత మెరుగు?MHTel 267.1

    మాంసం ఎన్నడూ ఉత్తమహారం కాదు. జంతువుల్లో వ్యాధి వేగంగా పెరుగుతున్నది. గనుక ఇప్పుడు మాంసం వాడకం రెండంతలు అభ్యంతరకరం. మాంసాహారులు తాము ఏమి తింటున్నారో ఎరుగురు. జంతువులు జీవించి ఉన్నప్పుడు వాటిని చూడగలిగి తాము తింటున్న మాంసం నాణ్యత గురించి తెలుసుకుంటే దాన్ని అసహ్యించుకుని దూరంగా దానికి ఉంచుతారు. ప్రజలు నిత్యం క్షయ క్యాన్సర్ క్రిములతో నిండిన మాంసం తింటున్నారు క్షయ, క్యాన్సర్ ఇంకా ఇతర ప్రాణాంతక వ్యాధులు ఇలా వ్యాప్తి చెందుతున్నాయి.MHTel 267.2

    పందుల ధాతువులు పరన్నా జీవులతో (పేరా సైట్స్) నిండి ఉంటాయి. పందుల గురించి దేవుడన్నాడు. “అది మీకు హేయము వాటి మాంసం తినకూడదు. వాటి కళేబరమును ముట్టకూడదు” ద్వితియోపదేశకాండము 14:8 పంది మాంసం ఆహారానికి పనికి రాదు గనుక ఈ ఆజ్ఞ ఇవ్వండి. పందులు పాకీపని చేసే జంతువులు. ఈ పనికే అవి ఉద్దేశించబడ్డాయి. మనుష్యులు వాటి మాంసాన్ని ఏ పరిస్థితుల్లోను ఎన్నడూ తినకూడదు. రోత దాని స్వాభావిక మూలవస్తువైనప్పుడు అది ప్రతీ హేయమైన దాన్ని తినేటప్పుడు అది ఏ జీవి అయినా దాని మాంసం ఆరోగ్యకరంగా ఉండటం అసాధ్యం.MHTel 267.3

    తరుచు జంతువులు రోగగ్రస్తమైనప్పుడు సొంతదారులు ఇక ఉంచటానికి భయపడి వాటిని ఆహారానికి అమ్మటానికి సంతకు తోలుకుకు వెళ్తారు. వాటిని సంతకు తీసుకువెళ్ళేందుకు మేసే ప్రక్రియల్లో కొన్ని వ్యాధి కలిగిస్తాయి. వెలుతురు స్వచ్చమైన గాలి లేకుండా మురికిగా ఉ న్న శాలలు వాతావరణంలో అ మురికి శాలల గాలిని పీల్చుకుంటూ బహుశా అక్కడ కుళ్లుతున్న ఆహారాన్ని తింటూ బలుస్తాయి., శరీరమంతా త్వరలో ఆ అశుభ్ర పదార్ధంతో విషపూరితమౌతుంది.MHTel 268.1

    జంతువుల్ని సాధారణంగా దూరప్రాంతాలకు రవాణా చెయ్యటం జరుగుతుంది. సంతకు తీసుకువెళ్ళే కాలంలో అవి గొప్ప బాధకుక గురి అవుతుంటాయి. పచ్చని పచ్చిక బయళ్ళ నుంచి వాటిని తీసుకువచ్చి మురికి రోడ్ల మీదవేడి వాతావరణంలో గంటలు తరబడి ఆహారం నీళ్ళు లేకుండా వాటి కళేబరాలతో మనుషులు విందు చేసుకునేందుకు బళ్ళలోనో లారీల్లోనో గుంపులు గుంపులుగా సంతకు లేక మార్కెట్టుకు తీసుకువెళ్ళటం జరుగుతుంటుంది.MHTel 268.2

    అనేక స్థలాల్లో చేపలు అవి తినే మాలిన్యం వల్ల కలుషితమౌతాయి. అది వాటిని వ్యాధి కారకాలు చేస్తుంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లోని మురుగు కలిసిన నీటిలో పట్టిన చేపల విషయంలో ఇది వాస్తవం. మురుగులోని పదార్థాలను తినే చేపలు ప్రవాహంలో దూరంగా కొట్టుకుపోయి స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న నీటిలో పట్టబడవచ్చు. ప్రమాదాన్ని గుర్తించనివారు వాటిని ఆహారంగా వాడినప్పుడు అవి ఈ విధంగా వ్యాధి మరణాల్ని తెస్తాయి.MHTel 268.3

    “ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి.”1 పేతురు 2:11MHTel 269.1

    మాంసాహర పలితాలు వెంటనే తెలియకపోవచ్చు. అది హానికరం కాదనటాని ఇది నిదర్శనం కాదు. తాము తింటున్న మాంసంమే తమ రక్తాన్ని విషకలితం చేసి తమకు బాధలు కలిగిస్తుందన్న దాన్ని చాలా తక్కువ మంది నమ్ముతారు. వాస్తవమైన కారణం తమకు గాని ఇతరులకు గాని తెలియకపోయినా, అనేకులు కేవలం మాంసాహారం వల్ల వచ్చిన వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు.MHTel 269.2

    మాంసాహారం వల్ల చోటుచేసుకొనే నైతికమైన కీడులు శారీరక రుగ్మతలకన్నా తక్కువేమి కాదు. మాంసాహారం ఆరోగ్యానికి హానికరం. శరీరానాకి ఏది హాని చేస్తుందో అది మనసుకు ఆత్మకు కూడా హాని చేస్తుంది. మాంసాహారంలో భాగమైన జంతువుల పట్ల క్రూరత్వం గురించి దానిలో పాల్గొనే వారి ఈమద దాన్ని చూసేవారి మీద దాని ప్రభావం గురించి ఆలోచించండి దేవుని సృష్టి అయిన ఈ జీవుల పట్ల మనం చూపించాల్సిన దయ కనికరాల్ని ఇది ఎలా నాశనం చేస్తుంది!MHTel 269.3

    అనేక మూగ జీవులు ప్రదర్శించే తెలివి ఇంచుమించు మానవ జ్ఞానానికి సరిసాటి అయినది. అది ఓ మర్మం. జంతవులు చూస్తాయి. వింటాయి. ప్రేమిస్తాయి. భయపడతాయి, బాధపడతాయి, మనుషులు తమ అవయావల్ని ఉపయోగించటం కన్నా అవి తమ అవయాల్ని ఎక్కువ నమ్మకంగా ఉపయోగిస్తాయి. బాధలో ఉన్న తమ నేస్తాల పట్ల అవి సానుభూతిని దయను ప్రదర్శిస్తాయి. చాలా జంతువులు తమ ఆలన పాలన చూసేవారి పట్ల చూపించే ప్రేమ మానవుల్లో కొందరు చూసే ప్రేమకన్నా గొప్పది. తాము మనుషులతో పెంచుకొనే సాన్నిహిత్యాలు దూరమైనప్పుడు అవి తీవ్ర బాధకు గురి అవుతాయి.MHTel 269.4

    ఎప్పుడైనా పెంపుడు జంతువుల్ని ప్రేమించిన మానవ హృదయ మున్న ఏ మనిషి విశ్వాసంతోను ప్రేమతోను నిండిన వాటి కళ్ళల్లోకి చూసి ఇష్టపూర్వకంగా వాటిని కసాయిపడి కత్తికి అప్పగించగలడా? వాటి మాంసాన్ని ఓ తీపి పదార్థంలా ఎలా కబళించగలడు?MHTel 269.5

    కండబలం మంసాహారం వల్ల వస్తుందని భావించటం పొరపాటు. మాంసం లేకుండా శరీరావసరాలు మెరుగ్గా సరఫరా అవ్వగలవు. మరింత మేలైన ఆరోగ్యాన్ని అనుభవించి ఆనందించగలం. పండ్లు, పప్పులు కూరగాయలతో వాడిన గింజల్లో మంచి రక్తం తయారు చెయ్యటానికి అవసరమైన పోషక పదార్ధాల్ని ఉన్నాయి. ఈ పదార్ధాలు మాంసాహారం వల్ల అంత బాగా అంత పూర్తిగా శరీరానికి సరఫరా అవ్వవు. మాంసం ఆరోగ్యానికి అత్యవసరమైన ఉంటే అదిలో మానవుడి ఆహారంలో దాన్ని దేవుడు చేర్చి ఉండేవాడు.MHTel 270.1

    మాంసాహారాన్ని మానేసినప్పుడు బలహీనంగా ఉన్నట్లు శక్తి లేనట్లు అనిపస్తుంది. అందువల్ల అనేకులు మాంసాహారం అనివార్యమని భావిస్తారు. ఈ తరగతికి చెందిన ఆహారాలు ప్రేరపకాలు కాబట్టి. అవి రక్తాన్ని వేడేక్కించి నరాల్ని ఉద్రేకపర్చుతాయి. కాబట్టి వారికి ఆ భావన ఏర్పడుతుంది. కొందరికైతే మాంసాహారాన్ని విడిచి పెట్టడం తాగుబోతులకు తాగుడు విడిచి పెట్టటమంత కష్టమౌతుంది. అయితే ఆ మార్పు వారికి ఎంతో మేలు చేస్తుంది.MHTel 270.2

    మాంసాహారాన్ని విడిచి పెట్టినప్పుడు దాని లోటును భర్తీ చెయ్యటానికి పోషక పదార్ధాలున్న రుచిగా ఉండే పలు రకాల గింజలు, పప్పులు, కూరగాయలు పండ్లతో కూడిన ఆహారం తినాలి. ఇది ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారు లేక నిత్యం పని భారం కింద ఉన్నవారి సందర్భంలో అవసరం. పేదరికంతో బాధపడుతున్న దేశాల్లో మాంసమే చౌకైన ఆహారం.ఈ పరిస్థితుల్లో చాలా కష్టంతో మార్పు జరుగుతుంది. కాని మార్పు జరగవచ్చు. MHTel 270.3

    ఏది ఏమైనా ప్రజల పరిస్థితిని జీవితమంతా ఉన్న అలవాటు శక్తిన పరిగణించి మంచి అభిప్రాయాల్ని సయితం అవలంబించాల్సిందిగా మితిమీరి కోరకుండా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాంతరంగా మార్పు చేసుకోవలసిందిగా ఎవరిని కోరకూడదు. మాంసానికి మారుగా చౌకైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉపయోగించాలి. ఈ విషయంలో వంట చేసే వ్యక్తి మీద చాలా ఆధారపడి ఉంటుంది. బలవర్థకంగాను, రుచిగాను, చాలావరకు మాంసాహారంలో లోటను భర్తీ చేసేలాగున శ్రద్ధతోను నిపుణతోను వంట చెయ్యవచ్చు.MHTel 270.4

    అన్ని సందర్భాల్లోను మనసాక్షిని చైతన్యపర్చండి, చిత్తాన్ని తోడుంచుకోండి. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సరఫరా చెయ్యండి. మార్పు వస్తుంది. మాంసం కావాలన్న డిమాండు త్వరలో ఆగిపోతుంది.MHTel 271.1

    అందరూ మాంసాన్ని విసర్జించటానికి ఇది సమయం కాదా? పరలోక దూతల సహవాసాన్ని కలిగి ఉండేందుకు గాను పవిత్రులు, సంస్కారవంతులు, పరిశుద్దులు కాగోరుతున్నవారు, శరారం పైన ఆత్మపైన హానికరమైన ప్రభావాన్ని చూపే ఆహారాన్ని ఉపయోగించటంలో ఎలా కొనసాగుతారు? దేవుడు సృజించిన జీవుల మాంసాన్ని విలాసంగా భోంచెయ్యటానికి వాటి ప్రాణాలను వారు ఎలా తియ్యగలరు? ఆదిలో మానవుడికి దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన కమ్మని ఆహారానికి వారు తిరిగివచ్చి దాన్ని ఆచరణలో పెట్టటం ద్వారా దేవుడు సృజించిన మూగ జీవుల పట్ల దయగా ప్రవర్తించాలని తమ పిల్లలకు నేర్పించాలి.MHTel 271.2

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents