Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నిరుత్సాహం చెందిన అనుచరుల్ని పోగుచెయ్యటం

    రహస్యంగా, నిశ్శబ్దంగా నెహెమ్యా గోడల చుట్టూ తిరగటం పూర్తిచేశాడు. అతడు ఇలా అంటున్నాడు, “నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని, యాజకులకేగాని, యజమానులకేగాని, అధికారులకేగాని, పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు.” ప్రజల్లో ఉత్సాహం ఉత్కంఠ పెరిగి, తన కార్యవైఫల్యానికి పని ఆటంకానికి తోడ్పడే సమాచారం ప్రచారం కాకుండేందుకు బాధాకరమైన ఈ సమీక్షలో అతడు మిత్రుల దృష్టిని గాని శత్రువుల దృష్టిని గాని ఆకర్షించకూడదనుకున్నాడు. మిలిగిన రాత్రి అంతా నెహెమ్యా ప్రార్ధనలో గడిపాడు. ఉదయం అధైర్యం చెంది, విభజించబడి ఉన్న తన దేశప్రజల్ని మేలుకొల్పి ఐక్యపర్చటానికి చిత్తశుద్ధితో కృషి చెయ్యాల్సి ఉన్నాడు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 22, 1904.ChSTel 203.2

    పట్టణం చుట్టూ ప్రాకారాల్ని నిర్మించటంలో ప్రజలు తనతో సహకరించాలన్న రాజాజ్ఞ తన వద్ద ఉన్నప్పటికీ కేవలం అధికారాన్ని వినియోగించటం పై ఆధారపడకూడదని నెహెమ్యా తీర్మానించుకున్నాడు. దానికి బదులు తాను చేపట్టిన మహాకార్య సాఫల్యానికి మనసులు చేతులు ఏకమవ్వటం ముఖ్యమని గ్రహించి ప్రజల విశ్వాసాన్ని సానుభూతిని పొందటానికి ప్రయతించాడు.ChSTel 204.1

    ఉదయం ప్రజలు సమావేశమైనప్పుడు, నిద్రాణమై ఉన్న వారి శక్తుల్ని మేల్కొల్పటానికి, చెదరి ఉన్న సభ్యుల్ని ఐక్యపర్చటానికి ఉద్దేశించిన వాదనల్ని వారికి సమర్పించాడు.... విషయాన్ని పూర్తిగా వారి ముందు పెట్టి తన చుట్టూ పారసీక రాజు ఇశ్రాయేలు దేవుని సంయుక్తాధికారం రక్షావలయంగా ఉన్నదని వెల్లడి చేశాడు. అనుకూలంగా ఉన్న తరుణాన్ని ఆసరాగా తీసుకుని లేచి తనతో కలిసి ప్రాకారాలు నిర్మిస్తారా అని వారిని సూటిగా ప్రశ్నించాడు. ఈ విజ్ఞప్తి వారి హృదయాల్ని స్పృశించింది. తమపట్ల దేవుని ప్రసన్నత వారి భయాల్ని తొలగించింది. వారు ముక్తకంఠంతో “మనము కట్టుటకు పూనుకొందము రండి” అని ధైర్యంగా కేకలు వేశారు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 29, 1904. ChSTel 204.2

    నెహెమ్యా పరిశుద్ద శక్తి, ఉన్నత నిరీక్షణ ప్రజల్ని ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తి వారిని ప్రభావితం చేయగా కొంతకాలం వారు తమ నాయకుడి నైతిక స్థాయికి లేచారు. ప్రతీ వ్యక్తి తన పరిధిలో ఓ నెహెమ్యాలా మారాడు. ప్రతీ వ్యక్తి తన సహోదరుణ్ని తన పనిలో బలపర్చి ఆదుకున్నాడు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 29, 1904. ChSTel 204.3