Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఇవ్వటానికి దేవుని సంసిద్ధత

    తమ పిల్లలకి మంచివి ఇవ్వటానికి తల్లిదండ్రులు సిద్దంగా ఉండే కన్నా తన సేవ చేసే వారికి పరిశుద్దాత్మను అనుగ్రహించటానికి దేవుడు ఎక్కువ సిద్ధంగా ఉంటాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 50.ChSTel 295.1

    అన్ని వేళల్లో అన్ని స్థలాల్లో, అన్ని దుఃఖాల్లో, అన్ని శ్రమల్లో, దృక్పథం చీకటిగా భవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్నట్లు కనిపించినప్పుడు, మనం నిస్సహాయులం ఒంటరివారం అనిపించినప్పుడు విశ్వాస ప్రార్ధనకు సమాధానంగా దేవుడు ఆదరణకర్తను పంపుతాడు. పరిస్థితులు మనల్ని లోకంలోని ప్రతీ మిత్రుడి నుంచి వేరుచెయ్యవచ్చు. కాని ఏ పరిస్థితీ, ఏ దూర ప్రదేశం పరలోక ఆదరణ కర్తనుంచి మనల్ని వేరు చెయ్యలేదు. మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్లినా మనల్ని ఆదుకోటానికి, సంరక్షించటానికి, పైకెత్తటానికి, ఉత్సాహపర్చటానికి ఆయన ఎల్లప్పుడు మన కుడి పక్క ఉంటాడు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పులు. 669, 670.ChSTel 295.2

    ప్రతీ ఉదయం సువార్త సేవకులు ప్రభువు ముందు మోకరించి తమను ఆయనకు సమర్పించుకున్నప్పుడు పునరుజ్జీవింపజేసే, పరిశుద్ధపర్చే శక్తిగల పరిశుద్దాత్మ సముఖాన్ని ఆయన వారికి అనుగ్రహిస్తాడు. ఆ దిన విధుల నిర్వహణలో ముందుకి సాగేటప్పుడు వారు “దేవుని జతపనివారు” అవ్వటానికి అదృశ్యమైన పరిశుద్దాత్మ తమకు శక్తినిస్తాడన్న హామీ వారికున్నది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 56.ChSTel 296.1

    మనం పరిశుద్దాత్మ శక్తిగల కాలంలో నివసిస్తున్నాం. అది మానవ సాధనం ద్వారా వ్యాపించటానికి తద్వారా తన ప్రభావాన్ని లోకంలో పెంచుకోటానికి ప్రయత్నిస్తున్నది. సదర్న్ వాచ్ మేన్, నవ. 3, 1903.ChSTel 296.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents