Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జరుగనున్న సంఘటనలు

    ఎవరూ గుర్తించనంత అప్రాముఖ్యులు అల్పసంఖ్యాకులుగా మన ప్రజలు పరిగణించబడుతున్నారు. కాని ఓ మార్పు రాబోతున్నది. ఆజ్ఞలు కాపాడే ప్రజలకు ప్రాధాన్యాన్ని సంతరించే కదలికల్ని క్రైస్తవ ప్రపంచం ఇప్పుడు నిర్వహిస్తున్నది. దేవుని సత్యం స్థానంలో మానవ సిద్ధాంతాల్ని తప్పుడు నియమాల్ని ప్రవేశ పెట్టటం నిత్యం జరుగుతున్నది. దేవునికి నమ్మకంగా ఉన్న వారి మనస్సాక్షిని చెరపట్టటానికి ఉద్యమాలు ప్రారంభమౌతున్నాయి. శాసనాధికారారలు గల ఈ వ్యక్తులు దైవ ప్రజలకు వ్యతిరేకులు. ప్రతీ ఆత్మ పరీక్షకు గురి అవుతుంది. టెస్టిమొనీస్, సం5, పు. 546. ChSTel 182.1

    దైవ ధర్మశాస్త్రానికి విరుద్దంగా ఉన్న చట్టాన్ని మనుషులు ఘనపర్చి కఠినంగా అమలుపర్చుతారు. తమ సొంత ఆజ్ఞలిన్న అమలు పర్చటంలో ఉద్రేకంగా ఉన్నా “అని యెహోవా సెలవిచ్చుచున్నాడు” అన్నదాన్ని పక్కన పెడతారు. నకిలీ విశ్రాంతి దినాన్ని ఘపర్చుతూ, యెహోవా ప్రవర్తనకు నకలు అయిన ధర్మ శాస్త్రాన్ని అగౌరపర్చటానికి మనుషుల్ని ఒత్తిడి చెయ్యటానికి ప్రయత్నిస్తారు. దేవుని సేవకులు ఏ తప్పు చెయ్యకపోయినా, వారు సాతాను ప్రేరణతో పనిచేసే, అసూయ మతమౌఢ్యంతో నిండిన వ్యక్తుల చేతులుకి అవమానం, దౌర్జన్యం పొందటానికి అప్పగించబడతారు. టెస్టిమొనీస్, సం9, పు. 229.ChSTel 182.2

    పరలోకంతో తమకు సంబంధమున్నట్లు, తమకు గొర్రెపిల్లవంటి సాధుగుణలక్షణాలునట్లు చెప్పుకునే మతశక్తులు వాస్తవంలో తమకు ఘటసర్పం హృదయం ఉన్నట్లు, తాము సాతాను అదుపాజ్ఞల కింద ఉండి పనిచేస్తున్నట్లు తమ క్రియల ద్వారా వెల్లడి చేస్తారు. దైవ ప్రజలు ఏడవ దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు గనుక వారు హింసకు గురి అయ్యే సమయం వస్తున్నది.... అయినా దైవ ప్రజలు ఆయనకు నమ్మకంగా నిలబడాలి. ప్రభువు వారి పక్షంగా పనిచేసి తానే దేవుళ్లకు దేవుడనని స్పష్టంగా కనపర్చుకుంటాడు. టెస్టిమొనీస్, సం9, పు. 229, 230.ChSTel 182.3

    సాతాను రెచ్చగొట్టిన మానవ హృదయాలు యోచించగల ప్రతీ అవమానం, నింద, క్రూరత్వానికి యేసు అనుచరులు గురి అయ్యారు. అది ఇంకా ఎక్కువగా మళ్లీ జరగనుంది. ఎందుకంటే శరీర సంబంధమైన మనసు ఇంకా దైవ ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నది. దాని ఆజ్ఞలకు అది విధేయంగా ఉండదు. అపొస్తలుల కాలంలోని లోకం క్రీస్తు నియమాలకి ఎంత అనుగుణంగా నివసించిందో నేటి మన లోకం అంతకుమించి . అనుగుణంగా నివసించటం లేదు. “వీనిని సిలువ వేయుము సిలువవేయుము” అన్న కేకలు వేయించిన ఆ ద్వేషమే, శిష్యుల్ని హింసించటానికి నడిపించిన ఆ ద్వేషమే అవిధేయుల్లో ఇంకా పనిచేస్తున్నది. చీకటి యుగాల్లో పురుషుల్ని, స్త్రీలను చెరసాలకు, ఏకాంతవాసానికి, మరణానికి పంపటానికి ఏ స్వభావం కారణమయ్యిందో, భక్తుడు బర్త్లొమయి హింసకు క్రూర హత్యకు పథకం రచించి ఆ కార్యాన్ని నిర్వహించిన మత విచారణ వ్యవస్థ (ఇన్ క్విజిషన్) ని ఏ స్వభావం రగిలించిందో ఆ స్వభావం ఇంకా మారు మనసు పొందని హృదయాల్లో దురావేశంతో పనిచేస్తున్నది. మంచికి చెడుకి మధ్య జరిగే సంఘర్షణ రికార్డే సత్యం తాలూకు చరిత్ర. వ్యతిరేకత, ప్రమాదం, నష్టం, బాధ మధ్య ఈ లోకంలో సువార్త ప్రకటన ముందుకు సాగుతున్నది. ది ఏక్ట్స్ ఆఫ్ ది అపాజల్స్, పులు. 84, 85.ChSTel 183.1

    శేషించిన సంఘం గొప్ప శ్రమను దుఃఖాన్ని ఎదుర్కుంటుంది. దేవుని ఆజ్ఞల్ని యేసుని గూర్చిన విశ్వాసాన్ని గైకొనేవారు ఘట సర్పం అతడి సైన్యాల ఆగ్రహాన్ని ఎదుర్కుంటారు. సాతాను లోకాన్ని తాను పాలించే ప్రజలుగా పరిగణిస్తాడు. భ్రష్ట సంఘాల పై అదుపు సాధిస్తున్నాడు. అయితే అతడి సర్వాధికారాన్ని ప్రతిఘటించే చిన్న సంఘం ఒకటుంది. వారిని లోకంలో లేకుండా పూర్తిగా తుడిచివేస్తే అతడి విజయం సంపూర్ణమౌతుంది. ఇశ్రాయేలుని నాశనం చెయ్యటానికి లోకంలోని దుష్ట రాజ్యాల్ని అతడు భవిష్యత్తులో రెచ్చగొడ్డాడు. దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే మానవ చట్టానికి విధేయులవ్వాల్సిందిగా అందరిని ఒత్తిడి చెయ్యటం జరుగుతుంది. దేవునికి నమ్మకంగా ఉంటూ తమ విధిని నమ్మకంగా నిర్వర్తించేవారు “తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను” అప్పగించబడతారు. టెస్టిమొనీస్, సం. 9, పు. 231.ChSTel 183.2

    ప్రతీ ఆత్మకు పరీక్ష వచ్చే సమయం ఎక్కువ దూరంలో లేదు. తప్పుడు సబ్బాతును ఆచరించాలన్న ఒత్తిడికి మనందరం గురి అవుతాం. పోటీ దేవుని ఆజ్ఞలకి మనుషుల ఆజ్ఞలకి మధ్య జరుగుతుంది. అంచెలంచెలుగా లౌకిక కోరికలకు లొంగి లోకాచారాల్లో స్థిరపడి, ఎగతాళికి, అవమానానికి, చెరసాలకు, మరణానికి తమను తాము గురి చేసుకునే కన్నా అధికారులకు లొంగటం మంచిదని కొందరు లొంగిపోతారు. ఆ సమయంలో మట్టినుంచి బంగారాన్ని వేరుచెయ్యుటం జరుగుతుంది.... వాటి ప్రకాశతను బట్టి మనం అభిమానించే నక్షత్రాలెన్నో అప్పుడు చీకటిలో కలిసిపోతాయి. ఆలయ ఆభరణాలతో తమను తాము అలంకరించుకున్నా, క్రీస్తు నీతి వస్త్రం ధరించనివారు తమ దిగంబరత్వానికి సిగ్గుపడుతూ కనిపిస్తారు. ప్రోఫెట్స్ అండ్ కింగ్స్, పు. 188.ChSTel 184.1

    మానవ చట్టాలు నిరర్ధకం చేస్తున్న దైవ ధర్మ శాస్త్రాన్ని సమర్ధిస్తున్నందుకు చెరసాల, ఆస్తినష్టం, ప్రాణ నష్ట ప్రమాదంతో పాటు నిత్యపోరాట అవకాశం మన ముందున్నది. టెస్టిమొనీస్, సం. 5, పు. 712. ChSTel 184.2

    సత్యాన్ని సమర్థిస్తూ నిలబడేవారు క్రీస్తు శ్రమల్లో పాలివారవ్వటమంటే ఏంటో గ్రహించే సమయం వడివడిగా వస్తున్నది. తాను పని చెయ్యటానికి తక్కువ సమయం ఉందని, తాను త్వరలో మానవుడి పై తన పట్టును కోల్పోతానని ఆ మహా హింసకుడు గ్రహిస్తాడు. అతడు దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతో నశించే వారిలో పనిచేస్తాడు. మూఢనమ్మకం, అపరాధం సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాలరాస్తున్నాయి. సత్యానికి విరుద్ధమైన ప్రతీశక్తి బలోపేతమౌతుంది. సదర్న్ వాచ్ మేన్, అక్టో. 31, 1905. ChSTel 184.3

    సంఘం శాంతి సమాధానాలు అభ్యుదయ కాలంలో చెయ్యలేని సేవను అతిక్లిష్టమైన, నిరాశాజనకమైన నిషిద్దమైన పరిస్థితుల్లో చెయ్యాల్సి ఉంటుంది. లోకాన్ని అనుసరించటం వల్ల ఇవ్వవీలులేని లేక నిలిపివేసిన హెచ్చరికల్ని విశ్వాస శత్రువుల నుంచి ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకత నడుమ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎవరి ప్రభావం సేవాభివృద్ధిని క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చిందో ఆ నామమాత్రపు, సంప్రదాయ వాద ప్రజలు తమ విశ్వాసాన్ని త్యజించి, ఎవరిపట్ల తమ సానుభూతి దీర్ఘకాలంగా పెరుగుతూ వచ్చిందో ఆ శత్రువులతో చెయ్యికలుపుతారు. ఈ మతభ్రష్టులు తీవ్ర శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు. వారు తమ పూర్వ సహోదరుల్ని హింసించటానికి, అపఖ్యాతి పాలుచెయ్యటానికి, వారి పట్ల ఆగ్రహం పుట్టించటానికి తాము చెయ్యగలిగినదంతా చేస్తారు. ఆ దినం మన ముందున్నది. సంఘ సభ్యులు వ్యక్తిగతంగా పరీక్షను ఎదుర్కుని తమ నిజాయితీని నిరూపించుకోవాలి. సత్యం గురించి సాక్ష్యమివ్వాల్సిన పరిస్థితుల్లో వారిని ఉంచటం జరుగుతుంది. అనేకులు బహుశా ప్రత్యేకంగా, ఏకాంతంగా, సభల ముందు, న్యాయ స్థానాల ముందు సత్యం పక్షంగా సాక్ష్యమివ్వాల్సి వస్తుంది. ఈ అత్యవసర పరిస్థితిలో తమకు తోడ్పడి ఉండే అనుభవం సంపాదించటాన్ని వారు నిర్లక్ష్యం చేస్తారు. కనుక వ్యర్థం చేసిన తరుణాలు ఆధిక్యతల గురించి వారి ఆత్మలు దఃఖంతో బరువెక్కుతాయి. టెస్టిమొనీస్, సం. 5, పు. 163. ChSTel 184.4

    సబ్బాతును ఆచరించే ఆ చిన్న సంఘంలో నేడు ప్రొటస్టాంటు లోకం రాజు గుమ్మంలో కూర్చునే మొద్దెకైని చూస్తున్నది. దేవుని ధర్మశాస్త్రం పట్ల గౌరవం వ్యక్తం చేసే అతడి ప్రవర్తన, నడవడి, దైవ భీతి విడిచి పెట్టి, ఆయన సబ్బాతును కాలరాస్తున్న వారికి నిత్యం మందలింపులా ఉంది. ఆ అవాంఛిత చొరబాటుదారుణ్ని ఏదోవిధంగా తమ మార్గంలో లేకుండా చెయ్యా లి. టెస్టిమొనీస్, సం. 5, పు. 450.ChSTel 185.1

    ప్రజల ఆచారాల్ని, సంప్రదాయాల్ని తమ ఆత్మ ప్రబోధం ప్రకారం అంగీకరించటానికి నిరాకరించే అల్ప సంఖ్యాక వర్గం పట్ల సాతాను ఆగ్రహం రెచ్చగొడాడు. చట్టరహితులు దౌర్జన్యపరులు అయిన ప్రజలతో హోదా పలుకుబడి గలవారు చేతులు కలిపి దైవ ప్రజల్ని వ్యతిరేకిస్తారు. భాగ్యం, ప్రతిభ, విద్య వారిని తిరస్కారంతో నింపటానికి దోహదపడతాయి. హింసించే పాలకులు, బోధకులు సంఘ సభ్యులు వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. గళంతో, కలంతో, ప్రగల్బాలు, బెదిరింపులు ఎగతాళితో వారి విశ్వాసాన్ని భ్రష్టం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. అబద్ధ ప్రచారం ఆగ్రహంతో కూడిన విజ్ఞప్తుల ద్వారా ప్రజల ఆవేశాల్ని రెచ్చగొడతారు. “లేఖనం ఇలా అంటున్నది” అన్నది బైబిలు సబ్బాతు ప్రబోధకులుకి సమర్పించలేక, ఆ లోటును భర్తీ చెయ్యటానికి వారు కఠిన చర్యలకు శాసనాలు ప్రతిపాదిస్తారు. ప్రజాభిమానం, ఆమోదం పొందటానికి శాసనకర్తలు ఆదివార శాసనం జారీకి సమ్మతిస్తారు. సత్యానికి అసత్యానికి మధ్య జరిగే చివరి మహా సంఘర్షణ ఈ రణరంగం పైనే జరుగుతుంది. టెస్టిమొనీస్, సం. 5, పులు. 450, 451.ChSTel 185.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents