Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
స్వస్థత పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వస్థపడగోరునున్నావా

    “యెరూషలేములో గొట్టెల ద్వారాము దగ్గర, హెబ్రీ బాషలో బేతెస్ధ అనబడిన యొక కోనేరు తలదు. దానికి అయిదు మంటపములు కలవు. అయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి”. యెహాను 5: 2-4MHTel 55.2

    ఆయా సమయాల్లో ఆ కోనే నీళ్ళు కదలింపబడేవి. ఈ కదిలింపు మానవాతీత శక్తి ఫలితమని, నీళ్ళు కదలించిన తరువాత ఎవరు మొదట ఆ నీటిలోకి దిగుతారో వారికి ఏ వ్యాధి ఉంటే అది నయమౌతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. వందలకొద్ది బాధితులు ఆ స్థలాన్ని సందర్శించారు. కాని జనుల సంఖ్య పెద్దది కావడంతో నీళ్ళు కదిలింపబడినప్పుడు ప్రజలు తోసుకుంటూ ముందుకి రావడం వల్ల తొక్కిసలాట జరిగేది. దానిలో బలహీనులైన పురుషులు, స్త్రీలు పిల్లలు నలిగిపోయేవారు. అనేకులు కోనేరుర దగ్గరకు వెళ్ళలేకపోయేవారు. కోనేరు దగ్గరకు చేరుకోగలిగిన అనేకులు ఆ గట్టు మీదే మరణించేవారు. ప్రజల్ని పగటి ఎండ నుండి రాత్రి చలి గాలుల నుండి కాపాడటానికి కోనేటి చుట్టు రక్షణ స్థావరాలు నిర్మించారు. రాత్రంతా ఈ మంటపాల్లో గడపి, రోజుకు రోజు సహాయం కోసం వ్యర్ధంగా కోనేటి అంచుకు పాకుకుంటూ వెళ్ళేవారు కొందరుండే వారు.MHTel 56.1

    యేసు యెరూషలేములో ఉన్నాడు. ఒంటరిగా ధ్యానిస్తూ ప్రార్ధిస్తూ నడుస్తూ ఆయన కోనేటి వద్దకు వచ్చాడు. స్వస్థతకు తన చివరి తరుణంగా భావిస్తున్న ఆ గడియ కోసం బాధితులు కనిపెట్టటం ఆయన చూసాడు. తన స్వస్థ శక్తిని వినియోగించి ప్రతీ వారిని స్వస్ధపర్చాలని ఆయన అభిల షించాడు. కాని అది సబ్బాతు. దినం, జనులు దేవాలయానికి ఆరాధనకు వెళ్తున్నారు. అటువంటి స్వస్థత చర్య యూదుల దురభి ప్రాయాన్ని రెచ్చగొట్టి తన పరిచర్యకు అడ్డుకట్ట వెయ్యవచ్చునని ఆయనకు తెలుసు.MHTel 56.2

    కాని ఒకరి స్థితి దయనీయంగా ఉన్నట్లు రక్షకుడు చూసాడు. అతడు ముప్పయి ఎనిమిది సంవత్సరాలుగా నిస్సహాయుడై పడి ఉన్న కుంటివాడు. అతడి వ్యాధి చాలా మేరకు తన చెడు అలవాట్లు ఫలితంగా వచ్చి దేవుని తీర్పుగా భావించబడింది,. ఏకాకి అయి ఉన్నాడు. మిత్రులెవరూ లేరు. దేవుని కృపకు దూరమైనట్లు తలపోసుకుంటూ ఆ వ్యాధి బాధితుడు చాలా సంవత్సరాలు దు:ఖంలో వెళ్ళదీసాడు. నీళ్ళు కదలింపబడే సమయం వస్తుందనగా అతడి అసహాయత పట్ల కనికరం కలిగినవారు అతణ్ణి మంటపం వద్దకు మోసుకు వెళ్ళే వారు కాని ఆ తరుణం వచ్చినప్పుడు నీటిలోకి వెళ్ళటానికి సాయపడ్డవారు లేరు. అతడు నీళ్ళు కదలింపబడటం చూసేవాడు కాని కోనేటి అంచును దాటి వెళ్లలేక పోయేవాడు. తనకన్నా బలగం గలవారు అతడి కన్నా ముందు నీటిలోకి దూకేవారు. ఈ దీన నిస్సహాయ బాధితుడు, తోసుకుంటూ గెంటుకూంట వచ్చి పడుతున్న స్వార్ధపరులైన జనసమూహంతో పోటీలో నిలవలేక పోయాడు. తన ఏకైక గురి దిశగా అతడి నిర్విరామ కృషి అతడ అతురత, నిత్యమూ నిరాశ అతడిలో మిగిలి ఉన్న శక్తిని హరించివేస్తున్నాయి. MHTel 56.3

    వ్యాధిగత్రస్తుడు తన చాప మీద పడుకొని అప్పుడప్పుడు తల పైకెత్తి కోనేటి వంక చూస్తు ఉండగా దయ దాక్షిణ్యం ఉట్టిపడే ఓ ముఖం తనపై వంగి. “స్వస్థపడగోరుచున్నవా” అన్న మాటలు అతడి గమనాన్ని ఆకర్షించాయి. అతడి హృదయంలో నిరీక్షణ నెలకొంది. ఏదో విధంగా తనకు సహాయం రావల్సి ఉందనుకున్నాడు. కాని ఆ ఉత్సాహపు మెరపు త్వరలో మాయమయ్యింది. కోనేటిని చేరటానికి తాను ఎంత తరుచుగా ప్రయత్నించాడో గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కదిలింప బడేటప్పటకి తాను బతికి ఉండకపోవచ్చు అనుకొని బాధపడ్డా. ” అయ్యా నీళ్ళు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగును” అన్నాడు.MHTel 57.1

    యేసు “నీవు లేచి నీ పరు పెత్తికొని నడుపుము” అని అతడితో అన్నాడు. 6-8 వచనాలు ఆ వ్యాధిగ్రస్తుడు నూతన నిరీక్షణతో యేసు వంక చూసాడు. అతడి ముఖవైఖరి, అతడి కంఠస్వర శృతులు ఇతరులకన్నా వేరుగా ఉన్నాయి. ప్రేమ శక్తి అయిన సముఖం నుండి వచ్చే శ్వాసలా కనిపించాయి. క్రీస్తు మాటను ఆ కుంటివాడు విశ్వసించాడు. ప్రశ్నించ కుండా దాన్ని ఆచరించడటానికి పునుకున్నాడు. ఇది చేసినపడు అతడి శరీరమంతా సానుకూలంగా స్పందించింది.MHTel 57.2

    ప్రతీ నాడి ప్రతీ కండరం నూతన జీవంతో చైతన్యవంతమయ్యింది. కుంటబడ్డ అవయవాలు ఆరోగ్యవంతముగా పనిచెయ్యటం మొదలు పెట్టాయి. లేచి నిలబడి బలంగా అడుగులు వేసుకుంటూ దేవుని సోత్రిస్తూ తనకు నూతనముగా వచ్చిన శక్తిలో ఆనందిస్తూ నివసించాడు.MHTel 58.1

    కుంటివాడైన ఈ వ్యాధిగ్రతస్తుడికి యేసు దైవ సహాయ హామీని ఇవ్వలేదు. అతడు, “ప్రభువా, నీవు నన్ను స్వస్థపర్చితే నీ మాటలకు విధేయుణ్ణవుతాను”. అని ఉండవచ్చు. సందేహించి ఆగిపోయి ఉండవచ్చు. తద్వారా స్వస్థతకు ఒక తరణాన్ని కోల్పోయి ఉండవచ్చు. కాని అతడు అలా చెయ్యలేదు. క్రీస్తు మాటను విశ్వసించాడు., స్వస్థత పొందానని అతడు నడవటానికి ఇచ్చయించాడు, నడిచాడు. క్రీస్తు మాటను అనుసరించి చర్య చేపట్టగా అతడికి స్వస్ధత కలిగింది.MHTel 58.2

    మనం పాపంవల్ల దైవ సంబంధమైన జీవితంతో తెగతెంపులు చేసుకున్నాం. మన ఆత్మలు కుంటివయ్యాయి. ఆ కుంటివాడు ఎలా నడవలేకపోయాడో అలాగే మనంతట మనం పరిశుద్ధ జీవితం జీవించటానికి శక్తి లేనివారం. అనేకులు తమ నిస్సహాయతను గుర్తిస్తారు. తమను దేవునితో సామరస్య జీవనానికి తీసుకువచ్చే ఆధ్యాత్మిక జీవింత కోసం ఆకాంక్షిస్తున్నారు. దాన్ని సాధించటానికి కృషి చేస్తున్నారు. కాని అది సాధ్యపడటంలేదు. “అయ్యో నెనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?” అంటూ నిరాశతో విలపిస్తున్నారు. రోమా 7:24 MHTel 58.3

    నిరాశ నిస్పృహాలతో సతమతమౌతున్న వీరు పైకి చూడాలి. తన రక్తంతో కొన్న వీరి పై వంగి కృప కనికరాలతో “స్వస్థపడ గోరుచున్నావా?” అంటున్నాడు ఆయన. ఆరోగ్యంతోను సమాధానంతోను పైకి లేవమని మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. స్వస్థత పొందామన్న మనోభవం కలిగే వరకు ఆగుతున్నారా మీరు ? రక్షకుని మాటను విశ్వసించండి. మీ చిత్తాన్ని క్రీస్తు చిత్తానికి అనుకూలంగా మలచండి. దాని నుంచి విడిపించ టానికి క్రీస్తు సమర్ధుడు. విడుదల కూర్చటానికి ఆయన ఆకాంక్షిస్తున్నాడు. “పాపము చేతను అపరాధములు చేతను చచ్చిన” ఆత్మకు ఆయన జీవాన్నిస్తాడు. ఎఫెసీ 2:1 బలహీనతకు, దురదృష్టానికి, పాపానికి బందీ అయిన వ్యక్తికి ఆయన విడుదల కలిగిస్తాడు.MHTel 58.4

    పాపం జీవపు ఊటలను విషపూరితం చేసింది. కాని క్రీస్తంటున్నాడు. మీ పాపాల్ని నేను తీసుకుంటాను. మీకు శాంతి నిస్తాను. మిమ్మల్ని నా రక్తంతో కొన్నాను. మీరు నా సొత్తు, బలహీనమైన మీ చిత్తాన్ని నా కృప బలో పేతం చేస్తుంది. పాపాన్ని గూర్చిన మీ దు:ఖాన్ని నేను తొలగిస్తాను.” MHTel 59.1

    శోధనలు దాడి చేసినప్పుడు, చింత ఆందోళన మిమ్మల్ని చుట్టు ముట్టినప్పుడు నిరుత్సాహానికి, ఆధైర్యానికి లోనై నిస్పృహకు తావివ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు వంక చూడండి. మీ చుట్టు ఉన్న చీకటి ఆయన సముఖ ప్రకాశం వల్ల మటుమాయమౌతుంది. మీ ఆత్మలో ఆధిపత్యం సాధించటానికి పాపం పోరాడుతూ మీ మనస్సాక్షిపై భారం మోపుతున్న పుడు రక్షకుని వంక చూడండి,. పాపాన్ని అణిచివెయ్యటనాకి ఆయన కృప సరిపోతుంది. మీయందు ఉంచబడ్డ నిరీక్షణను గట్టిగా పట్టుకోండి మిమ్మల్ని తన కుటుంబములోకి దత్తత తీసుకోవటానికిMHTel 59.2

    క్రీస్తు వేచియున్నాడు. ఆయన బలం మీ బలహీనతను పరిహరిస్తుంది. ఆయన యేసు లేచి నిలబడి, ఆ స్త్రీ వంక చూసి ఇలా అన్నాడు. “అమ్మా వారెక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె మిమ్మల్ని అడుగడుగూ నడిపిస్తాడు. ఆయన చేతిలో చేయి వేసి ఆయనే మిమ్మల్ని నడపనివ్వండి.MHTel 59.3

    క్రీస్తు ఎంత దూరంలో ఉన్నాడని భావించకండి. ఆయన ఎల్లప్పుడు దగ్గరగా ఉంటాడు. ఆయన సముఖం మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటుంది. మీకు దొరకాలిన ఆశిస్తూ ఆయనను అన్వేషించండి. మీరు తన వస్త్రాలు ముట్టుకోవాలని మాత్రమే కాకుండా. నిత్యం తనతో సహవసిస్తూ తనతో నడవాలని ఆయన భావిస్తున్నాడు.MHTel 59.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents