Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సాదృశ్యాలు ఉపయోగకరం

    ఆయన కృపావర్తమానాలు తన శ్రోతలకు అనుకూలించేటట్లు అనేక రకాలు. “అలసినవాడికి సమయానుకూలమైన మాట ఎలా చెప్పాలో” ఆయనకు తెలుసు. సత్యసిరులని అత్యాకర్షణీయంగా ప్రజలకు సమర్పించేందుకు ఆయన పెదాల పై కృప కుమ్మరించబడింది. పూర్వదురభిప్రాయాలు గల మనసుల్ని ఎదుర్కునే నేర్పు ఆయనకున్నది. వారి గమనాన్ని ఆకర్షించే సాదృశ్యాలతో వారిని ఆశ్చర్యపర్చాడు. ఊహ శక్తి ద్వారా వారి హృదయాల్ని ఆకట్టుకున్నాడు. ఆయన తన సాదృశ్యాల్ని రోజువారీ జీవితం నుంచి తీసుకున్నాడు. సామాన్యమైన వైనప్పటికీ వాటిలో అద్భుతమైన భావం ఉంది. గాలిలో ఎగిరే పక్షులు, పొలంలోని పువ్వులు, విత్తనం, కాపరి, గొర్రెలు - ఈ సాదృశ్యాలతో నిత్య సత్యాల్ని క్రీస్తు ఉదాహరించాడు. ఆ తర్వాత తన శ్రోతలు ప్రకృతిలో వీటిని చూసినప్పుడు నిత్యం ఆయన మాటల్ని గుర్తుకు తెచ్చుకునేవారు. క్రీస్తు ఉదాహరణలు ఆయన పాఠాన్ని నిత్యం జ్ఞాపకం చేసేవి. ది డిజైర్ ఆఫ్ ఏజెస్, పు. 254. ChSTel 144.2

    సృష్టికర్త అయిన దేవుని గూర్చిన జ్ఞానాన్ని, మానవ రక్షకుడైన ఆయన కుమారుణ్ని గూర్చిన జ్ఞానాన్ని విగ్రహారాధకులకు అందించటానికి అపొస్తలులు కృషి చేశారు. ముందు దేవుని అద్భుత కార్యాల పైకి - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, క్రమంగా వచ్చేరుతువులు, మంచు కుళాయి ధరించిన పర్వతాలు, ఎత్తయిన వృక్షాలు, మానవ అవగాహనకు మించిన వివిధ ప్రకృతి అద్భుతాల పైకి - గమనాన్ని ఆకర్షించారు. సర్వశక్తుని ఈ పనుల ద్వారా అన్యులు విశ్వపాలకుడైన దేవున్ని ధ్యానించటానికి వారి మనసుల్ని అపొస్తలులు నడిపించారు. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పు. 180.ChSTel 145.1