Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఫలితాలకి హామి

    యధార్థ మారుమనసు విషయంలో అద్భుత కార్యాలు చోటు చేసుకోనున్నాయి. వాటిని ఇప్పుడు అవగాహన చేసుకోలేం. ఈ లోకంలో అత్యధికులు అద్భుతాలు చేసే దేవుని శక్తికి మించినవారు కారు. ఆయనతో కలిసి పనిచేస్తున్న సేవకులు అవకాశాన్ని సద్వినియోగపర్చుకునే వ్యక్తులై తమ విధిని ధైర్యంగా నమ్మకంగా నిర్వర్తిస్తుంటే, ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తుల హృదయాల్ని, ప్రతిభ, ప్రభావం గల వ్యక్తుల హృదయాల్ని దేవుడు మార్చతాడు. పరిశుద్దాత్మ శక్తి ద్వారా అనేకులు దైవ నియమాల్ని స్వీకరిస్తారు. హృదయ పరివర్తన పొంది సత్యాన్ని స్వీకరించినవారు వెలుగును ప్రసరించటానికి దేవుని సాధనాలవుతారు. నిర్లక్ష్యానికి గురి అయిన ఈ తరగతి ప్రజల ఆత్మల నిమిత్తం వారి హృదయాల పై ప్రత్యేక భారం ఉంటుంది. ప్రభువు సేవకు ప్రజలు ద్రవ్యాన్ని ప్రతిష్ఠించటం జరుగుతుంది. సంఘానికి నూతన సామర్ధ్యం నూతన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 140.ChSTel 238.3

    సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉన్న అనేకులు గాయపడ్డ హృదయాలతో, ఆడంబరంతో రోగగ్రస్తులై ఉన్నారు. వారు తమకు లేని సమాధానం కోసం చూస్తున్నారు. సమాజం అత్యున్నత స్థానంలో ఉన్నవారు రక్షణ కోసం ఆకలిదప్పులు కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రేమవల్ల దయతో నిండిన ప్రభువు సేవకులు తమని వ్యక్తిగతంగా కలిస్తే ఆధ్యాత్మిక సహాయం అంగీకరించేవారు అనేకమంది ఉన్నారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 231.ChSTel 238.4

    అత్యుత్తమ పండితులు, రాజనీతిజ్ఞులు, లోకంలో ప్రసిద్ధి గాంచినవారు అనేకులు ఈ చివరి దినాల్లో వెలుగు నుంచి పక్కకు తొలుగుతారు. ఎందుకంటే వివేకం ద్వారా లోకం దేవున్ని తెలుసుకోలేదు. అయినా ఈ మనుషులుకి సత్యాన్ని అందించటానికి దేవుని సేవకులు ప్రతీ తరుణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దైవ విషయాల్లో తమ అజ్ఞానాన్ని ఒప్పుకునేవారు కొందరుంటారు. వారు మహోపాధ్యాయుడు యేసు పాదాలవద్ద వినయవిధేయతలు గల విద్యార్థులుగా తమ స్థానాన్ని అంగీకరిస్తారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 241, 242.ChSTel 239.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents