Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సహేతుక పరిహారోపాయాలు

    వ్యాధిగా పరిణమించేవరకు ఆరోగ్య దుర్వినియోగాన్ని కొనసాగించి నప్పుడు ఇంకెవరూ తనకు ఏమి చెయ్యలేరో ఆ పనిని బాది తుడు తను చేసుకోగలడు. మొట్టమొదటిగా చెయ్యాల్సిందిగా వ్యాధి నిర్ధారణ చేసుకోవటం. ఆ తరువాత దనికి కారణాన్ని తొలగిచటానికి విజ్ఞతతో కృషి చేయటం. అధిక శ్రమ, అమితాహరం లేక ఇతర క్రమరాహిత్యతల వలన వ్యవస్థ క్రమబద్ద చర్య తాలూకు సమతుల్యం కొరవడితే విషపూరితమైన మందుల వాడకం వల్ల ఆ కష్టాలను సరిచెయ్య టానికి ప్రయత్నించవద్దు.MHTel 197.1

    మితం లేకుండా తినటం తరుచు వ్యాధికి కారణమౌతుంది. ప్రకృతికి అత్యవసమైంది ఏమిటంటే దాని మీద ఆనుచితంగా మోపబడ్డ భారాన్ని తొలగించటం. అస్వస్థతకు సంబంధించిన అనేక సందర్భాల్లో అత్యుత్తమ ఔషధం అధిక శ్రమకు గురి అయిన జీర్ణావయవాలకు విశ్రమించే అవకాశం కలిగేందుకు రోగి ఒకటి రెండు పూటలు లంఖణం చెయ్యటం. మొదడుతో పనిచేసేవారికి కొన్ని రోజుల పాటు పండ్ల ఆహారం తరుచు గొప్ప ఉపశమ నాన్నిచ్చింది. అనేకసార్లు స్వల్ప కాలం భోజనాన్ని పూర్తిగా మాని, ఆ తరువాత సామాన్యంగా, మితంగా తినటం ప్రకృతి సహయాక శక్తి ద్వారా స్వస్థతకు దారి తీసింది. ఒకటి లేక రెండు మాసాలు నిరాహర ఆచరణ ఆరోగ్యానికి మార్గంఆత్మత్యాగ మార్గమేనని అనేకమంది బాధితుల్లో విశ్వాసం పుట్టిస్తుంది.MHTel 197.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents