Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సువార్తను పరిచర్యతో జోడించండి

    సువార్త పరిచర్య వైద్య మిషనెరీ పరిచర్య కలిసి పురోగమించాలి. యధార్థ ఆరోగ్య సంస్కరణ నియమంతో సువార్త ముడిపడాలి. క్రైస్తవ మతం వ్యావహారిక జీవితంలోకి తర్జుమా అవ్వాలి. చిత్తశుద్దిగల సంపూర్ణ సంస్కరణ కృషి జరగాలి. మనం ఆరోగ్య సంస్కరణ నియమాల్ని ప్రజల ముందు పెట్టి ఈ నియమాల అవరసరాన్ని గుర్తించేటట్లు, వాటిని ఆచరణలో పెట్టేటట్లు పురుషుల్ని స్త్రీలని నడిపించటానికి మనం శాయశక్తుల కృషి చేయ్యా లి. టెస్టిమొనీస్, సం. 6, పు. 379.ChSTel 155.1

    మనం శిష్యులు పని చేసినట్లు పనిచెయ్యాలన్నది దైవ ప్రణాళిక. శారీరక స్వస్తత సువార్తాదేశంతో ముడిపడి ఉన్నది. సువార్త సేవలో బోధించటం స్వస్తపర్చటం రెండూ కలిసి సాగాలి. వాటిని విడదియ్యకూడదు. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 141.ChSTel 155.2

    వైద్య మిషనెరీ సేవ సువార్త సేవ ఈ రెండూ దేవుడు తన దయాళుత్వాన్ని నిత్యం కుమ్మరించటానికి ఎంచుకున్న మార్గాలు. అవి సంఘాన్ని తడిపే జీవనదిగా సాగాల్సి ఉంది. బైబిల్ ఎకో, ఆగ. 12, 1901.ChSTel 155.3

    ప్రసంగించటంలో అనుభవం గడించిన మన వాక్య పరిచారకులు సామాన్య చికిత్సలు చెయ్యటం నేర్చుకుని వైద్య మిసనెరీ సువార్త సేవకులుగా పని చెయ్యా లి. టెస్టిమొనీస్, సం. 9, పు. 172. ChSTel 155.4

    గ్రంథ విక్రయ సేవకుడు ఒక స్టులం నుంచి మరో స్థలానికి వెళ్లేటప్పుడు అనేకమంది రోగుల్ని చూస్తాడు. వ్యాధికి కారణాల గురించి అతడు ఉపయోగాత్మక జ్ఞానం సంపాదించి, బాధలో ఉన్న వారి బాధను నివారించటానికి సామాన్య చికిత్స ఎలా చెయ్యాలో నేర్చుకోవాలి. మరెక్కువగా, అతడు రోగుల దృష్టిని పరమ వైద్యుని మీదికి తిప్పి వారికోసం విశ్వాసంతో సామాన్యంగా ప్రార్ధన చెయ్యాలి. అతడు అలా దేవునితో నడుస్తూ పని చేస్తుంటే పరిచర్య చేసే దూతలు అతడి పక్క ఉండి హృదయాల్లోకి అతడికి మార్గం తెరుస్తారు. తనను తాను ప్రతిష్టించుకున్న నమ్మకమైన గ్రంథ విక్రయ సేవకుడి ముందు ఎంత విశాల మిషనెరీ సేవారంగం ఉంటుంది! అతడు తన సేవను నమ్మకంగా చెయ్యటంలో ఎంత గొప్ప దీవెనను పొందుతాడు! సదర్న్ వాచ్మేన్, నవ. 20, 1902.ChSTel 155.5

    ఆరోగ్య జీవన నియమాల్ని గురించి ఉపదేశమివ్వటం తన సేవలో భాగమని ప్రతీ సువార్త సేవకుడు భావించాలి. ఈ సేవ అవసరం చాలా ఉంది. విశాల ప్రపంచం దాని పరిధి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 147.ChSTel 156.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents