Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సన్నిహిత వ్యక్తిగత స్పర్శ

    వ్యక్తిగత కృషి ద్వారా ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరముంది. బోధకు తక్కువ సమయం వ్యక్తిగత సేవకు ఎక్కువ సమయం గడిపితే గొప్ప ఫలితాలు చూడగలుగుతాం. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 143.ChSTel 135.1

    తన కృపావాక్యాన్ని ప్రతీ ఆత్మకు సుబోధకం చెయ్యాలన్నది ప్రభువు కోరిక. ఈ కార్యాన్ని ఎక్కువ భాగం వ్యక్తిగత సేవ ద్వారా సాధించాలి. ఇది క్రీస్తు అవలబించిన పద్ధతి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 229. ChSTel 135.2

    తమ ప్రతిభ గురించి అతిశయించకుండా వినయ హృదయులై తమ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చెయ్యటానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేవారు ఆత్మలను రక్షించే సేవలో మిక్కిలి విజయవంతంగా ఉంటారు. యేసు చేసిన సేవ ఇదే. తాను చేరాలని ఆశించినవారికి చేరువగా వచ్చాడు. గాస్ఫుల్ వర్కర్స్, పు. 194.ChSTel 135.3

    మనం క్రీస్తువంటి సానుభూతితో మనుషుల దగ్గరకు వ్యక్తిగతంగా వచ్చి నిత్యజీవానికి సంబంధించిన విషయాల్లో వారికి ఆసక్తి పుట్టించటానికి ప్రయత్నించాలి. వారి హృదయాలు బాగా నలిగిన మార్గంలా కఠినమై వారికి రక్షకుణ్ని సమర్పించటం వ్యర్థ ప్రయత్నంలా కనిపించవచ్చు. అయితే వారిని ఒప్పించటానికి హేతువాదం విఫలమవ్వగా, తర్కం శక్తిహీనంకాగా, వ్యక్తిగత పరిచర్యలో వెల్లడయ్యే క్రీస్తు ప్రేమ హృదయాన్ని కరిగించి సత్యమనే విత్తనం వేరు తన్నటానికి దోహదం చెయ్యవచ్చు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 57.ChSTel 135.4

    మీ చుట్టుప్రక్కల ఉన్నవారిని వ్యక్తిగత సేవ ద్వారా చేరండి. వారితో పరిచయం ఏర్పర్చుకోండి. చెయ్యాల్సి ఉన్న పనిని కేవలం బోధ చెయ్యలేదు. మీరు సందర్శించేవారి గృహాలికి పరలోక దూతలు మీతోవచ్చి మాకు సహాయం చేస్తారు. ఈ పనిని మీకు బదులు వేరొకరు చెయ్యలేరు. డబ్బిచ్చి లేక అప్పిచ్చి దీన్ని నెరవేర్చలేం. దాన్ని ఇంకొకరు చెయ్యరు. ప్రజల్ని సందర్శించటం, వారితో మాట్లాడటం, వారితో ప్రార్ధించటం వారికి సానుభూతి చూపించటం ద్వారా హృదయాల్ని ఆకట్టుకోవచ్చు. మీరు చెయ్యగల ఉత్తమ మిషనెరీ సేవ ఇదే. ఈ పని చేయ్యటానికి మీకు ధృఢమైన, పట్టుదలతో కూడిన విశ్వాసం, అలుపెరుగని ఓర్పు, ఆత్మలపట్ల గాఢమైన ప్రేమ అవసరం. టెస్టిమొనీస్, సం.9, పు. 41.ChSTel 135.5

    యోహాను ఆంధేయ సీమోను ఫిలిప్పు నతనయేలు పిలుపుతో క్రైస్తవ సంఘం పునాది ప్రారంభయ్యింది. యోహాను తన ఇద్దరి శిష్యుల్నీ క్రీస్తు వద్దకు నడిపించాడు. అంతట వీరిలో ఒకడైన ఆంద్రేయ తన సహోదరుణ్ని రక్షకుని వద్దకు తీసుకువచ్చాడు. అప్పుడు ఫిలిప్పుని పిలవటం అతడు నతనయేలుని వెదుక్కుంటూ వెళ్లటం జరిగింది. వ్యక్తిగత కృషి, మన బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగువారికి ప్రత్యక్షంగా విజ్ఞప్తి చెయ్యటం, ప్రాముఖ్యమని ఈ సాదృశ్యాలు సూచిస్తున్నాయి. తమ జీవిత కాలమంతా క్రీస్తుని విశ్వసిస్తున్నట్లు చెప్పుకునేవారు అయినా రక్షకుని నమ్మటానికి ఒక్కవ్యక్తిని కూడ నడిపించని వారు ఉన్నారు. వారు ఆ పనంతా బోధకుడికే విడిచి పెడారు. బోధకుడు గొప్ప అర్హతలున్నవాడే కావచ్చు. కాని సంఘ సభ్యులికి దేవుడు నియమించిన పనిని అతడు చెయ్యలేడు.ChSTel 136.1

    ప్రేమా హృదయులైన క్రైస్తవుల పరిచర్య అవసరమైనవారున్నారు. తమ ఇరుగుపొరుగువారు, సామాన్య పురుషులు స్త్రీలు తమ నిమిత్తం వ్యక్తిగత కృషి చేస్తే రక్షించబడగలిగే అనేకులు నాశనమౌతున్నారు. అనేకులు తమను వ్యక్తిగతంగా కలుసుకుని ముచ్చటించే వారి కోసం ఎదురుచూస్తున్నారు. మనం నివసించే కుటుంబంలో, మన ఇరుగుపొరుగున ఉన్న కుటుంబాల్లో, మన పట్టణంలో మనం క్రీస్తు మిషనెరీలుగా చెయ్యాల్సిన పని ఉంది. మనం క్రైస్తవులమైతే ఈ పని మనకు ఆనందాన్నిస్తుంది. ఒక వ్యక్తి క్రీస్తు విశ్వాసి అయిన క్షణంలోనే యేసులో తాను కనుగొన్న ప్రశస్తమిత్రుణ్ని ఇతరులికి పరిచయం చెయ్యాలన్న కోరిక అతనిలో పుడుతుంది. రక్షించి పరిశుద్ధపర్చే సత్యాన్ని హృదయంలోనే బంధించి ఉంచటం సాధ్యపడదు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 141.ChSTel 136.2

    వెలుగును వెదజల్లే మిక్కిలి శక్తిమంతమైన మార్గాల్లో ఒకటి వ్యక్తిగతంగా కృషి చెయ్యటం. గృహపరిధిలో, ఇరుగుపొరుగు వారి చలిమంటవద్ద, జబ్బుగా ఉన్నవారి పడక పక్క మీరు నెమ్మదిగా లేఖనం చదివి యేసునుగురించి సత్యం గురించి ఒక మాట చెప్పవచ్చు. ఈ రీతిగా మీరు ప్రశస్తమైన సత్యవిత్తనం నాటవచ్చు. అది మొలిచి ఫలాలు ఫలిస్తుంది. టెస్టిమొనీస్, సం.6, పులు. 428, 29. ChSTel 137.1

    ఉప్పును ఏ పదార్థంతో కలుపుతామోదానితో అది మిళితమవ్వాలి. దాన్ని భద్రపర్చటానికి ఉప్పు దానిలోకి చొచ్చుకుపోయి దానితో మమేకమవ్వాలి. అలాగే వ్యక్తిగత సంబంధం ద్వారా, స్నేహభావం ద్వారా మనుషుల్ని రక్షణ సువార్తతో చేరాలి. మనుషులు మూకుమ్మడిగా కాదు వ్యక్తులుగా రక్షించబడ్డారు. వ్యక్తిగత ప్రభావం ఓ శక్తి. మనం క్రీస్తు చెంతకు చేర్చాలని ఆశించేవారికి దగ్గరవ్వాలి. తాట్స్ ఫ్రమ్ ది మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్, పు. 30. ChSTel 137.2

    యేసు తన రాజ్యానికి పిలుపు పొందాల్సిన ఓ ఆత్మను ప్రతీ వ్యక్తిలోను చూశాడు. తమ మేలును ఆకాంక్షించిన వ్యక్తిగా వారి మధ్యకు వెళ్లటం ద్వారా ఆయన ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. ఆయన వీధుల్లో, వ్యక్తిగత గృహాల్లో, పడవల్లో, సమాజమందిరాల్లో, సరస్సు పక్క, వివాహ విందులో ప్రజల్ని అన్వేషించాడు. వారిని తమ దినవారి పనుల వద్ద కలిసి వారి లౌకిక విషయాల్లో ఆసక్తి కనపర్చాడు. తన ఉపదేశాన్ని గృహల్లోకి తీసుకువెళ్లాడు. కుటుంబాన్ని తమ సొంత గృహాల్లోనే తన పరిశుద్ద సముఖం ప్రభావం కిందకి తెచ్చాడు. ఆయన వ్యక్తిగత సానుభూతి హృదయాల్ని ఆకర్షించటానికి తోడ్పడింది. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 151.ChSTel 137.3

    ప్రజల్ని చేరటంలో క్రీస్తు పద్ధతి ఒక్కటే విజయాన్నిస్తుంది. రక్షకుడు తమ మేలు కోరినవాడిగా ప్రజలతో కలిసి మెలసి ఉన్నాడు. వారి పట్ల సానుభూతి ప్రదర్శించాడు. వారి అవసరాలు తీర్చటానికి పరిచర్య చేసివారి నమ్మకాన్ని సంపాదించాడు. అప్పుడు “నన్ను వెంబడించుడి” అని ఆదేశించాడు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 143. ChSTel 137.4

    మనం క్రీస్తులా పని చెయ్యాలి. సమాజమందిరంలో, దారి పక్క, ఒడ్డునుంచి కొంచెం నీటిలోకి నెట్టిన పడవలో, పరిసయ్యుడి విందులో లేదా సుంకరి భోజన బల్ల వద్ద తాను ఎక్కడున్నా ఆయన ఉన్నత జీవితానికి సంబంధించిన సంగతుల గురించి మనుషులతో మాట్లాడాడు. ప్రకృతి విషయాల్ని, రోజువారీ జీవిత సంఘటనల్ని ఆయన సత్యవాక్కులతో పొందుపర్చాడు. ఆయన శ్రోతల హృదయాల్ని ఆకర్శించాడు. ఎందుకంటే ఆయన వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చాడు, దుఃఖాక్రాంతుల్ని ఓదార్చాడు. చిన్నబిడ్డల్ని చేతుల్లోకి తీసుకుని దీవించాడు. ఆయన మాట్లాడటానికి నోరు తెరచినప్పుడు ప్రజల గమనం ఆయన పైనే నిలిచింది. ఆయన పలికిన ప్రతీ మాట ఏదో ఆత్మకు జీవార్ధమైన జీవపు వాసనగా ఉండేది.ChSTel 138.1

    మనం కూడా ఆయనలా ఉండాలి. మనం ఎక్కడున్నా రక్షకుణ్ని గూర్చి ఇతరులతో మాట్లాడటానికి అవకాశాలకోసం అప్రమత్తంగా ఉండాలి. మేలు చెయ్యటంలో మనం క్రీస్తు ఆదర్శాన్ని అనుసరిస్తే ఆయనకు హృదయాలు తెరవబడ్డట్లే మనకూ తెరవబడ్డాయి. హఠాత్తుగా కాక దైవ ప్రేమ మూలంగా వచ్చిన నేర్పుతో, “పదివేల మంది పురుషులలో ఎవరిని “గుర్తింపవచ్చునో” ఎవరు “అతి కాంక్షణీయుడో” ఆ ప్రభువును గూర్చి మనం వారికి చెప్పవచ్చు. మనం మన మాట వరాన్ని వినియోగించగల అత్యున్నత సేవ ఇది. క్రీస్తుని పాపం క్షమించే రక్షకుడుగా లోకానికి సమర్పించేందుకే ఈ వరం మనకు అనుగ్రహించబడింది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 338, 339.ChSTel 138.2

    ఆయన సముఖం గృహంలోకి శుద్ధమైన వాతావరణాన్ని తెచ్చింది. ఆయన జీవితం సమాజంలో పులిసిన పిండిలా పనిచేసింది. నిరపాయుడు, పరిశుద్దుడు అయిన ఆయన సదాలోచనలేని, కఠినులైన, మర్యాద లేని ప్రజల మధ్య, అన్యాయస్థులైన సుంకరులు, దుర్స్యయులు, నీతిలేని సమరయులు, అన్యులైన సైనికులు, కరకు గ్రామీణులు, మిశ్రిత ప్రజల మధ్య నడిచాడు. అలసి పోయినప్పటికీ తీవ్ర భారాలు మోయాల్సివచ్చినవారిని చూసినప్పుడు ఆయన ఇక్కడొకటి అక్కడొకటి దయగల మాటలు మాట్లాడాడు. వారి భారాల్ని పంచుకున్నాడు. ప్రేమను గురించి, దయను గురించి, దేవుని ప్రేమను గురించి ప్రకృతి నుంచి తాను నేర్చుకున్న పాఠాల్ని వారికి వర్ణించాడు. ChSTel 138.3

    తాము సరిగా వినియోగిస్తే తమకు పరలోక ఐశ్వర్యం అనుగ్రహించే వరాలున్నట్లు తమను తాము పరిగణించుకోవాలని ఆయన అందరికీ బోధించాడు. ఆయన జీవితంలోని ఆడంబరాన్ని తీసివేశాడు. కాలంలోని ప్రతీ గడియ నిత్యమైన ఫలితాలతో నిండి ఉన్నదని, దాన్ని గొప్ప భాగ్యంగా ఎంచి, పరిశుద్ద ఉద్దేశాల సాధనకు వినియోగించాలని తన సొంత ఆదర్శం ద్వారా బోధించాడు. మానవులెవర్నీ అయోగ్యులుగా భావించి దాటిపోలేదు. కాని ప్రతీ ఆత్మకు రక్షణాషధాన్ని ఇవ్వటానికి ప్రయత్నించాడు. తాను ఏ ప్రజల మధ్య ఉన్నా ఆ సమయానికి ఆ పరిస్థితులకి తగిన పాఠాన్ని వారికి సమర్పించాడు. తాము నిందారహితులు, నిరపాయులు దేవుని పిల్లలు అవ్వటానికి అర్హమైన ప్రవర్తనల్ని సాధించవచ్చునన్న భరోసాను మిక్కిలి కరకైన మిక్కిలి అయోగ్యులైనవారి ముందుంచి వారిలో నిరీక్షణను రేకెత్తించటానికి ప్రయత్నించాడు. దారి తప్పి సాతాను నియంత్రణ కిందకు వెళ్లి అతడి ఉచ్చుల్లోనుంచి బయటపడే మార్గంలేకుండా ఉన్నవారిని ఆయన తరచుగా కలిశాడు. ధైర్యంచెడి, వ్యాధిగ్రస్తులు శోధితులు అయి పతనమైన అట్టివారితో యేసు దయగల మాటలు, వారికి ఎంతో అవసరమైన, వారు గ్రహించగల మాటలు మాట్లాడాడు. ఆత్మల విరోధి అయిన సాతానుతో ముష్టాముష్టిపోరు సల్పుతున్నవారిని ఆయన తరచు కలిశాడు. తమ పోరు ఓర్పుతో కొనసాగించమని ప్రోత్సహించి, తాము విజయం సాధిస్తారని భరోసా ఇచ్చాడు. ఎందుచేతనంటే దేవుని దూతలు వారి పక్క ఉన్నారు. వారు వారికి విజయం చేకూర్చుతారు. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 91.ChSTel 139.1