Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సమయోచిత వర్తమానం

    సంఘ సభ్యులు, నిజమైన మిషనెరీలు, మూడోదూత వర్తమానాన్ని విశ్వసించేవారు, సబ్బాతును ప్రతిష్ఠిత దినంగా ఎంచి ఆచరించేవారు. వీరందరూ యెషయా ఏభై ఎనిమిదో అధ్యాయంలోని వర్తమానాన్ని పరిగణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అధ్యాయంలో దేవుడు కోరుతున్న పరోపకార సేవ ఈ సమయంలో తన ప్రజలు చెయ్యాలని దేవుడు కోరుతున్న సేవ. అది ఆయన నియమించిన సేవ. ఈ వర్తమానం ఎక్కడ వర్తిస్తుందన్న విషయమై, దాని నెరవేర్పుకు నిర్దేశించిన సమయం విషయమై సందిగ్ధత అవసరంలేదు. ఎందుకంటే మనం ఇలా చదువుతున్నాం. “పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడననియు నీకు పేరు పెట్టబడును.” విరగగొట్టబడ్డ దాన్ని బాగుచెయ్యటమన్న ప్రత్యేక సేవ దైవ ప్రజలకి ఉంది. మనం లోకాంతాన్ని సమీపించేకోద్దీ ఈ సేవ మరింత త్వరగా జరగాల్సి ఉంటుంది. దేవుని ప్రేమించే వారందరు ఆయన ఆజ్ఞల్ని ఆచరించటం ద్వారా ఆయన చిహ్నాన్ని ధరిస్తున్నామని చూపిస్తారు. వారు దేశంలో నివసించేటట్లుగా త్రోవల్ని సిద్దపర్చేవారు... నిజమైన మిషనెరీ సేవ విడదియ్యలేని విధంగా ఆజ్ఞల ఆచరణతో జతపడి ఉన్నది. సబ్బాతు దేవుడు చేసిన సృష్టి కార్యానికి స్మృతి చిహ్నం గనుక అందులో అది ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. దాని ఆచరణ మానవుడిలో దేవుని నైతిక స్వరూప పునరుద్దరణతో ముడిపడి ఉంది. ఈ పరిచర్యనే దైవ ప్రజలు ఈ సమయంలో కొనసాగించాల్సి ఉన్నారు. సరిగా నిర్వహిస్తే ఈ పరిచర్య సంఘానికి గొప్ప దీవెనలు తెస్తుంది. టెస్టిమొనీస్, సం. 6, పులు. 265, 266.ChSTel 162.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents