Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అనుసరించాల్సిన తెలివైన మార్గం

    ఆదివారాచరణ చట్టాల్ని ధిక్కరించటం వాటిని అమలు పర్చటానికి ప్రయత్నించే మత ఆవేశపరులు తమ హింసను తీవ్రతరం చెయ్యటానికి తోడ్పడుతుంది. మిమ్మల్ని చట్టాన్ని అతిక్రమించేవారిగా పేర్కోటానికి వారికి అవకాశం ఇవ్వకండి. దేవునికిగాని మానవుడికిగాని భయపడని మనుషుల్ని అదుపు చెయ్యటం తప్ప వారికింకేమి లేకపోతే, అదుపు చెయ్యటంలో వారికి త్వరలో కొత్తతనం కనిపించదు. ఆదివారాచరణ విషయంలో కఠినంగా వ్యవహరించటంలో తాము నిలకడగా ఉండటం గాని అది మనకు అనుకూలంగా ఉండటం గాని సాధ్యం కాదని వారు గ్రహిస్తారు. బైబిళ్లు చేతపట్టుకొని మీ మిషనరీ సేవను కొనసాగించండి. తన కార్యానికి తానే విఘాతం కలిగించుకున్నట్లు శత్రువు గ్రహిస్తాడు.ChSTel 191.3

    అభ్యంతరం కలిగించే పని చెయ్యకుండా ఉండటం వివేకమని గుర్తించినందుకు ఒక వ్యక్తి ఆ పని చెయ్యకుండి అదే సమయంలో అతి ప్రాముఖ్యమైన పని చెయ్యటం వలన మృగం ముద్రపొందడు. టెస్టిమొనీస్, సం.9, పు. 232. ChSTel 191.4

    ఆదివారం నాడు మిషనరీ సేవ చేస్తే అది నిరంకుశమైన మతావేశపరుల చేతుల్లోనుంచి కొరడాని తీసివేస్తుంది. వారు సెవెంతుడే ఎడ్వెంటిస్టుల్ని సిగ్గుపర్చినందుకు సంతోషిస్తారు. ఆదివారం నాడు ప్రజల్ని సందర్శించి వారికి లేఖనాల్ని తెరవటం చూసినప్పుడు ఆదివార చట్టాల్ని చెయ్యటం వల్ల మన సేవను అడ్డుకోచూడటం వ్యర్థమని వారు గ్రహిస్తారు. టెస్టిమొనీస్, సం.9, పులు. 232, 233.ChSTel 191.5

    ప్రభువు సేవకు ఎంతో దోహదపడే వివిధ శాఖల అభివృద్ధికి ఆదివారాన్ని వినియోగించుకోవచ్చు. ఈ రోజున ఆరుబయట సమావేశాలు, కుటీర సమావేశాలు నిర్వహించవచ్చు. ప్రతి ఇంటికీ వెళ్లి సువార్త సేవ చెయ్యవచ్చు. రాయగలిగినవారు ఈ దినాన్ని వ్యాసాలు రాయటానికి ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు సాధ్యపడితే అప్పుడు ఆదివారం నాడు మతారాధనలు జరపాలి. ఈ ఆరాధనల్ని ఆశాజనకం చెయ్యండి. ఉజ్జీవం పుట్టించే పాటలు పాడండి. రక్షకుని ప్రేమను గురించి శక్తితోను నిశ్చయతతోను మాట్లాడండి. మితానుభవం గురించి, వాస్తవిక మతానుభవం గురించి మాట్లాడండి. టెస్టిమొనీస్, సం.9, పు.233.ChSTel 192.1

    మన పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఆదివారాన్ని మిషనెరీ కృషికి వినియోగించాలి. శత్రువు ఉద్దేశాన్ని వారు ఈ విధంగా నిష్ఫలం చెయ్యగలుతారని ప్రభువు నాకుపదేశించాడు. సత్యం ఎరుగనివారికి సమావేశాలు జరిపించటానికి ఉపధ్యాయులు విద్యార్థుల్ని తీసుకు వెళ్లాలి. ఏవిధంగా కన్నా ఈ విధంగా వారు ఎక్కువ సాధించగలుగుతారు. టెస్టిమొనీస్, సం.9, పు.233.ChSTel 192.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents