Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 23
    వివిధ రీతులమిషనెరీసేవ

    అంధులపట్ల కనికరం

    శారీరకంగా అంధులైన తన బిడ్డలకు పరిచర్య చెయ్యటానికి దేవుడు దూతల్ని పంపుతాడు. దేవదూతలు వారి అడుగుల్ని కాపాడూ, తమకు తెలియకుండా మార్గంలో ఉన్న అనేక ప్రమాదాలనుంచి వారిని కాపాడారు. టెస్టిమొనీస్, సం. 3, పు. 516. ChSTel 251.1

    తమ మధ్య ఉన్న అంధుల్ని వ్యాధిగ్రస్తుల్ని అలక్ష్యం చేస్తుండగా తన ప్రజల ప్రార్ధనల్ని ప్రభువు ఆలకించడు. టెస్టిమొనీస్, సం. 3, పు. 518.ChSTel 251.2

    గుడ్డివారిని పడిపోయేటట్లు చేసేవారు సంఘంలో ఉంటే వారికి శిక్ష పడాలి. ఎందుచేతనంటే దేవుడు మనల్ని గుడ్డివారికి, శ్రమలనుభవిస్తున్న వారికి, విధవరాండ్రకి, తండ్రిలేని వారికి పరిరక్షకులుగా నియమించాడు. వాక్యంలో సూచించబడుతున్న ఆటంక బండ అంధుడు తూలిపడేందుకు అతడి ముందు పెట్టిన పెద్ద మొద్దు కాదు. దాని అర్థం ఇంకా ఎక్కువే ఉంది. దాని అర్థం అంధుడైన తమ సహోదరుడి పలుకుబడిని దెబ్బతీసే, అతడి ఆసక్తుల్ని వ్యతిరేకించే లేక అతడి ప్రగతిని అడ్డుకునే ఏ చర్య అయినా అని. టెస్టిమొనీస్, సం. 3, పు. 519.ChSTel 251.3

    చూపు లేనందువల్ల, అంధుడు అన్ని పక్కల సమస్యల్ని ఎదుర్కుంటాడు. అంధుడు ఈ లోకంలో తనను కమ్మిన చీకటిలో తన మార్గాన్ని తడుముకుంటూ వెళ్లటం చూసినప్పుడు దయ, సానుభూతి పుట్టని ఆ హృదయం నిజంగా పాషాణం. అది దేవుని కృప వలన మెత్తనిధవ్వాలి. టెస్టిమొనీస్, సం. 3, పు. 521.ChSTel 251.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents