Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
క్రైస్తవ పరిచర్య - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఉచిత పంపిణీకి అవకాశాలు

    రైలు బళ్లలోను, వీధుల్లోను, సముద్రం పై పయనించే ఓడల్లోను, తపాలా ద్వారాను సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా పంచటం జరగాలి. గాస్ఫుల్ వర్కర్స్, పు. 353.ChSTel 175.2

    ప్రయాణాలు ఎక్కువగా జరిగే ఈ దినాల్లో అన్ని తరగతుల పురుషుల్ని స్త్రీలని అనేక జాతుల ప్రజల్ని కలవటానికి ఇశ్రాయేలు రోజుల్లో కన్నా ఇప్పుడు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రయాణ మార్గాలు వెయ్యిరెట్లు పెరిగాయి. దేవుడు అద్బుతరీతిగా మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. అనేక సదుపాయాలు గల అచ్చుయంత్రం మన చేతిలో ఉంది. బైబిళ్లు, అనేక భాషల్లో ఈనాటి సత్యాన్ని సమర్పించే ప్రచురణలు మన అందుబాటులో ఉన్నాయి. వాటిని లోకంలోని అన్నిచోట్లకి త్వరితంగా రవాణా చెయ్యవచ్చు. గాస్ఫుల్ వర్కర్స్, పు. 352. ChSTel 175.3

    కరపత్రాలు, పత్రికలు, పుస్తకాలు అన్ని దిక్కులకు పంపించండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి కొన్ని పత్రికలు తీసుకువెళ్లి అవకాశం వచ్చినప్పుడు ఇతరులికి పంచి పెట్టండి. అమ్మగలిగిన పుస్తకాలు అమ్మండి. అవసరాన్ని బట్టి ఎరువివ్వటమో, లేక ఊరకే ఇవ్వటమో చెయ్యండి.ప్రాముఖ్యం గల ఫలితాలు చోటుచేసుకుంటాయి. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880.ChSTel 175.4

    చిన్న ప్రచురణనల్ని ఉచితంగా పంచటంలో మనం మన విధిని నెరవేర్చటం లేదని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఈ ఒక్క సాధనం ద్వారానే యధార్ధ మైన అనేక ఆత్మలు సత్యాన్ని అంగీకరించవచ్చు... నాలుగు, ఎనిమిది లేక పదహారు పుటలు గల ఈ కరపత్రాలు చిన్న పుస్తకాలకయ్యే స్వల్పమైన ఖర్చును దైవ సేవాసక్తిగల వారి నుంచి విరాళాలు పోగుచేసి ఆ నిధినుంచి చెల్లించవచ్చును. మా స్నేహితుడికి ఉత్తరం రాసేటప్పుడు అందులో ఓ కరపత్రం పెట్టి పంపవచ్చు. దానివల్ల ఉత్తరం ఖర్చు పెరగదు. వినటానికి ఇష్టంగా ఉన్న వ్యక్తుల్ని కారుల్లో, బోటుల్లో లేక వేదిక మీద కలిస్తే వారికి ఓ కరపత్రం ఇవ్వవచ్చు. టెస్టిమొనీస్, సం. 1, పులు. 551, 552.ChSTel 176.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents