Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సానుభూతి, స్నేహభావం

    దేవుని సేవలోని ప్రతీ శాఖలో దుఃఖాలు శ్రమల్లో ఉన్న మానవుల పట్ల సానుభూతి గల పురుషులు స్త్రీల అవసరం ఉంది. అయితే అలాంటి సానుభూతి అరుదు. రివ్యూ అండ్ హెరాల్డ్, మే 6, 1890.ChSTel 272.5

    మనకు క్రీస్తు సానుభూతి అవసరం. తప్పులు లేని వారిగా మనకు కనిపించేవారి పట్ల మాత్రమే సానుభూతి కాదు. తరచు తప్పిదాలు చేస్తూ, పాపం చేస్తూ పశ్చాత్తాపపడుతూ, శోధింపబడుతూ, నిరాశకు గురి అవుతూ, బాధలు శ్రమలు అనుభవిస్తూ పేదకరింతో సతమతమౌతున్న వారి పట్ల మనం సానుభూతి చూపించాలి. కృపామయుడైన మన ప్రధాన యాజకుడిలా మనం సాటిమనుషుల బలహీనతల్ని ఎరిగి సానుభూతితో వారి దగ్గరకు వెళ్లాలి. గాస్పుల్ వర్కర్స్, పు. 141.ChSTel 273.1

    ఓ జనాంగంగా సానుభూతి స్నేహభావం లేనందువల్ల మనకు గొప్ప నష్టం కలుగుతున్నది. స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ తన మానాన తానుండే వ్యక్తి దేవుడు తనకు నియమించిన విధిని నెరవేర్చటంలేదు. మనం దేవుని బిడ్డలం. సంతోషం కోసం మనం ఒకరిపై ఒకరు ఆధారపడాలి. మన పై దేవునికి మానవాళికి హక్కులున్నాయి. ఈ జీవితంలో మనమందరం మన పాత్ర నెరవేర్చాలి. మన స్వభావంలోని సాంఘిక లక్షణాల్ని సరిగా పెంపొందిచుకోటం మన సహోదరులతో స్నేహం ఏర్పర్చి, ఇతరులికి మేలు చెయ్యటానికి మనకృషిలో సంతోషానిస్తుంది. టెస్టిమొనీస్, సం. 4, పు. 71.ChSTel 273.2

    ఓ పరిసయ్యుడి విందులో రక్షకుడు అతిథి. ఆయన ధనవంతుల ఆహ్వానాన్నీ పేదల ఆహ్వానాన్నీ అంగీకరించేవాడు. తన ముందున్న దృశ్యాన్ని తాను బోధించే సత్యంతో జతపర్చటం ఆయన ఆనవాయితీ. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 219.ChSTel 273.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents