Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయం 12
    బైబిలుసువార్త సేవ

    బైబిలు అధ్యయనాలు జరిపే ప్రణాళిక దేవుని వద్దనుంచి వచ్చింది. మిషనెరీ సేవలోని ఈ శాఖలో పనిచెయ్యగల పురుషులు స్త్రీలు అనేకమంది ఉన్నారు. శక్తిమంతులైన దైవజనులుగా పనివారు ఇలా వృద్ధిపొందవచ్చు. ఈ సాధనం ద్వారా దైవవాక్యాన్ని వేల ప్రజలకి అందివ్వటం జరుగుతున్నది. ఇలా ప్రతీ జాతి ప్రజలతో ఆయా భాషలు మాట్లాడే ప్రజలతో పని వారికి పరిచయం కలుగుతుంది. బైబిలుని కుటుంబంలోకి తేవటం పవిత్ర సత్యాలు మనస్సాక్షికి బోధపడటం జరుగుతుంది. తమంతట తామే చదివి పరిశోధించి నిర్ణయించకోవలసిందిగా మనుషులికి విజ్ఞప్తి చెయ్యటం జరుగుతుంది. దేవుని వద్దనుంచి వచ్చే ఈ వెలుగును అంగీకరించటానికి లేక తిరస్కరించటానికి బాధ్యతను వారే వహించాలి. తన నిమిత్తం చేసే ఈ ప్రశస్త సేవకు ఆయన ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు. తన పేరిట జరిగే ప్రయత్నాన్ని ఆయన విజయవంతం చేస్తాడు. గాస్ పుల్ వర్కర్స్, పు. 192.ChSTel 164.1

    మన పరలోకపు తండ్రి మనం చెయ్యాల్సిన పనిని మనకు నిర్దేశిస్తున్నాడు. బైబిలు పట్టుకుని లోకాన్ని హెచ్చరించటానికి మనం ముందుకి పోవాలి. ఆత్మల్ని రక్షించటంలో మనం దేవునికి సహాయకులమవ్వాలి. నశిస్తున్న ఆత్మలకి రోజూ ప్రవహించే క్రీస్తు ప్రేమ కాలువలమవ్వాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 150.ChSTel 164.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents