Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 20
    ధనికుల్ని పలుకుబడి గల వారిని చేరటం

    అలక్ష్యం చెయ్యకూడదు

    ధనవంతులు చెయ్యవలసిన పని ఉంది. దేవుడు తన వరాల్ని ఎవరికి అప్పగించాడో ఆ వ్యక్తులుగా వారు తమ బాధ్యతల గుర్తింపుకి మేల్కోటం అవసరం. ఎవరు జీవిస్తున్న వారికి మరణించిన వారికి తీర్పు తీర్చుతారో ఆ ప్రభువుకి తాము లెక్క అప్పగించాల్సి ఉంటుందని వారికి జ్ఞాపకం చెయ్యాలి. ధనవంతుడికి మా శ్రమ అవసరం. దాన్ని ప్రేమతోను దైవ భీతితోను చెయ్యాలి. అతడు తన భాగ్యాన్ని నమ్ముకుని తనకున్న ప్రమాదాన్ని గుర్తించడు. అతడి మనోనేత్రాలు నిత్యమైన విలువ గల విషయాలకు ఆకర్షితమవ్వాలి. క్రైస్ట్స్ అబ్జెక్ట్ లెసన్స్, పు. 230.ChSTel 236.1

    తమ విద్య, భాగ్యం, హోదా విషయంలో లోకంలో సమున్నతంగా నిలిచే వారితో తమ ఆత్మకు సంబంధించిన విషయాల గురించి ఎవరూ వ్యక్తిగతంగా ఎక్కువ మాట్లాడరు. అనేకమంది క్రైస్తవ పనివారు ఈ తరగతి ప్రజల్ని సమీపించటానికి సందేహిస్తుంటారు. ఇలా జరగకూడదు. ఒక వ్యక్తి మునిగిపోతుంటే అతడు న్యాయవాదో, వ్యాపారో లేక న్యాయమూర్తో అయినందుకు నిలబడి చూస్తూ ఉండం. ఏటవాలుగా ఉన్న ప్రదేశంవైపుకి మనుషులు పరుగులు తీయ్యటం చూస్తే వారి స్థానం లేదా హోదా ఏదైనా వారిని వెనక్కు మళ్లమని హెచ్చరించటానికి మనం సందేహించం కదా? లఅలాగే ఆత్మ విషయమైన ప్రమాదం గురించి హెచ్చరించటానికి మనం సందేహించకూడదు. లోక ప్రియులుగా కనపడుతున్నందుకు మనం ఎవరినీ నిర్లక్ష్యం చెయ్యకూడదు. క్రైస్ట్స్ అబ్జెక్ట్ లెసన్స్, పులు. 230, 233.ChSTel 236.2

    ఉన్నత స్థానాల్లో ఉన్న వారి నిమిత్తం మనకు ఆత్మ వేదన కలగాలి. వివాహ విందుకు రావలసిందిగా మనం వారికి హార్థిక ఆహ్వానం అందించాలి. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904.ChSTel 236.3

    ధనవంతులు క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఇతరుల్ని చేరటానికి తన సహాయకులు కావాలని దేవుడు కోరుతున్నాడు. సంస్కరణ పునరుద్ధరణ సేవలో సహాయం చెయ్యగలవారు సత్యం తాలూకు ప్రశస్తమైన వెలుగును చూడాలని, ప్రవర్తనలో మార్పుచెంది, తమకు అప్పగించబడ్డ మూలధనాన్ని తన సేవ ప్రగతికి ఉపయోగించాలని దేవుడు కోరుతున్నాడు. తమకు ఆయన ఇచ్చిన ధనాన్ని మేలు చెయ్యటానికి, సువార్త అన్ని తరగతుల ప్రజలకు ప్రకటించటానికి మార్గం తెరవటానికి ఉపయోగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. టెస్టిమొనీస్, సం. 9, పు. 114.ChSTel 237.1

    సమాజంలో ఉన్నత స్థాయిలకి చెందిన వారిని ఆప్యాయంగా గౌరవంగా కలవాలి. వ్యాపారస్తులు, బాధ్యతాయుత హోదాల్లో ఉన్న వారు, ఆవిష్కరణ ప్రతిభ గలవారు, శాస్త్రపరిజ్ఞానం గలవారు, మేధావులు, ఈ కాలానికి దేవుడుద్దేశించిన ప్రత్యే సత్యాలు తెలియని సువార్త బోధకులు - వీరు పిలుపును వినటంలో మొదటివారు కావాలి. వారికి ఆహ్వానాన్ని అందించాలి. క్రైస్ట్స్ అబ్జెక్ట్ లెసన్స్, పు. 230. ChSTel 237.2

    వాక్య పరిచారకుల్ని ఉన్నత తరగతుల ప్రజల్ని సత్యంతో కలవటానికి ప్రయత్నించటంలో పొరపాట్లు జరుగుతున్నాయి. మన విశ్వాసానికి చెందని ప్రజల్ని పూర్తిగా విసర్జించటం ఎక్కువగా ఉంది. వారి మూసను పొందటానికి మనం వారితో సావాసం చెయ్యకుండాల్సి ఉండగా అన్నిచోట్ల నిజాయితీగల ఆత్మలు కొందరున్నారు. వారి కోసం మనం జాగ్రత్తగా వివేకంగా, విజ్ఞతతో, ప్రేమతో కృషి చెయ్యాలి. ఈ దేశంలోను ఇతర దేశాల్లోను ఉన్నత తరగతుల్ని చేరటానికి పురుషులు స్త్రీలకి శిక్షణ ఇవ్వటానికి ఓ నిధిని పోగుచెయ్యా లి. టెస్టిమొనీస్, సం. 5, పులు. 580, 581.ChSTel 237.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents