Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నిస్వార్థత

    క్రీస్తు సేవాజీవితం మనకు ఆదర్శం కావాలి. ఆయన నిత్యం మేలు చేస్తూ సంచరించాడు. దేవాలయంలో, సమాజ మందిరంలో, నగరాలు పట్టణాల వీధుల్లో, సంత స్థలాల్లో, కార్ఖానాల్లో, సముద్రం పక్క, కొండల నడుమ ఆయన సువార్త ప్రకటించాడు, రోగుల్ని స్వస్తపరచ్చాడు. ఆయనది. నిస్వార్థ సేవా జీవితం. అది మన పాఠ్యపుస్తకం కావాలి. సున్నితమైన, జాలిపడే ఆయన ప్రేమ మన స్వార్థానికి మన హృదయ కాఠిన్యానికి మందలింపు. టెస్టిమొనీస్, సం. 9, పు.31.ChSTel 284.3

    ప్రభువు సేవ చెయ్యటానికి మనల్ని ప్రేరేపించే ఉద్దేశం వెనక స్వార్థ ప్రయోజనానికి సంబంధించించేది ఉండకూడదు. స్వార్థరహిత భక్తి, త్యాగస్పూర్తి యోగ్యమైన సేవకు ఎల్లప్పుడు ప్రథమ ఆవశ్యకతలు. తన సేవలో నూలుపోగంత స్వార్థం కూడా ఉండకూడదన్నది ప్రభువు సంకల్పం. ఇహలోక గుడార నిర్మాణకుల్ని దేవుడు కోరిన నేర్సును, నిపుణతను, ఖచ్చితత్వాన్ని వివేకాన్ని మనం మన సేవలోకి తేవాలి. స్వార్ధాన్ని సజీవ యాగంగా బలిపీఠం మీద పెట్టినప్పుడే మన గొప్ప వరాలు లేక మన మహత్తర సేవ ఆయనకు అంగీకృతమౌతాయని మన సేవ అంతటిలో మనం గుర్తుంచుకోవాలి. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 65.ChSTel 284.4

    లోకంలోని ప్రజలందరిలోను సంస్కర్తలు మిక్కిలి స్వార్థరహితులు, మిక్కిలి కరుణశీలురు, మిక్కిలి వినమలై ఉండాలి. వారి జీవితాల్లో మంచితనం, నిస్వార్థ క్రియలు కనిపించాలి. ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పు. 157.ChSTel 285.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents