Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    క్రైస్తవ గౌరవ మర్యాదలు

    సబ్బాతు ఆరాధకుల శ్రేణుల్లో క్రైస్తవ మర్యాద, సంస్కారం లోపించటమన్నది దైవ ప్రజలకు వ్యతిరేకంగా నిలిచి మనం నమ్ముతున్న సత్యాన్ని అప్రియం చేస్తున్నది. మనసుని మర్యాదల్ని సంస్కరించుకునే పనిని కొనసాగించి పరిపూర్ణతను సాధించవచ్చు. సత్యాన్ని విశ్వసించే వారు క్రీస్తులో సంపూర్ణులైన పురుషులు స్టీలుగా పెరగటానికి ఇప్పుడు తమ ఆధిక్యతల్ని తరుణాల్ని సద్వినియోగం చేసుకోకపోతే వారు సత్యానికి మంచి పేరు తేరు, క్రీస్తుకి గౌరవం తేరు. టెస్టిమొనీస్, సం.4, పులు. 358, 359. ChSTel 265.1

    క్రమబద్ద జీవితం, సత్సంభాషణల ద్వారా పని గౌరవాన్ని కాపాడండి! ప్రమాణాన్ని ఎక్వువ పెంచటానికి భయపడకండి... మనకు ముతకతనం కఠినత్వం ఉండకూడదు. మర్యాద, సంస్కారం, నాగరికత ఉండాలి. హఠాత్తుగా, మొండిగా వ్యవహరించకుండా జాగ్రత్త పడండి. అలాంటి అసాధారణ లక్షణాల్ని సుగుణాలుగా భావించకండి. ఎందుకంటే వాటిని దేవుడలా భావించడు. అనసవరంగా ఎవరినీ నొప్పించకండి. రివ్యూ అండ్ హెరాల్డ్, నవ. 25, 1890.ChSTel 265.2

    దేవుని చిత్తాన్ని గూర్చిన జ్ఞానం గల పురుషులు స్త్రీలు ఆయన సేవలో జయప్రదమైన పనివారమవ్వటం అత్యసవరం. వారు సంస్కారం అవగాహన గల మనుషులై ఉండాలి. లోకస్తులవంటి మోసకరమైన పై మెరుపు, కపట ప్రేమ కాక దైవ స్వభావంలో పాలివాడయ్యే ప్రతీ క్రైస్తవుడికి ఉండే ఆధ్యాత్మికమైన సంస్కారం, మర్యాద వారికుండాలి. టెస్టిమొనీస్, సం.4, పు. 358.ChSTel 265.3

    లోకమంతటిలోను మనకున్న సత్యం, నిరీక్షణ అతిగొప్పవి. మనం నమ్ముతున్న విశ్వాసం అతిగొప్పది. దీన్ని దాని సమున్నత స్థితిలో లోకానికి సూచించగోరుతున్నాం. ఈ ప్రశస్త, పవిత్ర సత్యాన్ని నమ్మటానికి సాహసిస్తున్నందుకు లోకాన్ని క్షమాపణ వేడుకుంటూ లోకంలో నడిచి వెళ్తున్నాము అన్న వైఖరిని మనం అవలంబించం . కాని దీనమనసు కలిగి దేవునితో నడుస్తూ, బలహీన సాధనాలమైనప్పటికీ అతిప్రాముఖ్యమైన, ఆశాజనకమైన, ఉన్నతమైన, లౌకికమైన ఏ అంశం కన్నా ఉన్నతమైన, అంశాల్ని ప్రస్తావిస్తూ సర్వోన్నతుని బిడ్డలుగా ప్రవర్తించగోరుతాం. రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 26, 1887.ChSTel 265.4

    ఆత్మల కోసం పనిచేసే సేవకుడికి అంకితభావం, విశ్వసనీయత, జ్ఞానం, పరిశ్రమ, శక్తి, నేర్పు అవసరం. ఈ అర్హతలు ఉన్న వ్యక్తి కింది స్థాయిలో ఉండడు. దానికి బదులుగా మేలు చెయ్యటానికి అతడు గొప్ప శక్తిగా ప్రభావం చూపిస్తాడు. గాస్పుల్ వర్కర్స్, పు.111.ChSTel 266.1

    వ్యక్తుల్ని కుటుంబాల్ని కలవటంలో ఉత్తమ మార్గాన్ని నేర్చుకోటానికి సమ్మతంగా ఉండే మనుషులు పనిచేస్తుండాలి. వారి దుస్తులు శుభ్రంగా ఉండాలి. అవి వికృతంగాను కృతకంగాను ఉండకూడదు. వారి మర్యాద ప్రజలికి విసుగు పుట్టించకూడదు. మనలో నిజమైన మర్యాద చాలా కొరవడి ఉన్నది. మిషనెరీ సేవ చేసే వారందరు దీన్ని పెంపొందిచుకోవాలి. టెస్టిమొనీస్, సం., పులు. 391.ChSTel 266.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents