Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 21
    గృహం మిషనెరీ శిక్షణ కేంద్రం

    ప్రథమ ప్రాధాన్యత

    గృహం బిడ్డలకు మొదటి పాఠశాల. జీవిత సేవకు పునాది వెయ్యవలసింది ఇక్కడే. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 400..ChSTel 240.1

    మీ గృహంలో మిషనెరీగా ఉండటమే మీ జీవిత ప్రథమ ప్రధాన కర్తవ్యం. టెస్టిమొనీస్, సం. 4, పు. 138.ChSTel 240.2

    మానవ జాతి పునరుద్దరణ ఉన్నతి గృహంలోనే ప్రారంభమౌతుంది. తల్లిదండ్రులు బిడ్డలకు చేసే పని అన్ని పనులకూ పునాది... సమాజ శ్రేయస్సు, సంఘ విజయం, జాతి ప్రగతి గృహ ప్రభావాలపై ఆధారపడి ఉంటాయి. ది మినిస్ట్రీస్ ఆఫ్ హీలింగ్, పు. 349.ChSTel 240.3

    గృహంలో యధార్ధ సేవా స్పూర్తి ఎంత ఎక్కువగా వ్యాపిస్తే ఆ స్పూర్తి పిల్లల జీవితాల్లో అంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది. సేవ చెయ్యటం ఇతరుల మేలు కోసం త్యాగం చెయ్యటం వారికి ఆనందాన్నిస్తుంది. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 401.ChSTel 240.4

    గృహంలో తమ ముందున్న మిషనెరీ సేవా రంగాన్ని తల్లిదండ్రులు విస్మరించకూడదు. తనకు అప్పగించబడ్డ బిడ్డల్లో ప్రతీ తల్లికీ ఓ పవిత్ర బాధ్యత దేవుని వద్ద నుంచి వస్తుంది. దేవుడు ఇలా అంటున్నాడు, “ఈ కుమారుణ్ని ఈ కుమార్తెను తీసుకుని అతణ్ని, ఆమెని నా కోసం తర్బీతు చెయ్యి. రాజ భవనం ప్రకాశించేటట్లు వారు ప్రభువు రాజ్యంలో నిత్యం ప్రకాశించేలా వారి ప్రవర్తనను దిద్దు” దుష్టిని ప్రతిఘటించటానికి తన పిల్లలకు శిక్షణనిచ్చే తల్లి మీద దైవ సింహాసనం నుంచి వచ్చే వెలుగు ప్రకాశిస్తుంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 37.ChSTel 240.5

    క్రీస్తుకి మన సేవ గృహంలో కుటుంబంతో ప్రారంభించాల్సి ఉంది... ఇంతకన్నా ప్రాముఖ్యమైన మిషనెరీ సేవ లేదు. మారు మనసు పొందని వారి కోసం పని చెయ్యటం తల్లిదండ్రులు తమ ఉచ్చరణ ఆచరణల ద్వారా తమ బిడ్డలకి నేర్పించాలి. వృద్ధులపట్ల, బాధలు అనుభవిస్తున్నవారి పట్ల సానుభూతి చూపించటానికి, బీదలు, దుఃఖంలో ఉన్నవారికి సహాయం చెయ్యటానికి పిల్లల్ని తర్బీతు చెయ్యాలి. మిషనెరీ సేవను శ్రద్దగా చెయ్యాలని వారికి ఉపదేశించాలి. వారు దేవుని జతపనివారయ్యేందుకు, తమ చిన్న వయసు నుంచి ఆత్మోపేక్ష, ఇతరుల మేలుకోసం, క్రీస్తు సేవాభివృద్ధికోసం త్యాగం చెయ్యటం వారికి నేర్పించాలి. అయితే వారు ఇతరులకు నిజమైన మిషనెరీ సేవ చెయ్యాలంటే వారు ముందు తమ గృహంలో ఉన్న వారికి సేవ చెయ్యటం నేర్చుకోవాలి. తమ కుటుంబంలోని వారికి వారి ప్రేమ పై హక్కు ఉంది. టెస్టిమొనీస్, సం. 6, పు. 429.ChSTel 240.6

    మనం మన కుటుంబాల్ని చక్కదిద్దుకోవాలి. కుటుంబంలోని ప్రతీ సభ్యుడికి మిషనెరీ సేవపట్ల ఆసక్తి పుట్టిచంటానికి పట్టుదల గల కృషి జరగాలి. మన బిడ్డలు అన్ని సమయాల్లోను అన్ని స్థలాల్లోను క్రీస్తుని సూచించేందుకు, రక్షించబడని వారి నిమిత్తం చిత్తశుద్ధితో పని చేసేందుకు వారి సానుభూతిని సంపాధించటానికి మనం ప్రయత్నించాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 4, 1893.ChSTel 241.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents