Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్తుతి వందనార్పణ

    ప్రార్ధించటంలా పూర్ణ, శుద్ధ హృదయంతో దేవుని స్తుతించటం ఓ విధి. పడిపోయిన మానవ జాతిపట్ల దేవుని అద్భుత ప్రేమను మనం అభినందిస్తున్నామని, సర్వ సమృద్ధిగల ఆ ప్రభువునుంచి మనం ఇంకా ఎక్కువ దీవెనలకు ఎదురు చూస్తున్నామని లోకానికి చూపించాలి.... పరిశుద్ధాత్మ ప్రత్యేక కుమ్మరింపు దరిమిలా, తన బిడ్డల విషయంలో ఆయన దయాళుత్వాన్ని, ఆయన అద్భుత కార్యాల్ని వివరించటం ద్వారా ప్రభువులో మన ఆనందం, ఆయన సేవలో మన సామర్థ్యం అధికమౌతాయి. ఈ చర్యలు సాతాను శక్తిని వెనక్కునెట్టివేస్తాయి. అవి సణిగే స్వభావాన్ని ఫిర్యాదుచేసే స్వభావాన్ని బహిష్కరిస్తాయి. శోధకుడు తన పట్టును కోల్పోతాడు. అవి పరలోకంలో నివసించటానికి కావలసిన ప్రవర్తనని లోక నివాసుల్లో రూపు దిద్దుతాయి. అలాంటి సాక్ష్యం ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. క్రీస్తుకి ఆత్మల్ని రక్షించటంలో ఇంతకన్నా ఫలదాయక సాధనాల్ని ఉపయోగించలేం. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 229, 300.ChSTel 248.4

    తన మంచితనం గూర్చి తన శక్తిని గూర్చి చెప్పాల్సిందిగా ప్రభువు మనల్ని కోరుతున్నాడు. స్తుతి వందనాల చెల్లింపు వలన ఆయన ఘనత పొందుతాడు. “స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు” అని ఆయనంటున్నాడు. దేవుని ఆజ్ఞలకి వాగ్దానాలకి సంగీతం సమకూర్చగా యాత్రిక ప్రయాణికులు మార్గమంతా వాటిని పాడుకుంటూ సాగారు. కనాను తమ పండుగలకు సమావేశమైనప్పుడు, దేవుని అద్భుత కార్యాల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నామానికి వారు స్తుతియాగం అర్పించాల్సి ఉన్నారు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 298, 299.ChSTel 249.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents