Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పారిశ్రామిక విద్య

    లక్షల పేద కుంటుంబాలున్నాయి. వారి నిమిత్తం చెయ్యగల మిషనెరీ సేవ ఏమిటంటే కొంత భూమిలో వారు స్థిరపడటానికి దాని మీద పనిచేసి పంటపండించి జీవనోపాధి సంపాదించటం నేర్చుకోటానికి వారికి తోడ్పడటం. అలాంటి సహాయానికి, ఉపదేశానికి ఉన్న అవసరం పట్టణాలు నగరాలకే పరిమితం కాదు. మెరుగైన జీవనానికి ఎన్నో అవకాశాలున్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా లేమిలో ఉన్న పేదలు వేలు లక్షల కొద్దీ ఉన్నారు. పారిశ్రామిక విద్య పారిశుధ్య విద్య లేని సమాజాలున్నాయి. ఇంటిలో సామగ్రి, ఒంటికి సరిగా బట్టలు, పరికరాలు, పుస్తకాలు లేకుండా, సదుపాయాలు, వసతులు లేకుండా, సంస్కృతి సాధనాలు లేకుండా గుడిసెల్లో కుటుంబాలు నివసిస్తాయి. భ్రష్టమైన ఆత్మలు, దుర్బలత, అంగవికలత గల శరీరాలు దుష్ట పారంపర్యం, దురభ్యాసాల ఫలితాల్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ ప్రజలకి పునాది నుంచి శిక్షణ అవసరం. వారు కదలికలేని, సోమరి, భ్రష్టజీవితాలు జీవిస్తున్నారు. వారికి మంచి అలవాట్లలో శిక్షణ ఇవ్వటం అవసరం. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 192.ChSTel 149.1

    పేద కుటుంబాలు ఉపాధి పొందేందుకు వివిధ పరిశ్రమల్ని స్థాపించటం పై శ్రద్ధ పెట్టాలి. వడ్రంగి పనివారు కమ్మరి పనివారు ఏదో ఉపయోగకరమైన పని తెలిసిన ప్రతీ వారు తమ పనిని అజ్ఞానులికి, నిరుద్యోగులికి నేర్పించి సహాయం చెయ్యటంలో బాధ్యత వహించాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 194. ChSTel 149.2

    క్రైస్తవ వ్యవసాయదారులు నేల పై ఇళ్లు కట్టుకోటంలోను, నేలను దున్ని దాన్ని సారవంతం చెయ్యటంలోను పేదలకు సహాయం చెయ్యటంలో నిజమైన మిషనెరీ సేవ చెయ్యవచ్చు. వ్యవసాయ పనిముట్లు ఎలా ఉపయోగించాలో, వివిధ పంటలు ఎలా పండించాలో, పండ్ల తోటలు ఎలా నాటి పెంచాలో వారికి నేర్పించండి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 193.ChSTel 149.3

    పేదలకు పరిచర్య విషయంలో స్త్రీలకు పురుషులకు విశాల సేవారంగం ఉన్నది. సమర్ధంగా వంటచేసే స్త్రీ, ఇంటి పనులు చేసి ఇల్లు చక్కగా శుభ్రంగా ఉంచే స్త్రీ, బట్టలు కుట్టే స్త్రీ, నర్సు - వీరందరి సహాయం అవసరం. పేద కుటుంబాల్లోని సభ్యులికి వంట చెయ్యటం, తమ సొంత బట్టలు తామే తయారు చేసుకోటం, మరమ్మతు చేసుకోటం, జబ్బుగా ఉన్నవారికి సేవ చెయ్యటం, గృహాన్ని సరిగ్గా ఉంచుకోటం నేర్పించండి. బాలురికి బాలికలకి ఏదో వృత్తి పని లేక వృత్తి నేర్పించండి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 194.ChSTel 150.1