Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆహారం తయారు చెయ్యటం

    కేవలం రుచిని తృప్తిపర్చకోవటానికి తినటం తప్పు. కాని ఆహారం నాణ్యయ విషయంలో గాని లేక దాన్ని సిద్ధం చేసే తీరు విషయంలో గాని నిర్లక్ష్యం చూపించకూడదు. తినే ఆహారం ఇష్టంగా తినకపోతే అది శరీరానికి పోషణ బాగా ఇవ్వదు. ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసి దాన్ని జ్ఞానంతోను నిపుణతోను తయారు చెయ్యాలి.MHTel 256.1

    బ్రెడ్ తయారు చెయ్యటంలో మృదువైన తెల్లని గోధమ పిండి వినియోగం మంచిదికాదు. దావి వాడకం ఆరోగ్యదాయకము కాదు, పొదుపు కాదు. మృదువైన తెల్లని పిండితో చేసిన బ్రెడ్ లో సంపూర్ణ గోధుమ పిండితో చేసిన బ్రెడ్ లో ఉండే పోషకాలు లోపిస్తాయి., అది నిత్యం మలబద్దకం తదితర అనారోగ్య పరిస్థితులను తరుచు హేతువవుతుంది.MHTel 256.2

    బ్రెడ్ తయారు చెయ్యటంలో వంట సోడా వినియోగం హానికరం. అది అవసరం కూడా. సోడా కడుపులో మంట పుట్టిస్తుంది. అది తరుచు శరీర వ్యవస్థ మొత్తాన్ని విషపూరితం చేస్తుంది. సోడా లేకుండా బ్రెడ్ చెయ్యలేమని అనేకమంది గృహిణులు భావిస్తారు. కాని అది నిజం కాదు.MHTel 256.3

    “దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెఉట్టను విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అని మీకాహారమగును” అన్నాడు. అదికాండము 1:19.MHTel 256.4

    మెరుగైన పద్ధతులు నేర్చుకోవటానికి వారు సమయం తీసుకోవాటానికి సమ్మతంగా ఉంటే వారి బ్రెడ్ ఎక్కువ ఆరోగ్యవంతం సహజమైన రుచికలిగి ఉంటుంది. అది మరింత రుచిగా ఉంటుంది.MHTel 256.5

    పొంగిన బ్రెడ్ తయారు చెయ్యటంలో నీరు బదులు పాలు ఉయో గించకూడదు. పాలవాడకం అదనపు ఖర్చే. గాక బ్రెడ్ ని తక్కువ ఆరోగ్యకరం చేస్తుంది. పాల బ్రెడ్ దాన్ని తయారు చేసిన కొంతకాలం తరువాత నీటితో చేసిన బ్రడె అంతా తియ్యగా ఉండదు. అంతేకాదు. కడుపులో త్వరగా పులిసిపోతుంది.MHTel 256.6

    బ్రెడ్ తేలికగాను తియ్యగాను ఉండాలి. బ్రెడ్ కొంచెం పుల్లగా కూడా ఉండకూడదు. బ్రెడ్ ముక్కలు చిన్నవిగా ఉండి యీస్ట్ సూక్ష్మ జీవులు నశించేందుకు సాధ్యమైనంత బాగా బేక్ అవ్వాలి. వేడిగా ఉన్న లేక అప్పుడే చేసిన ఏ రకమైన పొంగే బ్రెడ్ అయినా జీర్ణమవ్వటం కష్టం. అది భోజనబల్లపై కనిపించకూడదు. ఈ నిబంధన పులయని బ్రెడకు వర్తించదు. యీస్ట్ గాని పులుపు గాని లేకుండా గోధము పిండితో చేసిన బాగా వేడిగల అవన్ (పొయ్యి) లో బేక్ అయిన రోల్సు ఆరోగ్యకరమేకాక రుచిగా కూడా ఉంటాయి. MHTel 257.1

    పోరిడ్జికి లేక జావకు ఉపయోగించే గింజ ధాన్యాలు కొన్ని గంటలు ఉడకాలి. అయితే మెత్తని లేక ద్రవరూప ఆహారం బాగా నమలటం అగత్యమైన పొడి ఆహారమంత ఆరోగ్యకరం కాదు. జ్వీబ్యాక్ లేక రెండు పార్లు బేక్ చెయ్యాలి. అప్పుడు మళ్ళీ వాటిని అవన్లో పెట్టి బ్రౌన్ గా వేగనివ్వాలి. ఈ బ్రెడ్ న వేడిగా ఉండే స్థలంలో ఉచింతే సామాన్యమైన బ్రెడ్ కన్నా దాన్ని ఎక్కువ కాలం ఉంచవచ్చు. ఉపయోగింటానికి ముందు దాన్ని తిరిగి వేడి చేస్తే అది కొత్తగా చేసినదానంత తాజాగా ఉంటుంది.MHTel 257.2

    ఆహారంలో అతిగా పంచదార వాడటం జరుగుతుంది. కేకులు తీపి పుడ్డింగులు, పేస్త్రీలు, జేమ్ లు ఆజీర్తి కారకాలు, పాలు, గుడ్లు పంచాదార కలపి తయారు చేసే కస్టలు పుడ్డింగులు మరీ హానికరమైనవి పాలు పంచదార కలపి ఉపయోగించటం మానాలి.MHTel 257.3

    పాలను ఉపయోగిస్తే దాన్ని బాగా కాచాలి. ఈ ముందు జాగ్రత్తగా పాటిస్తే దాని వినియోగం నుంచి వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. బటర్ ని వంటలో ఉపయోగించటం కన్నా చల్లని బ్రెడ్ మీద ఉయోగించటం తక్కువ హానికరం. కాని దాని వినియోగం మానటమే అన్ని విధాల శ్రేష్టం. చీజ్ మరింత అభ్యంతరకరకం. అది ఆహార పదార్థంగా ఉపయోగించరానిది.MHTel 257.4

    సరిగా ఉడకని ఆహారం రక్తం తయారు చేసే అవయవాలను బలహీనపర్చటం ద్వారా రక్తాన్ని పాడు చేస్తుంది. అది వ్యవస్థను తారుమారు చేసి వ్యాధిని దానితో పాటు నరాల ప్రకోపాన్ని చిటచిటలాడే తత్వాన్ని కలిగిస్తుంది. అనారోగ్యకరమైన వంట బాధితులు వేలు లక్షలమంది ఉన్నారు.“అనారోగ్యకరమైన వంట వల్ల మరణించాడు” “దుర్వినియోగ మైన పొట్టవలన మరణించాడు” అని అనేక సమాధుల మీద రాయవచ్చు.MHTel 257.5

    వంట చేసేవారు ఆరోగ్యకరమైన ఆహారం వండటం ఓ పవిత్ర విధి. అనారోగ్యకరమైన వంట కారణంగా అనేక ఆత్మలు నాశనమౌతున్నాయి. మంచి బ్రడె చెయ్యటానికి ఆలోచన జాగ్రత్త అవసరం. బాగా చేసిన ఓ బ్రెడ్ ముక్కలో అనేకులు తలంచేదానికన్నా ఎక్కువ మతం ఉన్నది. వంట బాగా చేసే వారు చాలా తక్కువ మంది. వండటం ఇంకా ఇతర ఇంటి పనులు చెయ్యటం గౌరవం లేని పని అని యువతులు భావిస్తారు., ఈ కారణం వల్ల యువతలు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కన్నా భార్యలుగాను తల్లులగాను తమ పైబడ్డ విధులను సరిగా గ్రహించలేరు.MHTel 258.1

    వంట తక్కువ రకం శాస్త్రం కాదు. ఉపయోగాత్మకమైన జీవితంలో అది అత్యవసరమైన వీధుల్లో ఒకటి. అది స్త్రీలందరూ నేర్చుకోవలసిన శాస్త్రం. పేద ప్రజలకు మేలు కలిగే విధంగా దాన్ని బోధించాలి. ఆహారాన్ని రుచికరంగా తయారు చేయ్యటానికి అదే సమయంలో సామాన్యంగాను పౌష్టికంగాను ఉండేటట్లు వంట చెయ్యటానికి నిపుణత అవసరం. అయినా అది చెయ్యటం సాధ్యమే. ఆహారం దాని సామన్యత వల్ల మరింత కమ్మగా ఆరోగ్యదాయకంగా ఉండటానికి వంట చేసేవారు ఆహారాన్ని సామాన్యంగాను ఆరోగ్యకరమైన విధంగాను ఎలా తయారు చెయ్యాలో నేర్చుకోవాలి.MHTel 258.2

    కుటుంబ నాయకురాలై ఉండి ఆరోగ్యకరమైన వంట తెలియని ప్రతీ స్త్రీ తనకుటుంబ క్షేమానికి అంత అవసరమైన ఆ కళను నేర్చకోవటానికి పట్టుదలగా ఉండాలి. ఈ విషయంలో ఆరోగ్య వంట పాఠశాలలు అనేక స్థలాల్లో ఉపదేశావకాశాలు మంచి వంటగత్తె వద్ద వంట నేర్చుకొని వంట కళలో ప్రవీణురాలయ్యేవరకు ఆ కళను వృద్ధిపర్చుకోవటానిక పట్టుదలతో కృషి చెయ్యా లి.MHTel 258.3

    ఆహారం తీసుకోవటంలో క్రమపాలన చాలా ప్రాముఖ్యం. ప్రతీ భోజ నానికి నిర్దిష్ట సమయం ఉండాలి. అనేకమంది కోరకను ప్రతిఘటించే శక్తి లేక వ్యవస్థకు అవసరం లేకపోయినా క్రమం తప్పి భోజనం చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు కొందరుతినేదేమైనా తమఅందుబాటులో ఉంటే అస్తమాన ఏదో నములుతూనే ఉంటారు. ఇది చాలా హానికరం. ప్రయాణం చేసేవారు సమాన్యమైన ఆహారాన్ని వేళప్రకారం తింటే వారు అంత బడలికకు గురి అవ్వరు. వ్యాధి వలన ఆంత బాధకు కూడా గురి అవ్వరు.MHTel 259.1

    మరో హానికరమైన అలవాటు కొందరు పడుకోక ముందు భోజనం చెయ్యటం. వారు ఎప్పటిమాములుగా భోజనం చేసి ఉండవచ్చు. కాని నీరసంగా ఉన్నట్లు అనిపించింది. గనుక ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఇదే పదే పదే చెయ్యటం వల్ల అది అలవాటుగా మారుతుంది. అది ఎంతగా బలపడుతుందంటే తింటేనేగాని నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఆలస్యంగా రాత్రి భోజనం తీసుకోవటం ఫలితంగా నిద్రపోతున్న సమయంలో కూడా జీర్ణ ప్రక్రియ కొనసాగుతుంది. జీర్ణకోశం నిత్యం పనిచేస్తున్నా దాని పని సరిగా పూర్తికాదు. తరుచు చెడ్డ కలలతో నిద్రకు భంగం కలుగుతుంది. ఉదయం ఈ వ్యక్తి సేద తీరకుండా మేల్కొంటాడు. బ్రేక్ ఫాస్ట్ తినటానికి ఇష్టం ఉండదు. మనం విశ్రమించటానికి పడుకున్నప్పుడు తక్కిన అవయవాలతో సహ జీర్ణ కోసం తన పనంతా పూర్తి చేసుకొని విశ్రాంతి తీసుకోవాలి. నీడపట్టున కూర్చుని పనిచేసేవారికి రాత్రి ఆలస్యంగా చేసే భోజనాలు చాలా హానికరం. వారి విషయంలో కడుపులోని తొందర మరణంతో అంత మొందే వ్యాధికి తరుచు నాంది పలుకుతుంది.MHTel 259.2

    అనేకుల సందర్బల్లో ఆహారాన్ని కోరే నీరసం ఏర్పడటానికి కారణం దినంలో జీర్ణవయవాలు తీవ్ర శ్రమకు లోనవ్వటం. ఒకసారి తిన్న భోజనాన్ని పరిష్కరించిన తరువాత జీర్ణావయవాలకు విశ్రాంతి అవసరం. భోజనాలకు మధ్య కనీసం అయిదు లేక ఆరు గంటల వ్యవధి ఉండాలి. ఈ ప్రణాళికను అవలంభించటానికి ప్రయత్నించేవారు రోజుకి మూడుసార్లు భోజనం కంటే రెండుసార్లు భోజనం మేలని గ్రహిస్తారు.MHTel 259.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents