Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వ్యక్తిగతానుభవం చెప్పండి

    క్రీస్తుని విశ్వసించినవారు తమ అనుభవం ఇతరులికి చెబుతారు. పరిశుద్ధాత్మ తమను అడుగడుగున నడిపించటం, దేవుని గూర్చిన జ్ఞానానికి, ఆయన పంపిన క్రీస్తుని గూర్చిన జ్ఞానానికి తాము ఆకలి దప్పులు గొనటం, తమ లేఖన పరిశోధన ఫలితం, తమ ప్రార్ధనలు, తమ ఆత్మవేదన, “నీ పాపములు క్షమింపబడినవి” అన్న క్రీస్తు మాటలు గురించి ఇతరులికి చెబుతారు. వీటిని రహస్యంగా ఉంచటం అస్వాభావికం. క్రీస్తు ప్రేమతో నిండినవారు అలా చెయ్యరు. ప్రభువు తన పవిత్ర సత్యానికి తమను ఏ మేరకు ధర్మకర్తల్ని చేశాడో దాని ప్రకారం ఇతరులు కూడా ఆ దీవెనలు పొందాలన్న ఆకాంక్ష వారికి ఉంటుంది. వారు దేవుని కృపా భాగ్యాన్ని వెల్లడి చేసేకొద్ది క్రీస్తు కృప ఇంతలంతలుగా వారికి అనుగ్రహించ బడుతుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 125. ChSTel 143.2

    కార్యాచరణకు ప్రతీ ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలపండి. మీరు ఎవరిని సందర్శిస్తారో వారితో లోకాంతం సమీపంలో ఉన్నదని చెప్పండి. యేసు క్రీస్తు ప్రభువు వారి హృదయ ద్వారం తెరిచి వారి మనసుల పై చెరగని ముద్రవేస్తాడు. పురుషుల్ని స్త్రీలని తమ ఆధ్యాత్మిక అజ్ఞానం నుంచి మేల్కొల్పటానికి పాటుపడండి. మీరు యేసుని ఎలా కనుగొన్నారో, ఆయన సేవలో అనుభవం సంపాదిస్తున్నప్పటి నుంచి మా రెలా దీవెనలు పొందుతున్నారో వారికి చెప్పండి. క్రైస్తవ జీవితంలో ఉన్న ఆనందం గురించి వారికి చెప్పండి. వెచ్చని ప్రేమాదరాలతో నిండిన మా మాటలు మీరు అమూల్యముత్యాన్ని కనుగొన్నారన్న నమ్మకం వారిలో పుట్టిస్తాయి. సంతోషం, ఉద్రేకంతో నిండిన మా మాటల్లో మీరు ఉన్నత మార్గాన్ని కనుగొన్నట్లు కనపర్చండి. ఇది స్వచ్చమైన మిషనెరీ సేవ. ఈ పని మీరు చేసినప్పుడు అనేకులు కలలోనుంచి లేచినట్లు మేల్కొంటారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 38.ChSTel 143.3

    తన సాధనాలుగా దేవుడు ఎవర్ని ఉపయోగించుకుంటాడో వారిని అసమర్థులుగా కొందరు పరిగణిస్తారు. అయితే వారు ప్రార్థించగలిగితే, తాము సత్యాన్ని ప్రేమిస్తున్నారు గనుక వారు సామాన్యంగా మాట్లాడగలిగితే, పరిశుద్దాత్మ శక్తి ద్వారా వారు ప్రజలని చేరగలుగుతారు. వారు వాక్యం నుంచి చదివి లేక తమ అనుభవంలోని సంగతుల్ని ప్రస్తావిస్తూ సత్యాన్ని సామాన్యంగా సమర్పించినప్పుడు ప్రజల మనసుల్ని ప్రవర్తనల్ని పరిశుద్ధాత్మ ప్రభావితం చేస్తాడు. చిత్తం దేవుని చిత్తానికి లోబడుతుంది. అంతకు ముందు అవగాహన కాని సత్యం గ్రాహ్యమై హృదయంలోకి సజీవ విశ్వాసంగా వచ్చి ఆధ్యాత్మిక వాస్తవంగా నిలుస్తుంది. టెస్టిమొనీస్, సం.6, పు. 444.ChSTel 144.1