Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంస్థల సేవ

    ఆరోగ్య భోజన హోటళ్లు, చికిత్స గదుల్ని స్థాపించాలి. ఈరకమైన సేవలో భాగంగా మనం సముద్రం పక్క ఆశ్రమాల్ని స్థాపించాలి. “ప్రభువు మార్గము సిద్దపరుచుడి” అంటూ బాప్తిస్మమిచ్చే యోహాను స్వరం అరణ్యంలో వినిపించిన రీతిగా పర్యాటక కేంద్రాల్లోను సముద్రం పక్క ఆశ్రమాల్లోను ప్రభువు దూతల స్వరం వినిపించాలి. టెస్టిమొనీస్, సం. 7, పులు. 55, 56.ChSTel 160.3

    అనేక నగరాల్లో హోటళ్లకు చికిత్స గదులు చేర్చటం మంచిదని దేవుడు నాకు వెలుగు నిచ్చాడు. సరిఅయిన నియమాల్ని ఆచరించటానికి ఉన్నవారిని ఉంచటానికి లాడ్జిలుగా పనిచేసే గదులుంచవచ్చు. గ్రామ ప్రాంతాల్లో స్థాపితమైన ఆసుపత్రులుకి ఇవి రోగుల్ని పంపే కేంద్రాలుగా సేవ చెయ్యవచ్చు. టెస్టిమొనీస్, సం. 7, పు. 60.ChSTel 160.4

    మన నగరాలకి దేవుడు ఓ వర్తమానం పంపిస్తున్నాడు. మన శిబిర సమావేశాల్లో, ఇతర బహిరంగ సువార్త ఉద్యమాల ద్వారా, మన ప్రచురణల ద్వారా ఈ వర్తమానాన్ని మనం ప్రకటించాలి. ఇంతే గాక నగరాల్లో ఆరోగ్య రెస్టారెంటులు స్థాపించి వాటి ద్వారా మితానుభవ వర్తమానం ప్రకటించటం జరగాలి. మన రెస్టారెంట్లకు అనుబంధంగా సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి. సాధ్యపడినప్పుడు ఒక గదిని ఏర్పాటుచేసి అక్కడ ఆరోగ్య శాస్త్రంపై క్రైస్తవ మితానుభవం పై ప్రసంగించటానికి పోషకుల్ని ఆహ్వానించాలి. అక్కడ ఆరోగ్యవంతమైన ఆహారం తయారు చెయ్యటం వంటి ముఖ్యమైన అంశాల పై వినియోగదారులు ఉపదేశం పొందవచ్చు. టెస్టిమొనీస్, సం. 7, పు. 115.ChSTel 160.5

    మన రెస్టారెంటులకు వచ్చేవారు చదవటానికి సాహిత్యాన్ని సరఫరా చెయ్యాలి. మితానుభం, ఆహార సంస్కరణపై సాహిత్యానికి, క్రీస్తును గూర్చిన పాఠాలు, కరపత్రాల పైకి వారి గమనాన్ని ఆహ్వానించాలి. ఈ సాహిత్యాన్ని కరపరత్రాల్ని సరఫరా చెయ్యటానికి అయ్యే ఖర్చును మన ప్రజలందరు పంచుకోవాలి. వచ్చే వారందరికీ చదవటానికి ఏదైనా ఇవ్వాలి. ఇచ్చిన సాహిత్యాన్ని అనేకులు చదవకపోవచ్చు. అయితే అందులో కొందరు వెలుగు కోసం వెదుకుతుండవచ్చు. మీరిచ్చే సాహిత్యాన్ని వారు చదివి అధ్యయనం చేసి ఇతరులకు దాన్ని ఇవ్వవచ్చు. టెస్టిమొనీస్ నం. 7, పు. 116. ChSTel 161.1

    పెద్ద పెద్ద నగర కేంద్ర స్థలాల్లో ఆరోగ్య రెస్టారెంటులు, చికిత్స గదులు స్థాపించటానికి ప్రధాన కారణం మూడోదూత వర్తమానాన్ని నగర ప్రముఖుల గమనానికి ఈ సాధనాల ద్వారా తేవచ్చునని నేను ఉపదేశం పొందాను. సామాన్య రెస్టారెంటుల్ని నడి పేలాక్కాక ఈ రెస్టారెంటుల్ని మనం వేరుగా నడపటం గమనించి జ్ఞానవివేకాలు గల మనుషులు వ్యాపార పద్దతుల్లోని తేడా వెనక కారణాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి, మన రెస్టారెంటుల్లో తయారు చేసే శ్రేష్ఠమైన ఆహారానికి దారితీసే నియమాల్ని పరిశోధిస్తారు. ఇలా వారు ఈ కాలానికి దేవుడు ఉద్దేశించిన సత్యాన్ని తెలుసుకునే మార్గం ఏర్పడుతుంది. టెస్టిమొనీస్, సం. 7, పులు. 122, 123.ChSTel 161.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents