Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    హృదయపూర్వకత

    ఘనతను తామే తీసుకోకుండా, అతి గంభీరమైన నిబంధన ద్వారా ప్రభువుని సేవిస్తామని ఖరారు పడ్డామని జ్ఞాపకముంచుకుని, తమ పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించే దేవుని ప్రజలు తమని తాము ప్రత్యేకించుకోవాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 17.ChSTel 276.3

    హృదయపూర్వకంగా, నిస్సంకోచంగా నిర్ణయించుకున్న పురుషులు స్త్రీలే ఇప్పుడు నిలబడతారు. క్రైస్తవ సంఘానికి పునాది వెయ్యటానికి, చివరికి ఓ సమయంలో పదకొండుమంది శిష్యులు, కొందరు నమ్మకమైన స్త్రీలు మాత్రమే మిగిలి ఉండే వరకు క్రీస్తు తన అనుచరుల్ని మళ్లీ మళ్లీ జల్లించాడు. బరువులు మొయ్యాల్సి వచ్చినప్పుడు వెనక్కి ఉండిపోయే వారుంటారు. కాని సంఘం ధగధగ మెరిసేటప్పుడు వారు ఉద్రేకం పొంది, పాటలు పాడి కేకలు వేసి ఆనంద పరవశులవుతారు. వారిని గమనించండి. ఆ ఉత్సాహం చల్లారినప్పుడు నమ్మకమైన కొందరు కాలేబులు మాత్రమే ముందుకి వచ్చి స్థిర నియమాన్ని ప్రదర్శిస్తారు. వీరు సారాన్ని నిలుపుకునే ఉప్పు. పని కదలిక కష్టమైనప్పుడే సంఘం యధార్థ సహాయకుల్ని రూపొందిస్తుంది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 273.ChSTel 277.1

    వారు అవిశ్వాసులతో సబ్జా (అధిక లాభాశతో ఊహలు చెయ్యటం) చెయ్యకూడదు. ఇది దేవుడు తమకు నియమించిన పనికి ఆటంకం కలిగిస్తుంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 19.ChSTel 277.2

    దేవుడు విభజిత సేవను అంగీకరించడు. దైవ సేవకుడు ఆత్మ సమర్పణ భావాన్ని దినదినం నేర్చుకోవాలి. గాస్పుల్ వర్కర్స్, పు. 113.ChSTel 277.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents