Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నగరాల్లోని మురికి వాడలు

    గొప్ప నాగరాల్లో మూగ జీవులు పొందేంత శ్రద్ధకు కూడా నోచుకోని వేవేల జనులున్నారు. పెద్ద పెద్ద మేడల అడుగు భాగాన చీకటిగాను తడి తడి గాను మురికిగాను ఉన్న చిన్న చిన్న గదుల్లో కుటంబాలకు కుటంబాలే నివసించాటాన్ని ఆలోచించండి. ఈ దుర్భర దుస్తితిలో పిల్లలు పుట్టటం పెరగటం చనిపోవటం జరుగుతుంటుంది. కనువిందు కలిగించి ఆత్మను ఉత్తేజపపర్చే ప్రకృతి సౌందర్యాన్ని వారు ఏమీ చూడరు. చింకిర పాతలతో, ఆర్ధాకలితో రోజులు వెళ్లదీసే వీరు దుర్మార్గత భ్రష్టత నడుమ జీవిస్తారు. వారిని చుట్టుముట్టి ఉన్న దుర్నీతి పాపం వాతవారణంలో వారి ప్రవర్తనలు నిర్మితమౌతాయి. ఈ పిల్లలు దూషణల్లోనే దేవుని పేరు వింటుంటారు. దుర్బాషలు, శాపనార్థాలు, దూషణలే వారి చెవుల్ని నింపుతాయి. సారా, పొగాకు మండలు, దుర్వాసనలు, నైతిక భ్రష్టత వారి బుద్దిని వక్రం చేస్తాయి. ఈ రీతిగా వేవేల ప్రజలు నేరాగళ్లుగా మారి తమను దు:ఖానికి భ్రష్టతకు విడిచి పెట్టేసిన సమజానికి శత్రువులుగా పరిణమిస్తారు.MHTel 154.3

    నగరాల మురికి వాడల్లోని బీదవారందరూ ఈ తరగతికి చెందినవారు కారు. దేవునికి భయపడే పురుషులు స్త్రీలు అనారోగ్యం వల్ల లేక దురదృష్టం వల్ల, తరచు సాటి మనుషుల్ని దోచుకునేవారి కుతంత్రాల వల్ల పేదరికం అట్టడుగుకి దిగజారిపోయిన వారుంటారు. న్యాయవంతులు మంచిని కోరేవారు అనేకులు పారిశ్రామిక శిక్షణ లేని కారణంగా బీదవారయ్యారు. వారు తమ అజ్ఞానం ద్వారా జీవితంలోని కష్టాలతో పెనుగులాడటానికి అసమర్ధులవుతారు. నగరాలకు చేరుకొని ఉద్యోగం దొరకక యాతన పడుతుంటారు. దుర్మార్గత దృశ్యాలు శబ్దాల నడుమ వారు భయంకర శోధనలకు గురి అవుతారు. దుర్మార్గులు భ్రష్టుల గుంపులో చేరి ఆ తరగతి వారిగా ముద్రపడే వీరిని అదే స్థాయికి దిగజారకుండా మానవాతీత శక్తి మాత్రమే అపగలదు. పాపం చెయ్యటం కన్నా శ్రమలనుభవించటానికి ఎన్నుకుని అనేకులు తమ న్యాయ ప్రవర్తనను కొనసాగిస్తారు. ముఖ్యంగా ఈ తరగతికి సహయం సానుభూతి, ప్రోత్సాహం అవసరం.MHTel 154.4

    ఇప్పుడు నగరాల్లో పోగుపడుతున్న పేదలు భూమిని సంపాదించి ఇళ్లు కట్టుకుంటే వారు జీవనోపాది సంపాదించకోటమే కాదు. ఇప్పుడు వారికి క్రమమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా కలిగి జీవించగలుగుతారు. కఠిన శ్రమ, సామాన్య ఆహారం, తక్కువ స్నేహాలు, తరుచు కష్టాలు లేమి ఇదే వారి స్థితి. అయితే దుర్మార్గత, శోధనలు, గందరగోళం, నేరం, దు:ఖం మురికి ఉండే నగరాల్ని వదిలి ప్రశాంతత, సమాధానం, శుద్ధత ఉన్న వల్లె ప్రాంతాలకు వెళ్లటం వారికి ఎంత దీవెనకరం!MHTel 155.1

    కాలు మోపటానికి పచ్చగడ్డి ఉన్న కాస్త స్థలం కనిపించని నాగరాల్లో నివసిస్తున్నవారిని, మురికి కుప్పలతో నిండిన దొడ్లు, సన్నని, గల్లీలు, ఇటుక గోడలు, రోడ్డుపక్క సిమ్మెంటు దార్లు, ధూళి పొగతో నిండిన ఆకాశం,... వీటిని నిత్యం చూసే వీరిని పచ్చటి పొలాలు, చెట్లు, కొండలు సెలయేళ్ళు స్పష్టమైన ఆకాశం, పల్లె సీమల్లోని తాజాతనం స్వచ్చమైన గాలి గల ఓ వ్యవసాయ జిల్లాకు తీసుకువెళ్లే వారికది దాదాపు పరలోకంగా ఉంటుంది.MHTel 155.2

    చాలామేరకు మనషులలో సంబంధము లేకుండా, మనుషుల పై ఆధారపడకుండా, పాడుచేసే లోకపు సిద్ధాంతాలు ఆచారాలు ఉద్రేకాలతో సంబంధము లేకుండా జీవించేవారు ప్రకృతి హృదయానికి చేరువగా వస్తారు. దేవుని సముఖం వారికి మరింత వాస్తవమౌతుంది. అనేకమంది ఆయన పై ఆధారపడటం నేర్చుకుంటారు. తన సమాధానాన్ని ప్రేమను గూర్చి దేవుడు ప్రకృతి ద్వారా తమ హృదయాలతో మాట్లాడటం వారు వింటారు. స్వస్ధతను జీవాన్ని ఇచ్చే ఆ శక్తికి మనసు ఆత్మ శరీరం స్పందిస్తాయి.MHTel 155.3

    వారు కష్టపడి పనిచేసే స్వయం సహాయకులు కావాలంటే చాలా మందికి సహాయం, ప్రోత్సాహం ఉపదేశం అవసరమౌతాయి. వేలాది పేద కుటుంబాలకు కొంత భూమి పై స్థిరపడి దాన్ని సేద్యం చేసి ఉపాధి ఎలా పొందాలో అన్నదానిపై సహాయమందిచంటం కన్నా మెరుగైన మిషనెరీ సేవ ఇంకొకటి ఉండదు.MHTel 156.1

    అలాటి సహాయానికి ఉపదేశానికి ఉన్న అవసరం నగారాలకే పరిమితం కాదు. అవకాశాలెన్నో ఉన్న పల్లె సీమల్లో సయితం వేలాది బీద ప్రజలు లేమిలో ఉన్నారు. మొత్తం సమాజాలు పారిశ్రామికంగాను, పారిశుద్ధ్యపరంగాను జ్ఞానం లేకుండా ఉన్నాయి. శుభ్రతలేని చిన్న చిన్న ఇళ్ళలో సామాన్లు, దుస్తులు, పనిమట్లు, వసతులు, సౌకర్యాలు, సంస్కృతి సాధనాలు లేకుండా జీవిస్నుత్న కుటంబాలు ఎన్నో ఉన్నాయి. మొద్దుబారిన ఆత్మలు,బలహీనమైన వికలంగా ఉన్న దేహాలు చెడు పారంపర్యం దురభ్యాసాల ఫలితాల్ని ఎండగడుతున్నాయి. ఈ ప్రజలకు పునాది నుంచి ఉపదేశం అవసరం. వీరు దీర్ఘకాలం సోమరి జీవితాలు భ్రష్ట జీవితాలు జీవించారు. సరియైన అలవాట్లు నేర్చుకోవటానికి వారికి శిక్షణనివ్వాలి.MHTel 156.2

    తమ స్థితిని మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించటానికి వారిని ఎలా మేల్కొల్పాలి? ఉన్నత జీవిత ఆరద్శం దిశగా వారిని ఎలా నడపగలం? పైకి లేవటానికి వారికి ఎలా చెయ్యూతనివ్వగలం? పేదరికం వ్యాపించి అడుగడుగునా పోరాడవలసిన చోట ఏమి చెయ్యగలం? సందేహం లేదు. చెయ్యాల్సిన పని కష్టమయ్యిందే. తమ వెలపల ఉన్న ఓ శక్తి స్త్రీ పురుషులకు సహాయం చేస్తేనే గాని అవసరమైన సంస్కరణ ఎన్నడూ జరగదు. ధనవంతులు పేదవారు సానుభూతి, సహాయం అనే బంధాల ద్వారా ముడిపడాలన్నది దేవుని సంకల్పం. ఆర్ధిక వనరులు వరాలు, సామర్థ్యాలు ఉన్నవారు వాటిని తమ తోటి మనుషులకు మేలు చెయ్యటానికి ఉపయోగించాలి.MHTel 156.3

    క్రైస్తవ, వ్యవసాయదారులు భూమి పై గృహాలు ఏర్పర్చుకోవటం, భూమిని దున్ని సారవంతము ఫలభరితం చెయ్యటం పేదవారికి నేర్పించటం ద్వారా నిజమైన మిషనెరీ సేవ చెయ్యవచ్చు. పరికరాల్ని ఎలా ఉపయో గించాలో, రకరకాల పంటలు ఎలా పండించాలో పండ్ల మొక్కల్ని ఎలా నాటి పెంచాలో వారికి నేర్పించాలి.MHTel 157.1

    సేద్యం చేసేవారు తమ ఆశ్రద్ధ వల్ల సరియైన పలసాయం పొందలేక పోతున్నారు. వారి పండ్లతోటల పెంపకము సవ్యంగా లేదు. పంటల్ని సరియైన సమయంలో వెయ్యటంలేదు. నేలను పంటకు స్టిదపర్చటంలో పై పై పనిమత్రమే జరుగుతున్నది. వారి అపజయానికి సారవంతం కాని భూమి కారణమని నిందిస్తారు. సరిగా పనిచేసి ఉంటే మంచి పంటనిచ్చే భూమిపై నింద మోపటానికి తప్పుడు సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంటుంది. అల్ప ప్రణాళికలు, అరకొర శ్రమ, ఉత్తమ పద్దతుల విషయంలో తక్కువ అధ్యయనం సంస్కరణను గట్టిగా ప్రతిపాదిస్తున్నాయి.MHTel 157.2

    నేర్చుకోవటానికి సంస్జిద్ధంగా ఉన్నవారికి సరియైన పద్ధతులు నేర్పండి. వృద్ది చెందిన అభిప్రాయల గురించి తమలో మాట్లడటానికి ఎవరికైనా ఇష్టం లేకపోతే, ఆ పాఠాల్ని నిశ్శబ్దంగా ఇవ్వండి. మీ సొంత భూమి సేద్యాన్ని కొనసాగించండి. సాధ్యమైనప్పుడు మీ పొరుగా వారితో మాట్లాడండి. సరియైన పద్దతుల పక్షంగా మీ పంటనే మాట్లాడనివ్వండి. సరియైన విధముగా సిద్ధం చేసినప్పుడు భూమితో ఏమి చెయ్యవచ్చో చూపించండి.MHTel 157.3

    పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు స్థాపించ టానికి శ్రద్ధ వహించాలి. వడ్రంగి పనివారు, కమ్మరం, పనివారు, చెప్పాలంటే, ఏదో ప్రయోజనకరమైన వృత్తి పని తెలిసిన ప్రతివారు, ఆజ్ఞానులు, నిరుద్యోగులు అయిన వారికి నేర్పించి సహాయం చెయ్యటానికి బాధ్యత వహించాలి.MHTel 157.4

    పేదవారికి పరిచర్యలో స్త్రీలకు పురుషులకు విశాల సేవారంగం ఉంది. సమర్ధురాలైన వంటగత్తె, ఇంటి పనిమనిషి, నర్సు - ఇలా అందరి సహాయం అవసరమౌతుంది. ఎలా వంట చేయ్యాలో , తమ సొంత బట్టలు ఎలా కుట్టుకుని తయారు చేసుకోవాలో, జబ్బుగా ఉన్నవారికి అలా పరిచర్య చెయ్యాలో, గృహాన్ని సరిగా ఎలా సంరక్షించుకోవాలో పేద కుటుంబాల్లోని వారికి నేర్పించాలి. ఉపయోగకరమైన ఓ వృత్తి పనిని బాలురకు బాలికలకు నేర్పించాలి.MHTel 157.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents