Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఉచ్చరణ - ఆచరణ

    హృదయం స్వీకరించే ప్రతీ ప్రధాన సత్యం జీవితంలో ఆచరించబడాలి. మనుషులు క్రీస్తు ప్రేమను ఏ నిష్పత్తిలో స్వీకరిస్తారో ఆ నిష్పత్తిలోనే దాని శక్తిని ఇతరులికి ప్రకటించటానికి అభిలషిస్తారు. దాన్ని ప్రకటించే ఆ చర్య తమ సొంత ఆత్మలకు దాని విలువను మరింత పెంచుతుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర 19, 1889.ChSTel 107.4

    మన విశ్వాసం విస్తారమైన సత్ర్కియలతో నిండి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతవిశ్వాసం. టెస్టిమొనీస్, సం.4, పు. 145. ChSTel 108.1

    సువార్త సందేశాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినవారు దాన్ని ప్రకటించటానికి ఆశపడ్డారు. క్రీస్తు తాలూకు పరలోక ప్రేమకు వ్యక్తీకరణ మార్గం ఏర్పడాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 125.ChSTel 108.2

    మనం వాస్తవిక సేవద్వారా, ఆయన నామ మహిమను పెంపు చెయ్యటానికి మన శక్తిమేరకు కృషి చెయ్యటం ద్వారా, దేవున్ని స్తోత్రించాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్, పు. 300.ChSTel 108.3

    ఈ సమయంలో మూడోదూత వర్తమానం అంగీకరించటంతో లేక నమ్మటంతో మన విశ్వాసం ఆగిపోకూడదు. ప్రదీపానికి నూనె అందించి వెలుగు ప్రకాశింపజేస్తూ చీకటిలో ఉన్నవారికి మార్గం చూపించటానికి మనకు క్రీస్తు కృపా తైలం ఉండాలి. టెస్టిమొనీస్, సం.9, పు. 155. ChSTel 108.4

    మీ దీవెనలు, మీ ఆధ్యాత్మిక శక్తి, ప్రేమ పంచటానికీ, మంచి పనులు చెయ్యటానికీ మీరు చేసే కృషి నిష్పత్తిలో ఉంటాయి. టెస్టిమొనీస్, సం. 3, పు. 526.ChSTel 108.5

    సత్యపు వెలుగును పొందినవారందరూ ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టి నివసిస్తే క్రీస్తుకి మరింత సేవ జరిగేది. టెస్టిమొనీస్, సం.9, పు. 40.ChSTel 108.6

    ఓ జనంగా మనలో లోపమున్నదని నాకు దర్శనంలో కనపర్చటం జరిగింది. మన పనులు మన విశ్వాసానికి అనుగుణంగా లేవు. మనుషులికి దేవుడిచ్చిన అతి గంభీర, అతిప్రాముఖ్య వర్తమాన ప్రకటన జరుగుతున్న సమయంలో నివసిస్తున్నామని మన విశ్వాసం సాక్ష్యమిస్తున్నది. ఈ వాస్తవం మన ముందున్నా, మన కృషి, మన ఉత్సాహం, మన ఆత్మ త్యాగస్ఫూర్తి మన సేవా స్వభావంతో సరిపోలటంలేదు. మనం మృతుల్లోనుంచి మేల్కోవాలి. క్రీస్తు మనకు జీవాన్నిస్తాడు. టెస్టిమొనీస్, సం. 2, పు. 114.ChSTel 108.7

    విశ్వాసంతో ముందుకి వెళ్లండి. మీరు నమ్ముతున్నట్టుగా సత్యాన్ని ప్రకటించండి. మీరు ఎవరి ఆత్మల రక్షణ కోసం కృషిచేస్తున్నారో వారు అది మీకు సజీవ విశ్వాసంగా ఉన్నట్లు చూడనివ్వండి. టెస్టిమొనీస్, సం. 9, పు. 42. ChSTel 109.1

    క్రీస్తు వంటి జీవితమే క్రైస్తవానికి అనుకూలంగా సమర్పించగల అతి శక్తిమంతమైన వాదన. టెస్టిమొనీస్, సం.9, పు. 21.ChSTel 109.2

    క్రీస్తు నామం ధరించిన అనేకమంది ఆయన సేవను చెయ్యటం లేదు. వారు తమ దైవభక్తిని ఆర్బాటంగా ప్రదర్శించుకుంటారు. ఈకార్యాన్ని బట్టే వారు తమ ఖండనను అధికం చేసుకుని, ఎక్కువ మోసకారులుగా, ఆత్మల్ని నాశనం చెయ్యటంలో సాతానుకి మరిన్ని విజయాలు సాధించే ప్రతినిధులుగా పనిచేస్తారు. రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 27, 1888.ChSTel 109.3

    ప్రభువు కోసం కని పెడుతున్నవారు సత్యానికి విధేయులైనివసించటం ద్వారా తమ ఆత్మల్ని పరిశుద్ధపర్చుకుంటున్నారు. మెలకువగా ఉండి కని పెట్టటంతోపాటు వారు పట్టుదలతో పనిచేస్తారు. ప్రభువు తలుపు వద్దే ఉన్నాడని వారెరుగుదుర గనుక ఆత్మల రక్షణ సేవలో పరలోక నివాసులతో సహకరించి ఉత్సాహంతో పని చేస్తారు. ప్రభువు కుటుంబానికి “తగిన కాలమున... ఆహారము” పెట్టే నమ్మకమైన, బుద్దిగల సేవకులు వీరు. ప్రత్యేకంగా ఈ కాలానికి వర్తించే సత్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. హనోకు, నోవహకు, అబ్రాహాము, మోషే వీరిలో ప్రతీ వారు తన కాలానికి వర్తించిన సత్యాన్ని ప్రకటించిన రీతిగానే ఇప్పుడు క్రీస్తు సేవకులు తమ తరానికి ప్రత్యేక హెచ్చరికను ప్రకటించాలి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 634.ChSTel 109.4

    దేవుని ముందు మన స్థాయి మనం పొందిన తెలుగు మీదగాక మనకు ఉన్న వేలును ఉపయోగించుకోటం మీద ఆధారపడి ఉంటుంది. తమకు ఎక్కువ వెలుగున్నదని, తాము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ వెలుగును లెక్కచెయ్యకుండా, తాము నమ్ముతున్నట్లు చెప్పుకునే సత్యానికి తమ దినదిన జీవితంలో విరుద్ధంగా నివసించే వారికన్నా తమకు తెలిసినంతమట్టుకు సత్యాన్ని ఎంపికచేసుకునే అన్యులు ఈ రకంగా మెరుగైన స్థితిలో ఉంటారు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 239. ChSTel 109.5

    యేసుక్రీస్తు ప్రభువు రాకకు ఎదురు చూడటమేగాక దాన్ని వేగవంతం చెయ్యటం ప్రతీ క్రైస్తవుడికి ఉన్న ఆధిక్యత. ఆయన నామం ధరించినవారందరూ ఆయనకు మహిమ తెచ్చే ఫలాలు ఫలిస్తుంటే లోకమంతటా సువార్త విత్తనాలు నాటటం ఎంత త్వరితంగా జరుగుతుంది! చివరి పంట త్వరగా పండుతుంది. తన ప్రశస్తమైన పంటను కూర్చుకోటానికి క్రీస్తు వస్తాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 69.ChSTel 110.1

    క్రైస్తవులు మేల్కొని తాము నిర్లక్ష్యం చేసిన విధుల్ని చేపట్టాలి. ఎందుచేతనంటే వారి సొంత ఆత్మల రక్షణ తమ వ్యక్తిగత కృషి మీద ఆధారపడి ఉంటుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ, 23, 1881.ChSTel 110.2

    యధార్ధారాధన అంటే క్రీస్తుతో కలిసి పనిచెయ్యటం. ప్రార్ధనలు, ఉపదేశం, ప్రసంగం చౌకబారు ఫలాలు. వాటిని తరచు వేలాడగట్టటం జరుగుతుంది. అయితే లేమిలో ఉన్నవారిని, తండ్రిలేని పిల్లల్ని విధవరాండ్రను ఆదుకోటంలో ప్రదర్శితమయ్యే సత్ర్కియా ఫలాలు స్వాభావికంగా మంచి చెట్టు మీద పెరుగుతాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 16, 1881.ChSTel 110.3

    వ్యక్తిగత సంఘసభ్యులు వెలుగును వెదజల్లటం వెలుగును స్వీకరించటమన్న తమ నియమిత సేవను చేపట్టాలి. ప్రభువు ద్రాక్షతోటలో సోమరులుగా ఉన్నవారిలో ఒక్కడుకూడా క్షమార్హుడుకాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్ర 19, 1889. ChSTel 110.4

    క్రియా నియమం ఏంటంటే మనం ఫలించాలని క్రీస్తు కోరుతున్న ఫలం. అది ఉపకార కార్యాలు చెయ్యటం, దయగల మాటలు మాట్లాడటం, పేదలు లేమినను భవిస్తున్న వారిపట్ల, శ్రమల్లో ఉన్నవారి పట్ల సానుభూతి కనపర్చటం. రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగ. 16, 1881.ChSTel 110.5

    యాకోబు బావి దగ్గర యేసుతో మాట్లాడిన సమరయ స్త్రీ రక్షకుణ్ని కనుగొన్న వెంటనే వెళ్లి ఇతరుల్ని ఆయన వద్దకు తీసుకువచ్చింది. ఆయన సొంత శిష్యులకన్నా తానే ఎక్కువ ఫలప్రదమైన మిషనెరీగా ఆమె నిరూపించుకున్నది. సమరయలో సువార్త సేవకు ప్రోత్సాహం లభిస్తుందన్న సూచనలు శిష్యులికి ఏమి కనిపించలేదు. భవిష్యత్తులో జరగాల్సిఉన్న గొప్ప సేవ పై వారి తలంపులు కేంద్రీకృతమై ఉన్నాయి. తమ పరిసరప్రాంతాల్లోనే పోగుచెయ్యాల్సిన పంట ఉందని వారు గ్రహించలేదు. అయితే వారు ద్వేషిస్తున్న ఆ స్త్రీ ద్వారా ఆ పట్టణ ప్రజలంతా యేసు భోధ వినటానికి వచ్చారు. ఆమె తక్షణమే తన పట్టణ ప్రజలకు వెలుగును చూపించింది. క్రీస్తు మీద విశ్వాసం ఎలా పని చేస్తుందో ఈ స్త్రీ సూచిస్తుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 102.ChSTel 110.6

    సెవెంతుడే ఎడ్వెంటిస్టులు ప్రగతి సాధిస్తున్నారు. సంఘసభ్యత్వాన్ని రెట్టింపు చేస్తున్నారు. మిషను సేవారంగాలు స్థాపిస్తున్నారు. లోకంలోని అంధకార ప్రాంతాల్లో సత్యపతాకాన్ని ఎగరవేస్తున్నారు. అయినా పని దేవుడు వాంఛిస్తున్నదానికన్నా మందకొడిగా సాగుతున్నది. ఎందుకు?] సంఘసభ్యులు తమ శక్తిమేరకు కృషి చెయ్యటానికి వ్యక్తిగతంగా ప్రోత్సహంపొందటంలేదు. పటుతరమైన దైవభక్తి కొరవడటం వల్ల అంకితభావం, దీనమనసు, దైవభీతి గల పనివారు లేనందువల్ల దైవ సేవలోని ప్రతీశాఖ కుంటుబడుతున్నది. క్రీస్తు సిలువ యోధులు ఎక్కడున్నారు? దేవుని మహిమను నిత్యం ఆకాంక్షిస్తూ దైవభీతి, యధార్ధత, చిత్తవుద్ధి కలవారు అసత్యంతో సాగేపోరాటానికి సిద్దపడాలి. ఆధ్యాత్మిక సంఘర్షణ సమయంలో బలహీనులు పిరికివారు అయ్యేవారు చాలామంది ఉంటారు. వారు బలహీనత నుంచి బలంపొంది, పోరాటంలో సాహసవంతులై ప్రత్యర్థి సేనను మట్టి కరిపింతురుగాక! హిస్టారికల్ స్కెచస్, పు. 290.ChSTel 111.1

    ఒకవ్యక్తి తనకు దేవుడచ్చిన శక్తుల్ని ఉపయోగించటానికి ఒకసారి నిరాకరిస్తే ఈ శక్తులు క్షీణించి నశిస్తాయి. ఆచరణలో పెట్టనిసత్యం. ఇతరులితో పంచుకోనిసత్యం దాని ప్రాణదాయక శక్తిని, స్వస్తత గుణాన్ని కోల్పోతుంది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 206.ChSTel 111.2