Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    న్యాయమైన బహుమానం

    ప్రభువు దయాళుడు, ఆయన కృపా కనికరాలు గలవాడు. ఆయన బిడ్డలందరూ ఆయనకు తెలుసు. మనలో ప్రతీ ఒక్కరం ఏమి చేస్తున్నామో ఆయనకు తెలుసు. ప్రతీ వ్యక్తికీ ఎంత గణ్యతనివ్వాలో ఆయనకు తెలుసు. మా గణ్యత జాబితాని మీ ఖండన జాబితాని పక్కన పెట్టి ప్రభువుకి ఆ పనిని విడిచి పెడ్తారా? దేవుడు మాకిచ్చిన పనిని మీరు చేస్తే ఆయన మీకు మహిమ కిరీటం ఇస్తాడు. సదర్న్ వాచ్ మేన్, మే 14, 1903.ChSTel 315.1

    మన బహుమానం ఎలాంటిది అన్నదాన్ని గురించి ఒక్క ప్రశ్నలేకుండా మనం ఆయనలో విశ్రమించాల్సిందిగా ప్రభువు మనల్ని కోరుతురన్నాడు. ఆత్మలో క్రీస్తు నివసించినప్పుడు బహుమానాన్ని గూర్చిన తలంపు ప్రాధాన్యాన్ని సంతరించుకోదు. మన సేవకు ప్రేరణ ఇదికాదు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 398.ChSTel 315.2

    చీకటి మిద్దెలు, పాడుపడ్డ ఇంటి చీకటి గదులు, చీకటి బిలాలు, వధ్యా యంత్రాలు, పర్వతాలు అరణ్యాలు, గుహలు, సముద్ర తీరం లోపని గుహల నుంచి క్రీస్తు తన బిడ్డల్ని పోగు చేసుకుంటాడు. లోకంలో వారు దిక్కు లేని వారు కష్టాలు హింసలకు గురి అయినవారు. సాతాను మోసాలకు లొంగనందువల్ల లక్షలు కోట్ల ప్రజలు సిగ్గుని అవమానాన్ని భరిస్తూ సమాధుల్లోకి వెళ్తారు. మానవ న్యాయ సభలు వారిని నికృష్ట నేరస్తులుగా తీర్చుచెబుతాయి. అయితే “దేవుడే న్యాయాధిపతి” కానున్న సమయం వస్తుంది. అప్పుడు లోకం తీర్చే తీర్పులు తారుమారవుతాయి. అప్పుడు ఆయన “భూమి మీదనుండి తన జనుల నిందను తీసవేయును.” వారిలో ప్రతీ ఒక్కరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. అప్పుడు “వారిని పరిశుద్ధ జనులని, ప్రభువు విమోచించిన వారని” పిలుస్తారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 179, 180.ChSTel 315.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents