Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రైస్తవ జీవిత ప్రకృతి దృశ్యం

    దైవవాక్యాన్ని స్వీకరించిన హృదయం ఎండిపోయే మడుగు వంటిది కాదు, పగిలిపోయి నీటిని పోగొట్టుకునే తొట్టి వంటిదికాదు. అది ఎన్నడూ ఎండి పోని ఊటలు కలిగి, బరువులు మోస్తూ, అలసి పోయి, దాహారులైనవారిని సేద తీర్చుతూ, బండల పై లేచిపడుతూ, గలగల ప్రవహించే కొండ ఏరు వంటిది. అది నిత్యం ప్రవహిస్తూ ముందుకు సాగుతూ, దాని జీవజలాలు భూమి అంతటిపై విస్తరించేవరకూ లోతవుతూ విశాలమవుతూ ప్రవహించే నది వంటిది. తన మార్గాన పాడుకుంటూ పోయే ఆ ఏరు పచ్చదనం పంటలు పండ్ల వరాల్ని ఇస్తూ పోతుంటుంది. దానిగట్టుల పై గడ్డి తాజాగా పచ్చగా ఉంటుంది. చెట్లపచ్చదనం ముదురు పచ్చగాను వాటి పువ్వులు విస్తారంగాను ఉంటాయి. ఎండాకాలపు తీవ్రతాపానికి గడ్డి ఎండి గోధుమ వర్ణం దాల్చే భూమి పై నది ప్రవాహమార్గాన్ని పచ్చదనం వేర్పాటుగా ఉంచుతుంది.ChSTel 121.1

    దేవుని నిజమైన బిడ్డ విషయంలోనూ ఇదే జరుగుతుంది. క్రీస్తు మతం శక్తినిచ్చే, విస్తరించే, జీవంగల, పనిచేసే ఆధ్యాత్మిక శక్తిగా బయలు పర్చుకుంటుంది. సత్యం ప్రేమ తాలూకు పారలౌకిక ప్రభావానికి హృదయం చోటు పెట్టినప్పుడు, ఈ నియమాలు మళ్లీ ఎడారిలో ఏరులా ప్రవహించి ఇప్పుడు ఎక్కడ నిస్సారం మరణం ఉన్నవో అక్కడ పంటలు పండ్లు పండింపజేస్తుంది. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పులు. 233,234.ChSTel 121.2

    క్రైస్తవుడి సంకేత శబ్దాలు సాతాను మనపై విజయం సాధించకూడదని ఆకాంక్షిస్తుంటే, క్రైస్తవ జీవితంలో మనం ఆచరించాల్సిన సంక్షేత పదబంధాలు మూడున్నాయి. అవి మెలకువగా ఉండటం, ప్రార్ధించటం, పనిచెయ్యటం. టెస్టిమొనీస్, సం.5, పు. 160. క్రీస్తుని విశ్వసించే ప్రతీ వ్యక్తి ఆధ్యాత్మిక పరిచారకులుగా పని చెయ్యటానికి, ప్రభువు సేవలో క్రియాశీలంగా, ఉత్సాహంగా, సమర్థంగా ఉండటానికి తనకు సాధ్యమైనదంతా చేస్తానని ప్రమాణం చేస్తాడు. ప్రతీ వ్యక్తి తన విధిని నెరవేర్చాలని క్రీస్తు కోరుతున్నాడు. ఆయన అనుచరులందరికి ఇది సంకేత పదబంధంగా ఉండాలి. టెస్టిమొనీస్, సం. 5, పు. 460.ChSTel 121.3