Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వానుభవ సాక్ష్యం

    క్రీస్తు అనుచరులుగా మనం మన మాటల్ని పరస్పరం సహాయం చేసుకోటానికి, క్రైస్తవ జీవితంలో ఒకరి నొకరం ప్రోత్సహించుకోటానికి తోడ్పడేరీతిగా వాడాలి. మన అనుభవంలోని ప్రశప్త అధ్యాయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నదానికన్నా మరెక్కువగా మాట్లాడాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 338.ChSTel 248.1

    దేవునితో సహవాసం చేసే అలవాటు గల సభ్యుల తాజా, సజీవానుభవం సంఘానికి అవసరం. సారంలేని, తాజాకాని, క్రీస్తు లేని సాక్ష్యాలు, ప్రార్ధనలు ప్రజలకు సహాయం చెయ్యవు. దేవుని బిడ్డనని చెప్పే ప్రతీ వ్యక్తి విశ్వాసంతో, వెలుగుతో, జీవంతో నిండిఉండే సత్యం వినటానికి నచ్చే వారికి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇవ్వగలుగుతారు! క్రీస్తుకి ఎన్ని ఆత్మల్ని సంపాదించవచ్చు! టెస్టిమొనీస్, సం. 6, పు. 64.ChSTel 248.2

    ఆయన విశ్వసనీయతను గూర్చిన మన సాక్ష్యమే క్రీస్తుని లోకానికి వెల్లడి చెయ్యటాని దేవుడు ఎంపిక చేసుకున్న సాధనం. పూర్వం భక్తుల ద్వారా వెల్లడైన ఆయన కృపను మనం గుర్తించాలి. కాని మిక్కిలి ఫలప్రదమైనది మన అనుభవాన్ని గూర్చి మనమిచ్చే సాక్ష్యమే. మనలో పనిచేస్తున్న దైవికమైన శక్తిని మన జీవితంలో వెల్లడి చేయటం ద్వారా మనం దేవునికి సాక్ష్యులమౌతాం. ప్రతీ వ్యక్తికీ ఇతరులందరికన్నా వ్యత్యాసమైన జీవితం ఇతరుల అనుభవాలకన్నా వ్యత్యాసమైన అనుభవం ఉంటాయి. మన స్తుతి అర్పణ మన సొంత వ్యక్తిత్వ ముద్రతో పైకి లేవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కృపా మహిమల నిమిత్తం స్తోత్రానికి ఈ ప్రశస్త గుర్తింపుకి క్రీస్తుని పోలిన మన జీవితం మద్దతు పలికినప్పుడు ఆత్మల రక్షణకు దారితీసే ఓ అప్రతిహత శక్తి పనిచేస్తుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 100.ChSTel 248.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents