Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఫ్యాషతో నిమిత్తం లేకుండా

    ఫ్యాషన్ డిమాండ్లకు లోబడటానికి అపసోపాలు పడే బదులు స్త్రీలు ఆరోగ్యవంతంగా సామాన్యంగా వస్త్రాలు ధరించటానికి సాహసంతో ముందుకు రావాలి. గృహ చాకిరిలో కూరుకోపోయే బదులు, భార్య తల్లి అయిన స్త్రీ చదవటానికి తాజా సమాచారాన్ని తెలుసుకోవటానికి తన భర్తకు నేస్తంగా ఉండటానికి, పెరుగుతున్న తన బిడ్డ మనుసల్ని గ్రహించటానికి సమయం తీసుకోవాలి. ఆమె ఇప్పుడు తనకున్న తరుణాల్ని జ్ఞానయుతంగా ఉపయోగించుకొని తన బిడ్డల్ని ఉన్నత జీవితానికి ప్రభావితం చెయ్యాలి. ప్రియమైన రక్షకుని తన దైనందిన నేస్తంగాను మిత్రుడిగాను చేసుకోవటానికి ఆమె సమయం తీసుకోవాలి. ఆయన వాక్య పఠనానికి సమయం తీసుకోవాలి. తన పిల్లలుతో కలసి పొలాల్లోకి వెళ్లి సుందరమైన ఆయన ప్రకృతి ద్వారా ఆయన్ని గురించి నేర్చుకోవటానికి సమయం తీసుకోవాలి.MHTel 251.2

    ఆమె సంతోషంగాను ఉత్సాహంగాను ఉండాలి. ప్రతినిత్యం అంతంలేని కుట్టు పనిలో ఉండటం కన్నా, సాయంత్రాన్ని ఓ సాంఘిక సమయంగానో దిన విధుల అనంతరం కటుంబపు సమావేశ సమయంగానో, చేసుకొని ఆనందించాలి. అనేకమంది పురుషులు తమ కుటుంబ సహావాసాన్ని ఎంచుకొని క్లబ్బుని నాట్యశాలను విడిచ పెడతారు. అనేకమంది బాలురు వీధుల్లోను అంగళ్ళ వద్దకు తిరగటం మానతారు. అనేకమంది ఆడపిల్ల తప్పుదారి పట్టించే స్నేహాల్ని వదులుకుంటారు. తల్లితండ్రులకు బిడ్డలకు గృహ ప్రభావం దేవుడు నిర్దేశించినట్లుగా జీవితాంతం దీవెనగా ఉంటుంది.MHTel 251.3

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents